Wednesday, November 30, 2022

ద్వాదశ జ్యోతిర్లింగాలు - 12 రాశులు

మన రాశికి సరిపడిన జ్యోతిర్లింగమేదో తెలుసా?


మేషం       -   రామేశ్వరం    -  తమిళనాడు

వృషభం    -   సోమనాథ్     -  గుజరాత్

మిధునం   -   నాగేశ్వరం     -  గుజరాత్

కర్కాటకం -   ఓంకారేశ్వరం -  మధ్యప్రదేశ్

సింహం     -   వైద్యనాథ్      -  jharkhand

కన్య         -   శ్రీశైలం           -  ఆంధ్ర ప్రదేశ్

తుల        -   మహాళేశ్వరం -  మధ్యప్రదేశ్

వృశ్చికం   -   ఘృష్ణేశ్వరం   -  మహారాష్ట్ర

ధనుస్సు   -  విశ్వేశ్వరం     -  కాశి

మకరం     -  భీమశంకరం   - మహారాష్ట్ర

కుంభం     -  కేదారేశ్వరం    - ఉత్తరాఖండ్

మీనం       - త్రయంబకేశ్వరం - మహారాష్ట


రాశికొక #జ్యోతిర్లింగం

#మేషరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం #రామేశ్వరం. మేషరాశి కుజునికి స్వగృహం. చరరాశి వారికి పదకొండవ రాశ్యాధిపతి శని బాధకుడు. గ్రహపీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర, సుత్రామ పర్ణీ జరరాషి యోగే, నిబధ్య సెతుం విశిఖైర సంఖ్యె శ్రీరామ చంద్రేన సమర్పితం త, రామేశ్వరాఖ్యం నియతం నమామి అనె శ్లోకం రోజూ చదువుకొవాలి. శ్రీరామచంద్రుడు శని బాధానివారణార్థం రామేశ్వర లింగాన్ని స్థాపించాడని ప్రతీతి.


#వృషభరాశి వారి పూజాలింగం #సోమనాథ జ్యోతిర్లింగం. ఈ రాశి శుక్రునికి స్వగృహం, చంద్రునికి ఉచ్ఛ రాశి. సోమనాథ జ్యోతిర్లింగం శ్రీకృష్ణుడు స్థాపించిన మహాలింగం. ఈ రాశివారు శనిదోష శాంతికి సోమనాథ దేవాలయ దర్శనం, సౌరాష్ట్ర దేశే విదేశేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం, భక్తి ప్రాదానాయ క్రుపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకధ్యానం చేయడం శుభప్రదం. ఈ రాశివారు జన్మ నక్షత్రంలో సోమనాథంలో రుద్రాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు పొందగలరు.


#మిధునరాశి వారి జ్యోతిర్లింగం #నాగేశ్వర లింగం. ఈ రాశి బుధునికి స్వగృహం. గ్రహదోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, రోజూ యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భోగై, సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పఠించడం, ఈ రాశిలో శని సంచారకాలంలో కైలాసయంత్రప్రస్తార మహాలింగార్చన జరిపిస్తే విశేష ఫలితాలు ఉంటాయి.


#కర్కాటక రాశి వారికి #ఓంకారేశ్వరలింగం పూజనీయ జ్యోతిర్లింగం. ఈ రాశి చంద్రునికి స్వగృహం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, రోజూ కావేరికా నర్మదాయో పవిత్రే, సమాగమే సజ్జన తారణాయ, సడైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే అనే శ్లోకం పఠించడం, జన్మనక్షత్రం ఉన్న రోజు ఓంకార బీజాక్షరం జపించడం శుభకరం.


#సింహరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం శ్రీ #ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘృష్ణేశ్వర జ్యోతిర్లిగం దర్శనం, ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసాంతం చ జగద్వ రేణ్యం, వందే మహాదారాతర స్వభావం, ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని నిత్యం పఠించడం ద్వారా సర్వదోషాల నుండి విముక్తులు కావచ్చు.


#కన్యారాశి వారికి #శ్రీశైల జ్యోతిర్లింగం పూజాలింగం. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరు అన్నిరకాల బాధల నుండి ఉపశమనం పొందడానికి శ్రీశైల మల్లికార్జున దర్శనం, భ్రమరాంబకు కుంకుమ జన్మనక్షత్రం రోజున చండీ హోమం చేసుకోవాలి. శ్రీశైల శృంగే విభుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం, తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.


#తులారాశి వారికి పూజాలింగం #మహాకాళేశ్వర లింగం. ఈ రాశికి శుక్రుడు అధిపతి. మహాకాళేశ్వర దర్శనం, శుక్రవారపు సూర్యోదయ సమయంలో ఆవన్తికాయం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం, అకాల మ్రుత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని గ్రహదోషాల నుండి, బాధల నుండి విముక్తి పొందవచ్చు.


#వృశ్చికరాశి వారికి #వైద్యనాథేశ్వర లింగం పూజాలింగం. ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్రచికిత్సలకి కారణభూతమైన రాశి. వైద్యనాథేశ్వరుని దర్శించడం, పూజించడం, మంగళవారం పూర్వోత్తరె ప్రజ్వాలికానిధానే, సాదావసంతం గిరిజాసమేతం, నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాదం తమహం నమామి అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.


#విశ్వేశ్వరలింగం #ధనూరాశివారి పూజాలింగం. ఈ రాశి వారికి గురుడు అధిపతి, సానందవనే వసంతం. ఆనందకందం హతపాపబృందం వారణాసీనాథ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, కాశీ క్షేత్ర దర్శనం, గురువారం రోజున, శనగల దానం ద్వారా శని, గురూ గ్రహదోషాల నుండి విముక్తి పొందవచ్చు.


#భీమశంకర లింగం #మకరం వారి పూజాలింగం. ఈ రాశి అధిపతి శని. ఇది గురునికి నీచ, కుజునికి ఉచ్ఛ, తెలిసో, తెలియకో చేసిన దోషాల నుంచి విముక్తికిగాను భీమశంకర దర్శనం, యం ఢాకినీ శాకినికాసమాజైః నిషేమ్యమాణం పిశితశనైశ్చ, సదైవ భీమాదిపద ప్రసిద్ధం, తం శంకరం భూతహితం నమామి అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, శనివారం నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం ఈవాడం, అవిటివారికి ముసలివారికి వస్త్ర దానం చేయడం మంచిది.


#కుంభరాశి వారికి #కేదారేశ్వర లింగం శేయోలింగం. ఈ రాశికి శని అధిపతి. గ్రహపీడలు, శత్రుబాధలు, ఇతర దోషాల విముక్తికిగాను ఈ రాశివారు కేదారేశ్వర దర్శనం. నిత్యం మహాద్రి పార్శ్వేచ మునీంద్రైః సురాసురై ర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేక మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయాలి.శనివారం రుద్రాభిషేకం చేస్తే మంచిది.


#త్ర్యంబకేశ్వర లింగం #మీనరాశి వారి జ్యోతిర్లింగం. ఈ రాశి అధిపతి గురుడు. త్ర్యంబకేశరుడు ఎప్పుడూ నీటి మద్యలో ఉంటాడు. త్ర్యంబకేశ్వర దర్శనం, స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచుకోవడం, నిత్యం సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే, యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తం త్ర్యంబక మీశ మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయటం సకల శుభాలను కలిగిస్తుంది.




Sri vedajanani welfare trust - 7989112316

Srikantarushi ashramam

Pande haveli

9063833844

9491574080

Kasi yatra bhavan

Laksha guru Bagh road

7499123456

7526055510

Challa lakshman sastry. Sonapura

0542 2275107

Sri kashi gayatri

Ashramam

9918774933

8919123647

Jangam math

7084321008

Maa bhagavati guest house

Viswanath galli

9794113358

7084870123

Venkatesh hotel

Near temple

9451571025

Goudiya mission

Sonapura

945046283

9451526854

Monday, November 28, 2022

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆరు దివ్య క్షేత్రాలు

 

శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రహ్మణ్యస్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. తండ్రికే జ్ఞానబోధ చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి అన్ని దైవాలతో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులోనే అనేక ఆలయాలు అధికంగా ఉండడం విశేషం.

ఆంద్రప్రదేశ్ లో శైవ, వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్టుగానే తమిళనాడులో సుబ్రమణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కొలువై ఉన్నాయి. ఆరుముఖల స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రమణ్యేశ్వరుని ఆరు దివ్య ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రమణ్యేశ్వరుని దివ్య రూపాలను దర్శించాలనుకునే వారు ఈ ఆరు క్షేత్రాలను దర్శిస్తే సరిపోతుంది.

క్రింద చెప్పబడిన ప్రతీ క్షేత్రం గురించి సవివరంగా ఇది వరకే పోస్ట్ చేసాము గమనించగలరు. ఇప్పుడు కేవలం ఆ ఆరు క్షేత్రాలనూ భక్తితో తలచుకుంటున్నాము

తిరుచందూర్

సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీన సుబ్రమణ్యేశ్వరుని దేవాలయం తిరుచందూర్ లో ఉంది. సరన్ అనే రాక్షస రాజును సంహరించేందుకోసం స్వామివారు ఈ తిరుచందూర్ లో కొలువై నిలిచారట. తిరుచందూర్ లోని సుబ్రహ్మణ్యస్వామివారి విగ్రహం కూర్చుని ఉన్నట్టు ఉండడం ఆశ్చర్యకరం.


స్వామిమలై

స్వామి మలై అని పిలిచే ఈ క్షేత్రంకు అత్యంత విశిష్టత ఉంది. తన తండ్రి అయిన పరమశివునికి సుబ్రమణ్యస్వామి జ్ఞానోపదేశము చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలైని పేర్కొంటారు.


పళని

ఆంద్రప్రదేశ్ లోని తిరుమల క్షేత్రానికి ఎంతటి ప్రసిద్ధి వుందో తమిళనాడులో పళవి క్షేత్రానికి అంతటి ప్రసిద్ధి ఉంది. తిరుమల తరహాలోనే పళవిలోనూ నిత్యం భక్తులు కిటకిటలాడుతుంటారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.


తిరుత్తణి

తిరుపతి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రంలోనూ విశేషమైన దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. తన భార్యల్లో ఒకరైన వల్లిని సుబ్రమణ్యస్వామి తిరుత్తణిలోనే పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి.


పరిముదిర్ చోళై

దట్టమైన అడవి ప్రాంతంలో వెలసిన ఈ క్షేత్రం కూడా సుబ్రమణ్యస్వామి దివ్య క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. పైన పేర్కొన్న క్షేత్రాలే కాకుండా తమిళనాడులోని చాలా ప్రదేశాల్లో సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి.


తిరువరన్ కున్రమ్

తమిళనాడులో ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారు కొలువైన మధురైకు సమీపంలోనే ఈ తిరుపరన్ కున్రమ్ క్షేత్రం కూడా కొలువై ఉంది. తన ఇద్దరూ భార్యలలో ఒకరైన దేవసేనను సుబ్రమణ్యస్వామి వివాహం చేసుకున్న ప్రదేశమే తిరుపరన్ కున్రమ్.

కాశి ఆలయ చరిత్ర

- కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం. 

- కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.

- క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం

- క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన

- క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం

- క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన  గుజరాతి వర్తకులు

- క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి

- క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్

- క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం

- క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు

- శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి

- క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు

- క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం

- క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం

- క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు

- క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్

- కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం

- ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు

- కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం

- 184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన. 

- 12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.

- కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.

- మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.

- కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.

- విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.

- ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.

- ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.

- 2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి యుగపురుషుడు హిందువులందరికీ ఆరాధ్య మైనవాడు శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేసినారు.


శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...