Tuesday, October 18, 2022

శ్రీ గాయత్రీ మాత మహాత్యం

 ఓం ఓం ఓం హరిః ఓం హరిః ఓం హరిః ఓం ఓం ఓం.

శ్రీ రామ రామ రామ, శ్రీ రామ రామ రామ, శ్రీ రామ రామ రామ.

గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది – అవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపఈ రుద్రుడు ఉంటారని తెలుస్తోంది.

అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింపబడుతుంది. గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. శ్రీ ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగువేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది.

నవరాత్రులలో ఈ రోజు అమ్మవారిని ఉపాసన చేసి, అల్లపు గారె నివేదన చెయ్యాలి. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చెయ్యాలి. గాయత్రి స్తోత్రాలను పారాయణ చెయ్యాలి.

వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.


ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యమ్

భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.

త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.

బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.

గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి.


ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.

భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).

భువః = చిత్ స్వరూపుడు (జ్ఞాన రూపుడు).

స్వః = ఆనంద స్వరూపుడు (దుఃఖరహితుడు).

తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు.

సవితుః = ఈ సృష్టి కర్త.

వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.

భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).

దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.

ధీమహి = హ్రుదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)

యః = ఆ పరమేశ్వరుడు.

నః ద్యః = మా బుద్ధులను.

ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక

గాయత్రీ మంత్రంలో యిరువది నాలుగు అక్షరములతో పాటు యిరువది నాలుగు దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా నుండును.ఈ యిరువది నాలుగు గాయత్రీ మూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అనిపేరు.

ఈ ఇవరై నాలుగు దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేసస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.




Wednesday, October 12, 2022

శ్రీ ప్రత్యంగిరా దేవి


శ్రీ ప్రత్యంగిరా దేవి రావణుని వంశ కుల దైవం.

ప్రత్యంగిరా దేవి కాళీ దేవి యొక్క ఉగ్ర రూపం. శరభ మరియు గండభేరుండ అవతారల మధ్య భీకర యుద్ధం 18 రోజుల పాటు కొనసాగింది. వారి యుద్ధం కారణంగా మూడు లోకాలలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. అప్పుడు మాత ఆదిశక్తి, విశ్వ క్షేమమే ధ్యేయంగా, సింహం వంటి ముఖం ఉన్న భీకర అవతారాన్ని ధరించింది. ఇందులో శివుని శరభ అవతారం, విష్ణువు యొక్క రెండు అవతారాలు (నరసింహ మరియు గండభేరుండ) శక్తులు ఉన్నాయి. ఈ రూపం చాలా విస్తృతమైనది, అతని ముందు విశ్వం చాలా సూక్ష్మంగా ఉంది. ప్రత్యంగిర యొక్క ఉగ్ర రూపాన్ని ధరించి, తల్లి ఆదిశక్తి శరభ మరియు గండభేరుండ అవతారం వద్దకు వెళ్లి పెద్దగా చప్పుడు చేసింది. వారిద్దరూ యుద్ధాన్ని ఆపి, వారి అసలు అవతారలకు తిరిగి వచ్చారు. ఆ విధంగా మాత ఆదిశక్తి శివుడు మరియు విష్ణువు మధ్య జరుగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికింది. ఆమె రావణుడి వంశ దేవత కూడా. అక్కడ అమ్మవారిని నికుంబలా అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో మాతా ప్రత్యంగిర గురించి చాలా తక్కువగా తెలుసు. దక్షిణాదిలో ప్రత్యంగిరాను ఎక్కువగా పూజిస్తారు. అక్కడ చాలా దేవత ఆలయాలు ఉన్నాయి. ప్రత్యంగిర అనే పదం రెండు పదాల కలయిక. ఏ రకమైన దాడి / తంత్రం / చేతబడిని తిప్పికొట్టడం అంటే, తల్లి ప్రత్యంగిరాను పూజించడం ద్వారా, ఎలాంటి ప్రతికూల శక్తి ప్రభావం, చేతబడి మొదలైనవి తొలగించబడతాయి.

Monday, October 3, 2022

నవదుర్గలు -- ఆధ్యాత్మిక విశిష్టతలు

1. శైలపుత్రి:-  ఆధ్యాత్మిక సాధన మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును అని తెలియజేసేదే  ''శైలపుత్రి''.

2.  బ్రహ్మచారిణి:-  నిరంతరం బ్రహ్మ తత్వంతో (శూన్యంతో),  మూలాత్మతో అనుసంధానం అయి ఉండమని తెలియజేసేదే "బ్రహ్మచారిణి" తత్వం.

3. చంద్రఘంట:-  ఎవరైతే మనస్సు నియంత్రణ కలిగి ఉంటారో వారికి  'త్రినేత్ర దృష్టి' ప్రాప్తిస్తుంది అని తెలియచేసే తత్వమే  "చంద్రఘంట".

4. కూష్మాండ:-  విశ్వంలోని అన్ని చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించే మార్గాన్ని అందించే తత్వమే  "కూష్మాండ".

5. స్కంద మాత:-  సాధకులు తమలోని అరిషడ్వర్గాలను జయించాలి అని తెలియచేసే తత్వమే "స్కందమాత".

6. కాత్యాయని:-  తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో త్రిగుణాలకు (సత్వ, రజో, తమో గుణాలకు) అతీతంగా సాధన చేయాలి అని తెలియజేసేదే  "కాత్యాయని".

7. కాళరాత్రి:-  ప్రతి అంతం... ఒక నవ ఆరంభానికి సంకేతం అని తెలియజేసేదే  "కాళరాత్రి".

8. మహాగౌరీ:- మన ఆత్మ సాధన (ధ్యానం) మహా పాపాలను కూడా హరిస్తుంది అని తెలియజేసేదే  "మహాగౌరీ".

9. సిద్దిధాత్రి:-  ఆధ్యాత్మికత సర్వసిద్ధులను కలుగచేయును అని తెలియజేసే తత్వమే  "సిద్ధిధాత్రి".

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...