Thursday, July 28, 2022

జయమునిచ్చు మంత్రం

 ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించి స్వామికి ఒక్క కొబ్బరి కాయ పంచదార ను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి ఒక్క సారిగా మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది!!  మీ మనసు తేలిక పడిన తరువాత చిన్న పిల్లల కు పానకం వడపప్పు పంచండి చాలు ఉప్పొంగిపోతారు మారుతి! 

ఇది సుందరకాండ లో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్య నూ లక్ష్మణుడు ని సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మ కి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం ఇది!!


జయత్యతి బలో రామః 

లక్ష్మణస్య మహా బలః !

రాజా జయతి సుగ్రీవో 

రాఘవేణాభి పాలితః !!


దాసోహం కౌసలేంద్రస్య 

రామస్యా క్లిష్ఠ కర్మణః !

హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజః !!


నరావణ సహస్రం మే 

యుధ్ధే ప్రతిబలం భవేత్ !

శిలాభిస్తు ప్రహారతః

పాదపైశ్చ సహస్రశః !!


అర్ధయిత్వాం పురీం లంకాం 

మభివాద్యచ మైథిలీం !

సమృధ్ధార్థ్యో గమిష్యామి 

మిషతాం సర్వ రక్షసాం !!


అర్థం : మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు.

శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయిమంది రావణులైనను యుధ్ధ రంగమున రంగమున నన్నెదిరించి నిలువ జాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశన మొనర్చెదను. రాక్షసులందరును ఏమియూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను.

ఇది పఠించిన వారికి జయం తధ్యం

జయ శ్రీ రామ ..శుభమ్ భూయాత్


Sunday, July 24, 2022

ఏ నక్షత్రానికి ఏ గణపతి స్వరూప ఆరాధన చేయాలి

 1. అశ్విని  -- ద్వి ముఖ గణపతి ‌

2. భరణి -- సిద్ద గణపతి.

3. కృత్తిక - ఉఛ్ఛిష్ఠ  గణపతి .

4. రోహిణి - విఘ్న గణపతి ‌

5. మృగశిర - క్షిప్ర గణపతి.

6. ఆరుద్ర - హేరంబ గణపతి .

7. పునర్వసు - లక్ష్మి గణపతి. 

8. పుష్యమి - మహ గణపతి. 

9. ఆశ్లేష - విజయ గణపతి. 

10. మఖ - నృత్య గణపతి. 

11. పుబ్బ - ఊర్ధ్వ గణపతి. 

12 ఉత్తర - ఏకాక్షర గణపతి. 

13. హస్త - వరద గణపతి .

14. చిత్త -  త్య్రక్షర గణపతి. 

15. స్వాతి - క్షిప్రసాద గణపతి. 

16. విశాఖ - హరిద్ర గణపతి. 

17.అనూరాధ - ఏకదంత గణపతి. 

18. జ్యేష్ఠ - సృష్టి గణపతి .

19 మూల ఉద్దాన గణపతి. 

20.పూర్వషాఢ- ఋణ విమోచన గణపతి. 

21.  ఉత్తరాషాఢ - ధుండి గణపతి. 

22. శ్రవణం - ద్వి ముఖ గణపతి. 

23. ధనిష్ట - త్రిముఖ గణపతి. 

24. శతభిషం - సింహ గణపతి. 

25. పూర్వాభాద్ర - యోగ గణపతి. 

26. ఉత్తరాభాద్ర - దుర్గా గణపతి. 

27. రేవతి - సంకట హర గణపతి.           

పై గణపతి ఆరాధన వలన మన పూర్వ జన్మ కర్మల నుండి బయట పడి భగవంతుని అనుగ్రహం పోందుతాము. అలాగే మన ఆత్మ ద్వాదశ జ్యోతిర్లింగాలు కు ముడి పడి వుంది. పై గణపతులు మరియి,నక్షత్రాలు యెక్క అనుబంధం అర్దం చేసుకుంటేనే ద్వాదశ భావాల అర్థం

Friday, July 15, 2022

తెలుగు భాష

 Telugu rani andaru chadivinchukovali.ఒక తమిళ వ్యక్తి రాసిన వ్యాసాన్ని యధాతధంగా.....

నా మాతృ భాష తమిళ భాష. దాని అర్థం ఇతర భాషల ను గురించి తెలియదని కాదు. తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.

తెలుగు మాతృ భాష గా ఎవరికి వున్నదో, తెలుగు భాష ను ఎవరు ప్రేమిస్తున్నారొ, తెలుగు గురించి ఎవరు తెలుసుకుందాము అనుకుంటున్నారో వారి కోసం కొన్ని విషయాలు.

1. తెలుగు భాష సుమారు క్రీ. పూ. 400 క్రితం నుండి  వుంది.

2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడినది. మొదటి లిపిగ కొరియన్ భాష.

3. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు వుత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలన భాష ల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.

4. శ్రీలంక లో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.

5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.

6.  ఇటాలియన్ భాష లాగానే   తెలుగు భాష లో కూడా  పదాలు హల్లు శబ్దం తో అంతమౌతాయని 16 వ శతాబ్దంలో ఇటలీ కి  చెందిన  నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే  తెలుగు భాషను " ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్". అని అంటారు .

7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు. ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానం ను పొందింది.

8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. హిందూ పురాణాల ప్రకారం  త్రిలింగక్షేత్రాలు నైజం ప్రాంతం లోని కాళేశ్వరం, రాయలసీమ లోని శ్రీశైలం, కోస్తా లోని భీమేశ్వరమ్ ల మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.

9. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాష లో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దం తో పూర్తి అవుతుంది.

10. తెలుగు భాష లో వున్న అన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాష లోన లేవు.

11. తెలుగు భాష ను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.

12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.

13. 200 సం. ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతే.

14. రామాయణ మహభారతాలు లో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాష సాహిత్యం లో కూడా లేదు.

కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన వోకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.

15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగలో వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పి తెలుగు ను  తన సామ్రాజ్యం లో అధికార భాష గా చేసాడు.

16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే. 

తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకత ను అందిస్తుంది ఆనడం లో ఏమాత్రం సందేహం లేదు.

పై విషయాలు అన్నీ వొక తమిళ వ్యక్తి  ఆంగ్లం లో  తెలియజేసిన విషయాల ను అనువదించారు. కానీ ఇది నిజం. ఇంత గొప్ప మన భాషను మన భవి తరాలవారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరం పై వుంది. తెలుగు భాష ను చంపేసే తరం గా మనం వుండకూడదని నా భావన. 

ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు. కానీ అది ఏమి దౌర్భాగ్యం, ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో గానీ మనం మాత్రం ఆంగ్ల భాష లో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆపదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇకనుంచి అయినా తెలుగు భాష పై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగు లో మాట్లాడుదాం. 

 ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాష ను బలిచేయనవసరం లేదు. 

తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుదాం. 

అష్టభైరవులు - రూపాలు - మహిమలు

మనుషులుగా ఈ భూమ్మీద జన్మించి కష్టాలు, దుఃఖాలు అనుభవిస్తున్న జీవులు తమ దుఖాలను నివృత్తి చేసుకోవడం కోసం భైరవుడిని సేవించాలి. 

సతీదేవి శరీరత్యాగం చేసిన కారణంతో శివుడు దుఖాన్ని తట్టుకోలేక భైరవ రూపాన్ని ఆశ్రయించాడు.  కనుక భైరవుడిని సేవిస్తే శివున్ని సేవించినట్లే. 

"నేను భైరవ రూపంలో లోకానికి సుఖం చేకూర్చూతాను." అని సదాశివుడి వాక్యం. 

అసితాంగో రురుశ్చండహ్ క్రోధశ్చోన్మత్త భైరవ కపాలీ భీషణశ్చైవ సంహారశ్చాష్టభైరవాహ్!

*కాలభైరువుడికి ఎనిమిది రూపాలు ఉన్నాయి . 1.అసితాంగ భైరవుడు 

2.రురు భైరవుడు.

3. చండ భైరవుడు.

4.క్రోధ భైరవుడు.

5.ఉన్మత్త భైరవుడు.

6.కపాల భైరవుడు.

7. భీషణ భైరవుడు.

8.సంహార భైరవుడు.

ఈ ప్రతి ఒక్క రూపానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.

 

*1. అసితాంగ భైరవుడు : 

 ఈయన నల్లని/బంగారు శరీరఛాయలో, శాంతి రూపంలో , దిగంబర శరీరంతో , మూడూ కళ్ళతో, బ్రహ్మీ శక్తితో కూడి నాలుగు చేతులతో ఉంటాడు. అక్షమాల, ఖడ్గం, కమండలం, పానపాత్ర నాలుగు చేతులలో ధరిస్తాడు. ఈయన హంసవాహనుడు. వరాలనిస్తాడు భూషణాధికారి.

సరస్వతి ఉపాసకులు అసితాంగ భైరవుని అర్చించి సిద్ధి పొందాలి. 

ఆ తరువాతే సరస్వతీ ఉపాసన సిద్ధిస్తుంది. 

ఈయన బ్రహ్మ స్వరూపుడు. మహా సరస్వతికి క్షేత్రపాలకుడు . ఈయన తూర్పు దిశకు అధిపతి. 


*2. రురు భైరవుడు :  

ఈయన స్వచ్చమైన స్పటికంలాగ తెల్లని శరీర ఛాయతో, మూడు కళ్లతో, నాలుగు చేతులతో, దిగంబర శరీరంతో, చిరునవ్వుతో  మహేశ్వరి శక్తి తో కూడిన కుమారరూపంతో వృషభ వాహనుడిగా ఉంటాడు.

నాలుగు చేతుల్లో కత్తి, టంకము, పాత్రను, లేడిని ధరించి ఉంటాడు. శ్యామల, ప్రత్యంగిర,  దశమహావిద్యలు మొదలగు ఉపాసకులు ముందు ఈయనని ఉపాసన చేయాలి. ఈయన అనుగ్రహంతోనే అమ్మవారి ఉపాసనలు సిద్ధిస్తాయి. ఈయన రుద్ర స్వరూపుడు.  రుద్రాణికి క్షేత్రపాలకుడు  ఈయన ఆగ్నేయ దిశకు అధిపతి.

 

*3 . చండ భైరవుడు : 

 ఈయన తెల్లని శరీర ఛాయతో, మూడు కళ్ళతో, నాలుగు చేతులతో, దిగంబరంగా, కౌమారి శక్తితో, శాంత కుమార రూపంలో నెమలి వాహనంతో ఉంటాడు. సుబ్రమణ్య ఉపాసకులు, కన్యకాపరమేశ్వరి ఉపాసకులు ముందుగా ఈయన ఉపాసన చేయాలి. ఈయన అనుగ్రహంతోనే ఈ ఉపాసనలు సిద్దిస్తాయి. ఈయన సుబ్రమణ్య స్వరూపుడు. సర్పదోషాలు ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు ఈయన్ని ఉపాసించాలి. ఈయన దక్షిణ దిశకు అధిపతి. 

 

*4. క్రోధ భైరవుడు:  

 ఈయన నీలి శరీర ఛాయతో, మూడు కళ్ళతో, నాలుగు చేతులతో, దిగంబర శరీరంతో,  వైష్ణవి శక్తితో కూడిన శాంత రూపంతో గరుడ వాహనారూడుడై ఉంటాడు. నాలుగు చేతుల్లో గద, చక్రం, పానపాత్ర, శంఖం ధరించి ఉంటాడు. వైష్ణవ ఉపాసకులు అంటే గరుడ, హనుమ, సుదర్శన, నారసింహ, వరాహ, కృష్ణ ఉపాసకులు ముందుగా ఈయన ఉపాసన చేయాలి. ఈయన విష్ణు స్వరూపుడు. నైరుతి దిశకు అధిపతి. 

 

*5. ఉన్మత్త భైరవుడు: 

 ఉన్మత్త భైరవస్వామి బంగారం లాగ పచ్చని శరీర ఛాయతో, మూడు కండ్లతో, నాలుగు చేతులతో, దిగంబరుడిగా, వారాహి శక్తితో కూడిన శాంత రూపంలో, అశ్వరూడుడై ఉంటాడు. నాలుగు చేతుల్లో రోకలి, కత్తి, కపాలము, వేటకత్తి ధరించి ఉంటాడు. వారాహి, కుబేర ఉపాసకులు ఈయన్ని ఉపాసన చేయాలి. ఈయన అనుగ్రహంతోనే ఈ ఉపాసనలు సిద్ధిస్తాయి. ఈయన వారాహి స్వరూపుడు . పశ్చిమ దిక్కుకి అధిపతి . 


*6 . కపాల భైరవుడు :  ఈయన ఎర్రని దేహకాంతితో , మూడు కళ్ళతో , నాలుగు చేతులు , దిగంబర శరీరంతో , ఇంద్రాణీ శక్తితో కూడిన శాంతమైన బలరూపంతో గజవాహనుడై ఉంటాడు . నాలుగు చేతుల్లో వజ్రం , ఖడ్గం , పానపాత్ర , పాశం ధరించి ఉంటాడు . భౌతిక సుఖ సంపదలు కావాల్సిన వారు ఈయన ఉపాసన చేయాలి . ఈ ఉపాసనతో ఈ లోకంలోనూ , స్వర్గలోకంలోను సుఖాలు సిద్ధిస్తాయి . ఈయన దేవరాజు ఇంద్ర స్వరూపుడు . స్వర్గ క్షేత్రపాలకుడు . ఈయన వాయువ్య దిశకు అధిపతి. 


*7. భీషణ భైరవుడు:  ఈయన ఎర్రని శరీర ఛాయతో , మూడు కళ్ళతో , నాలుగు చేతులతో , దిగంబర శరీరంతో , చాముండా శక్తితో , శాంత బాలరూపంతో , సింహ వాహనారూడుడై ఉంటాడు . నాలుగు చేతుల్లో శూలం , ఖడ్గం , కపాలము , ముద్గరం ధరించి ఉంటాడు . చండి , చాముండా ఉపాసకులు ఈయన్ని ఉపాసన చేయాలి . ఈయన అనుగ్రహంతో చండీ సప్తసతి సిద్ధిస్తుంది . ఈయన చాముండాకు క్షేత్ర పాలకుడు . ఈయన ఉత్తర దిశకు అధిపతి . 


*8 . సంహార భైరవుడు :  సంహార భైరవుడు మూడు కళ్లు , పది చేతులు కలవాడై , నాగ యజ్ఞోపవీతం ధరించి , దిగంబరంగా , బాల రూపంతో , కోరలు గల భయంకర వదనంతో , కుక్క వాహనంగా గలవాడై ఉంటాడు . చేతుల్లో శూలం , చక్రం , గద , ఖడ్గం , అంకుశం , పాత్ర , శంఖం , డమరుకం , వేటకత్తి , పాశం ధరించి ఉంటాడు . తాంత్రికులు కాపాలికులు, యామలులు, ముందుగా ఈయన్ని ఉపాసించాలి . ఈయన దయవల్లే తాంత్రిక షట్కర్మలు సిద్ధిసిద్ధించి ఫలవంతమౌతాయి. ఈయన సర్వశక్తి స్వరూపుడు . తంత్ర క్షేత్రపాలకుడు . ఈయన ఈశాన్య దిశకు అధిపతి. 


"దిగంబరాయ విద్మహే కాశీక్షేత్రపాలాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్"🙏


 లోకా సమస్తా సుఖినోభవంతు.

Wednesday, July 13, 2022

మృత సమయము నందు ఆశౌచ సమయ నిర్ణయ చక్రము



వ్యాసపూర్ణిమ , గురుపౌర్ణమి - విశిష్టత

మనందరిలోనూ పవిత్రమయిన హృదయం ఉంది.    కాని చీకటి అనే అజ్ఞానంతో మనసంతా చెడు ఆలోచనలతోనూ , దుర్గుణాలతోను నిండిపోవడం వల్ల

దానిని గుర్తించలేక పోతున్నాము. మన అజ్ఞానం ఎంతంటే? దీపం వెలిగించ మన్నప్పుడు నీటికీ , నూనెకు తేడా తెలియనట్టు వంటి చీకటి స్థితిలో ఉన్నాము. మరి ఈ చీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలించు కోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం.


గురువు అంటే :-

గురువు అంటే బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపమే గురువు. గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని , రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని  గురువు అంటే అజ్ఞానాన్ని నశింప చేయువారు అని అర్ధము. గు శబ్దమంధకారస్యరుతన్నిరోధకః అని పెద్దల వచనం!  గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోకి తీసుకు రావడం. ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడూ సంసారయాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం.

ఆ గురువు సాన్నిధ్యంలో కామ క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలు అనే దుర్గుణాలను , అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది. అప్పుడు ఆ పవిత్ర మైన హృదయంలో జ్ఞానమనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది. 

విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఒకప్పుడు గురుకులాలుండేవి. వాటిలో చేరిని విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ , పితృదేవోభవ , ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే. 

"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" 

దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు , జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి , గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు. 

"గురువునూ , గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే , గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్త కబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.

గురు పూర్ణిమ విశిష్టత 

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ !

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ !!

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే !

నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః !!

ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మ తిథి అయిన గురు పూర్ణిమ గా మనం జరుపుకుంటాం. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి , ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.

గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.

సనాతన ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.

లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిఅయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది. మామూలు రోజులలో కన్నా ఈ వ్యాస పూర్ణిమ నాడు గురువు నుండి వెలువడే ఆశీర్వచనాలు వేయి రెట్లు ఎక్కువగా పొంద వచ్చట.. అందుకే ఈ రోజు గురుపూజోత్సవం లో పాల్గొని గురువు కరుణా కటాక్షములను పొందవచ్చు.. 

గురు అనే పదంలో ’గు’ అనే అక్షరం అంధకారాన్ని ’రు’ అనే అక్షరం వెలుగును సూచిస్తాయి.. 

ఙ్ఞానశక్తి సమారూఢః తత్త్వమాలావిభూషితః |

భుక్తిముక్తి ప్రదాతా చ తస్మై శ్రీ గురవే నమః ||

శిష్యునిలో అజ్ఞానాంధకారాలను తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటాడు.. కాబట్టి... గురువుకే ప్రథమ స్థానమునిచ్చారు.. మాతా , పిత , గురువులలో జన్మనిచ్చిన వారి ప్రక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించినది ఇందుకే...

అలానే ఈ రోజు తప్పకుండా ఈ శ్లోకం స్మరించుకోవాలి..

నమోస్తుతే వ్యాస విశాల బుద్దే పుల్లార విందాయత పత్రనేత్ర |

వినత్వయా భారత తైల పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమాయః ప్రదీపః ||

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |

తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః ||

(’గురువును మించిన తత్వం తపస్సు జ్ఞానం వేరొకటి లేవు’)

గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా , చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని , బ్రహ్మదేవుడిని , వసిష్ఠులవారిని , శక్తిమునిని , పరాశరుడిని , వ్యాసులవారిని , శుకమహామునిని , గౌడపాదులవారిని , గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. 


వ్యాస పూర్ణిమ గురుపూర్ణిమ

నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతీ ద్వాపరయుగం లోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో 4 పాదాలతో , త్రేతాయుగంలో 3 పాదాలతో , ద్వాపరయుగంలో2 పాదాలతో , ఈ కలియుగంలో 1 వ పాదంతో , నడుస్తుంది.

వసిష్ఠమహామునికి మునిమనుమడు , శక్తి మహామునికి మనుమడు , పరాశరమునికి పుత్రుడు , శుకమర్షికి జనకుడైనట్టియు , నిర్మలుడైనట్టి , తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ , అంటారు 

నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు. 

వ్యాసమహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. ప్రతి ద్వాపర యుగములోను ఒక సారి వ్యాసుడు ఉద్భవిస్తాడు. ప్రస్తుతం మనం ఉంటున్నది వైవస్వత మన్వంతరంలో ని 28 వ యుగంలోని వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు కాలంలో.

ఇంతవరకు వ్యాసపీఠాన్నధిరోహించిన వ్యాసులు పేర్లు

1. స్వాయంభువ 

2. ప్రజాపతి

3. ఉశన 

4. బృహశ్పతి 

5. సవిత 

6. మృత్యువు 

7. ఇంద్ర 

8. వశిష్ఠ 

9. సారస్వత 

10. త్రిధామ 

11. త్రివృష 

12. భరద్వాజ 

13. అంతరిక్షక 

14. ధర్ముడు 

15. త్రయారుణ 

16. ధనుంజయుడు 

17. కృతంజయుడు 

18. సంజయ 

19. భరద్వాజ 

20 గౌతమ 

21. ఉత్తముడు 

22. వాజశ్రవ 

23. సోమశుష్మాయణ 

24. ఋక్షుడు 

25 శక్తి 

26. పరాశరుడు 

27. జాతూకర్ణి 

ప్రస్తుతం 28 వ వేదవ్యాసుని పేరు కృష్ణద్వైపాయనుడు....


ఆయన జన్మించిన తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ గా జరుపుకుంటాం. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది.

28 వ వేద వ్యాసుల వారి జయంతి. ఇతడు పరాశర మహర్షికి , మత్స్య గంధికి (సత్యవతి) కి కృష్ణ వర్ణం (నల్లని రంగు) తో ఒక ద్వీపంలో జన్మించారు కనుక కృష్ణద్వైపాయనుడు అని పిలవబడ్డాడు. పుట్టీ పుట్టగానే చేతిలో కమండలం , దండము చేతబట్టి  తపస్సు చేసుకోవటానికి వెళ్తానని తల్లి మత్ష్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్ళిన తపోధనుడు కృష్ణద్వైపాయనుడు.

వ్యాస మహర్షి నాలుగు వేదాలను విభజించి లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం సోమకాసురుడు వేదాలను సముద్రంలో దాచేస్తే..  శ్రీ మహా విష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడు. అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాపులగం అయిపోగా.. వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడు. వేదరాశి ని నిత్య కర్మలలో క్రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి ఋక్-యజుర్-సామ-అధర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడైనాడు. ఆతర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా ... వేదసారాన్నంతా చేర్చి పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ్రంధస్తం చేసాడు.  అంతేకాక భాగవతాన్ని , అష్టాదశ పురాణాలను మనకు ప్రసాదించాడు. సాక్షాతు శ్రీ మహా విష్ణువు అవతారంగా భావించే వ్యాస భగవానుని గానూ ఆదిగురువుగానూ భావిస్తారు.

విష్ణు సహస్రనామ పీఠిక లో కూడా.....

"వ్యాసాయ విష్ణు రూపాయ - వ్యాస రూపాయ విష్ణవే

నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమోనమ: !!

అని వ్యాసునికి విష్ణువుకు  అభేదం చెప్ప బడింది , వేదవ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలని విభజించి  పైలుడను శిష్యునకు ఋక్సంహితను , వైశంపాయనునకు యజుస్సంహితను , జైమినికి సామసంహితను , సుమంతునకు అధర్వణ సంహితను భోధించి వానిని లోకములో  వ్యాప్తి చేయండని ఆదేశించాడు.  వ్యాసుడు వేదాలని విభజించటమే కాకుండా అష్టా దశ పురాణాల్ని , ఉపపురాణాలను రచించాడు. బ్రహ్మసూత్రాల్ని వివరించాడు , భారత , భాగవతాలని రచించాడు. తాను గ్రంథస్థం చేసిన పురాణేతిహాసములను సూతునకు తెలియజేసి ప్రచారం చేయమని చెప్పాడు. 

వ్యాస భగవానుని అనుగ్రహం వలన జ్ఞానం విస్తరించి విశ్వవ్యాప్తం అయ్యింది. సూత మహాముని ప్రథాన ప్రచారకుడై విషయములు బహుళ ప్రచారం చేసాడు. 

స్మృతి కర్తలలో వ్యాసులవారు ఒకరు.  రెండధ్యాయముల ఈ గ్రంథానికి లఘు వ్యాస స్మృతి అని పేరు. ఇందులో మానవులకు ఉపయోగ పడే ఆచార విషయములు ఉన్నాయి. ఇదే వ్యాస సంహిత గా విఖ్యాతి పొందింది.

వ్యాస మహర్షి సుపుత్రుని కోసం తపస్సు చేసి శివుని నుంచి వరాన్ని పొందాడు. ఆయనకు ఘృతాచి  అనే అప్సరస వలన బ్రహ్మ జ్ఞాని ఐన శుకుడు జన్మించాడు. 

వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే , పౌత్రమకల్మషమ్ |

పరాశరాత్మజమ్ వందే శుక తాతం తపోనిధిమ్ ||

తాత్పర్యం:- వశిష్టుని మునిమనుమడైన కల్మష రహితుడైన శక్తికి మనుమడైన పరాశరుని కుమారుడైన , శుకమహర్షి తండ్రి అయిన ఓ వ్యాస మహర్షి నీకు వందనము. 

వ్యాసో నారాయణో హరిః " అన్నారు. వ్యాస భగవానులు సప్త చిరంజీవులలో ఒకరు.

మహాభారత రచనకు తనమనసులో ఒక ప్రణాళికను తయారుచేసుకొన్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతుంటే..... అంత వేగంగా వ్రాసే వారు ఎవరు ఉన్నారూ అని విచారంలో ఉండగా..... బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి , అతని ఎదుట ప్రత్యక్షమయ్యి "వ్యాసా ! నీ కావ్యరచనకి, తగినవాడైన గణపతిని స్మరించు." అని తెలిపి అద్రుశ్యమయ్యాడు. అంతట వ్యాసుడు గణేశుని ప్రార్థించగా.... గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. నేను మనసులోనే రచించిన భారతాన్ని నేను చెబుతూ ఉంటే నీవు  వ్రాయాలి అని కోరాడు వ్యాసుడు. సరే అని ఒక షరతు పెట్టాడు గణేశుడు.  నేను వ్రాసే ఘంటం ఆగకుండా నీవు చెప్పాలి. నా ఘంటం ఆగిన యెడల నేను వ్రాయను అని అన్నాడు. దానికి వ్యాసుడు అంగీకరించి నేను చెప్పిన శ్లోకాలను అర్థం చేసుకొని నీవు వ్రాయాలి అని అన్నాడు.... ఈ నియమానికి అంగీకరించాడు గణపతి. ఇలా వేద ధర్మాలను ప్రతిపాదిస్తూ వేదవ్యాసుడు చెబుతూ ఉంటే , నాలుగు వేదాల సారమైన పంచమవేదం అని మనం చెప్పుకొనే మహాభారతం అవతరించింది.

ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై దృతరాష్టుని , అంబాలికకు పాండు రాజుని , అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు. పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే ! దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలుపొందాడు. కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా మూడు సంశ్ర…మించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేసాడు వ్యాసుడు. ఆ జయమే మహా భారతమైంది. 

కలియుగంలో మానవులు అల్పబుద్ధులు , అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా.... అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు. అర్థం చేసుకోలేరు.

వేదమంటే అసలు ఎవరూ తయారుచేసింది కాదు. స్వయం భగవానుని ముఖతః వేలువడినదే వేదము. అందుకే అతనిని "వేదపురుషుడు" అని అంటారు. వేదములో విషయాలు ఉన్నాయి. వేదములో లేనివి--- మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులగంగా ఏక రూపంలో ఉంటాయి. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని, భగవానుడే ప్రతీ ద్వాపరయుగంలోనీ వ్యాసుడుగా అవతరించి , వేదాలను విభజిస్తాడు మందబుద్దుల కోసం వేదాధ్యాయానికి , అవకాశం లేనివారికోసం వేదంలోని విశేషాలను , ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించాడు.  

ప్రాచీన గాథలు , గత కల్పాలలో జరిగిన చరిత్రలు , సృష్టికి పూర్వం అనేక సృష్టులలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమయినాయి. ఎవరు వాటిని అర్ధం చేసుకోవాలన్నా , ఇతరులకి చెప్పాలన్నా అంతరార్ధాలతో బోధించాలన్న వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేదు , చదవలేదు. అందుకే వ్యాసపూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యం ! వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు.


పూజా విధానం (వ్యాస పూజ , గురు పూజా విధానం)

కొత్త అంగవస్త్రం మీద (భూమి మీద పరచి) బియ్యం పోస్తారు. ఆ బియ్యంపైన నిమ్మ కాయలు ఉంచు తారు. శంకరులు , అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికిడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపు తారుట. బియ్యం , కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం , నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభ కోణంలో , శృంగేరీలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు.

ఎంతో మంది ఋషులున్నా వ్యాసుని పేరిటే ఎందుకు జరుగుతుంది అంటే , ఈ పూజలో ప్రత్యేక పూజలు పొందే ఆది శంకరులు వ్యాసుని అవతారమని అంటారు. సన్యాసులంతా ఆది శంకరుని తమ గురువుగా ఎంచుకుంటారు. అయితే ఈ రోజున సన్యాసులంతా వ్యాసుని రూపంలో వున్న తమ గురువుని కొలుస్తున్నారన్న మాట! వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమనాడు విష్ణులోకం పొందుతారుట. వ్యాసుడు సకల కళా నిధి , సకల శాస్త్రవేత్త , శస్త్ర చికిత్సవేది , మేధానిధి , వైద్యవరుడు , ఆత్మవిద్యానిధి , వైద్య విద్యానిధి. ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి.

వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి:

శో: శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం

సూత్ర భాష్యవృతా వందే భగవంతౌ పునః పునః

అని పఠిస్తే బ్రహ్మత్వసిద్ధి కలుగును!


గురు సందేశము :-

వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది.

సర్వభూతముల యందు దయకలిగియుండుట , సత్యమార్గములో నడుచుట , శాంతగుణాన్ని కలిగియుండుట  ఈ మూడు గుణాలని అందరూ అలవరచుకోవాలి అని వ్యాసులవారు తెలియచేసారు.

మనందరికీ దేవరుణము , ఋషిరుణము , పితృఋణము   అని మూడు ఋణాలు ఉంటాయి. వీటితోపాటు వేదవ్యాసుడు మనుష్య ఋణము కూడా ఉంటుందని తెలియచెప్పాడు. సర్వప్రాణుల యందు దయతో ఉండటం , ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య ఋణం తీర్చుకోవచ్చును అని చెప్పాడు.

ఇంతటి ఆది గురువుని పూజించుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తరవాత తరాలకి అందించుట మన ధర్మం.

మన పిల్లలకు ఇతిహాస , పురాణాల పట్ల , ప్రాచీన సంస్కృతీసాంప్రదాయాల పట్ల , అభిరుచి కలిగించుట మన కర్తవ్యం. వీటిలో కొన్నయినా సాధించగలిగితే వ్యాసులవారి ఋణం కొంతయినా మనం తీర్చుకున్నట్లు అవుతుంది. ఆ వ్యాసభగవానుని కృపకు మనము పాత్రులము కాగలము అని ఆశిద్దాం. అందుకే గురుపూజను చేసుకుందాం. సాటి గురువులో భగవంతుని దర్శిద్దాం.


వ్యాస భగవానుడు చారిత్రిక పురుషుడే !!

(వేదవ్యాసుడి చారిత్రికతను నిరూపించే  పరిశోధనాత్మక వ్యాసం - రచన: వినుకొండ మురళీమోహన్, శ్రీసుశీల )

వ్యాసమహర్షి చారిత్రిక పురుషుడు, చిరంజీవి అని చరిత్రలు నిరూపిస్తున్నాయి.

మన పురాణములలో 

మార్కండేయుడు, 

అశ్వత్థామ, 

బలి చక్రవర్తి, 

వేదవ్యాసుడు, 

హనుమంతుడు, 

విభీషణుడు, 

కృపాచార్యుడు, మరియు

పరశురాముడు 

వీరు ఎనిమిది మందిని చిరంజీవులుగా చెప్తారు. 


వేదవ్యాసుడు చారిత్రిక పురుషుడు, చిరంజీవి అని చెప్పడానికి ఆదిశంకరాచార్యుని చరిత్రలో పేర్కొన్న ఒక సంఘటనను ఇక్కడ ఉదహరిస్తున్నాము. 

ఆదిశంకరాచార్యుడు  పదహారేళ్ళవయసులో కాశీక్షేత్రములో ఉన్నప్పుడు, ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆదిశంకరాచార్యుని వద్దకు వచ్చి, వేదవ్యాసుడు రచించిన బ్రహ్మసూత్రముల గురించి శంకరాచార్యుడు రచించిన భాష్యముపై వాదన మొదలుపెట్టాడు. శంకరాచార్యుడు ఆ వృద్ధబ్రాహ్మణుడు వాదించుచున్న తీరును, అతని మేధస్సును చూసి ఆశ్చర్యపోయాడు. వారము రోజులపాటు వారి వాదనలు కొనసాగాయి. శంకరునికి వాదిస్తున్నవారు బ్రహ్మసూత్రకర్త వేదవ్యాసుడే అని అర్థమై, అతని ముందు మోకరిల్లాడు. వ్యాసుడు శంకరునితో “నీ భాష్యమును నేను పూర్తిగా అంగీకరించుచున్నాను, నీవు మరొక పదహారు సంవత్సరములు జీవించి అద్వైత సిద్ధాంతమును వ్యాప్తి చెయ్యి” అని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు. 

ఆదిశంకరుడు 2500 బి.సి.ఇలో జీవించినట్లు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి మహాస్వామి శాస్త్రీయ పరిశోధనలు చేయించి నిర్థారించారు. 

(ఆధారము: శృంగేరి శారదాపీఠంవారు ప్రచురించిన ‘శంకర దిగ్విజయము’ రెండవభాగము)

వేదవ్యాసుడే మధ్వాచార్యుని గురువు  

12వ శతాబ్దమునకు చెందిన మధ్వాచార్యుడు (1231ఏ.డి) సాక్షాత్తు వేదవ్యాసుని వద్దే సకలశాస్త్రములను అభ్యసించాడని మధ్వాచార్యుని చరిత్ర చెప్తోంది.

(ఆధారము: శ్రీమాన్ మధ్వాచార్య చరిత్ర, 8వ అధ్యాయము)

పై చారిత్రిక ఆధారాలను బట్టి వేదవ్యాసుడు చారిత్రిక పురుషుడు, చిరంజీవి అని నిర్ధారణ అవుతోంది. బదరికావనములో ఆయన నేటికీ సూక్ష్మరూపములో ఉన్నారని పెద్దలు చెపుతారు. 


ఆంధ్రరాష్ట్రములతో వ్యాసుని అనుబంధము - చారిత్రిక సత్యము!!!

వ్యాసుడు సుమారు ఏడువేల సంవత్సరముల క్రితం గోదావరీ తీరాన ఉన్న ‘దక్ష ఆరామము’ అంటే నేటి ‘ద్రాక్షారామము’ క్షేత్రములో ఉన్న శ్రీభీమేశ్వరుని సేవించి, గోదావరినది తీరాన ఉన్న భీమమండలమంతా సంచరించి ‘భీమఖండము’ అను పురాణమును మనకు అందించారు. వ్యాసుడు రచించిన ‘స్కాందపురాణము’లోని ‘గోదావరిఖండము’ (భీమేశ్వర పురాణము) లో ఈ వివరములన్నీ ఉన్నాయి. 

దక్షారామము శివుని భార్య సతీదేవి యొక్క పుట్టినిల్లు. దక్షుడు యజ్ఞమును చేసిన ప్రదేశమది. తనతండ్రి దక్షుడు, తనభర్తను అవమానించినందుకు, సతీదేవి తనశరీరమును చిదగ్నియందు దహింప చేసుకున్న ప్రదేశము దక్షారామము. కాశీ విశ్వేశ్వరుని శాపమునకు గురైన వ్యాసుని, పార్వతీ దేవి కనికరించి  అనుగ్రహిస్తుంది. దాక్షారామములోని దక్షవాటికలోనున్న భీమేశ్వరుని శరణువేడి, అక్కడ అతనిని సేవించమని చెప్తుంది. 

ఆ విధముగా వ్యాసుడు కాశీ నుండి బయలుదేరి, పూరీ జగన్నాథ క్షేత్రము, శ్రీకూర్మములోని కూర్మనాథుని క్షేత్రము, సింహాచలములోని వరాహలక్ష్మీనరసింహ క్షేత్రము, పిఠాపురములోని కుక్కుటేశ్వరుని,  పురుహూతికను (శక్తిపీఠము), కాకినాడ ప్రాంతములోనున్న సామర్లకోట, సర్పవరము, సంపర మొదలైన క్షేత్రములను దర్శించి దక్షవాటికకు వచ్చి అగస్త్యుని కలసి, భీమేశ్వరుని, మాణిక్యాంబను (శక్తిపీఠము) సేవిస్తూ, కొన్ని సంవత్సరములు అక్కడ నివసించాడు. భీమఖండ రచనతోపాటు శ్రీ భీమేశ్వరస్త్రోత్రము మొదలైన స్త్రోత్రములను రచించాడు. 

వ్యాసుడు భీమ ఖండములో ప్రస్తావించిన ఆలయములు, ప్రాంతములు నేటికీ గుర్తుపట్టగలిగే స్థితిలోనే ఉన్నవి కనుక, ఇది చారిత్రిక సత్యము.


వేదవ్యాసుడు స్థాపించిన సరస్వతీ క్షేత్రము, ‘వ్యాసపురి’ (బాసర)

వేదవ్యాసుడు వేదములను విభజించి, బ్రహ్మసూత్రములను రచించి, మహాభారత భాగవతాది గ్రంథములను రచించిన తరువాత, స్త్రీ పురుషులను సన్మార్గములో పెట్టుటకు ధర్మ శాస్త్రము, రాజనీతి, అర్థశాస్త్రము ఇలా ఎన్నో గ్రంథములను రచించిననూ, మనశ్శాంతి  లభించకపోవుటచే, శిష్యులతో కలసి తీర్ధయాత్రలు చేయుచూ, దండకారణ్యములో గౌతమీనదీతీరమునకు వచ్చి, స్నాన  సంధ్యాదులను పూర్తిచేసుకుని ధ్యాన నిమగ్నులైన సందర్భములో అతడి యోగదృష్టికి, ఆ ప్రదేశములో శ్రీశారదాదేవి అవ్యక్తరూపములో ఉన్నట్టు గోచరించినది. ఆ దేవిని పూజించి, భక్తకోటి కొఱకు, నిరాకార తత్త్వమును విడచి, సాకారరూపమును ధరించమని ప్రార్థించగా, ఆవిడ అనుగ్రహించారు. ఆ దేవియే శ్రీమహాసరస్వతి, శ్రీమహాలక్ష్మి, శ్రీమహాకాళి అను తన మూడురూపములతో వ్యక్తమయ్యారు. 

వ్యాసుడు శ్రీసరస్వతీదేవిని అధిదేవతగాను, శ్రీమహాలక్ష్మి, శ్రీమహాకాళి దేవతలను ప్రత్యధిదేవతలుగాను స్థాపించారు. వ్యాసుడు స్థాపించిన క్షేత్రము కనుక, ఈ పవిత్ర క్షేత్రమునకు ‘వ్యాసపురి’ అన్న పేరు వచ్చినది. కాలక్రమములో ఈక్షేత్రము ‘బాసర’గా ప్రసిద్ధి చెందినది. 

భారతదేశములో శ్రీసరస్వతీ క్షేత్రములు రెండే ఉన్నాయి. ఒకటి కాశ్మీర్లోను, మరొకటి ఆదిలాబాద్ మండలం బాసరలోను (వ్యాసపురి). 

(ఆధారము: బాసరక్షేత్ర స్థలపురాణము)

భారత జీవనమునకు, సంస్కృతికి, ఆధ్యాత్మిక భావములకు సమన్వయ పూర్వకముగా చక్కని రూపకల్పన చేసి, అపారమైన వాఙ్మయమును  అందించి, అజరామరమైన ప్రతిష్టను అందుకున్నవాడు వేదవ్యాసుడు. 

మానవజాతికి తత్త్వ-హిత-పురుషార్థములను వ్యవస్థితముగా అందించుచున్న వ్యాస సాహితి యను సనాతన జ్యోతి సూర్యచంద్రులు, నక్షత్రములు ఉన్నంత కాలము వెలుగుతూనే ఉంటుంది.

To be remembered - Gurus from the past-present !



 

Guru Purnima - Who is a Teacher ?

TEACHER is a generic word we have imported from the British. In this short thread, let me explain u the word TEACHER

U will realize how rich Sanatan Dharma & its mother language Sanskrit is & why we have a rotten education system

Sanskrit words for "teacher" is based on their unique abilities & these are 6 phases or called it an evolution of a Teacher

1. The teacher who gives you Information is called ADHYAPAK

2. The one who imparts knowledge along with Information is called  UPADHYAYA

3. The one who Imparts skill is called ACHARYA 

4. The one who is able to give deep insight into a subject is called PANDIT

5. The one who has a visionary view on a subject and teaches you to think in that manner is called  DHRISHTA

6. The one who is able to awaken the wisdom in you, leading you from darkness to light is called GURU

These are 6 Unique abilities of a TEACHER, the word we use in general term

If u read Gita, the life journey is from Karm Yog to Gyan Yog

Which means that teaching journey of a Teacher is from ADHYAPAK to GURU and a student Journey is to learn under ADHYAPAK to GURU

This is wholistic Sanatan Education which we lost in race to Degree

Friday, July 8, 2022

జోగులాంబా దేవాలయం



 లంబస్తనీం వికృతాక్షీం

ఘోరరూపాం మహాబలాం

ప్రేతాసన సమారూడాం

జోగులాంబాం నమామ్యహమ్'


పెద్ద పాలిండ్లు కలిగి, వికృతమైన కన్నులతో, ఘోరమైన రూపంతో, మహాబలశాలియై, శవంమీద కూర్చొని ఉన్న జోగులాంబను ధ్యానిస్తున్నాను)

ఆలంపురం జోగులాంబ ధ్యానశ్లోకం ఇది.


జోగులాంబా దేవాలయం

 ఈ ఆలయం ఏడో శతాబ్దం నాటిది. అంటే తంత్రయుగానికి చెందినది. ఇక్కడ అమ్మవారి అసలు విగ్రహం భయంకరంగా ఉంటుంది. జోగులాంబ అంటే యోగుల అమ్మ అని అర్ధం. అంటే జగన్మాత అన్నమాట. ఇది జమదగ్ని మహర్షి, రేణుకాదేవులు నివసించిన ప్రదేశం అని ఒక స్థలపురాణం చెబుతున్నది. శివుని కోసం బ్రహ్మ తపస్సు చేసిన ప్రదేశం అని ఇంకో పురాణం అంటుంది. ఈ కధలు నిజమైనా కాకపోయినా, దాదాపు పన్నెండు వందల ఏళ్ళ క్రితమే ఇది ప్రసిద్ధి చెందిన తాంత్రికక్షేత్రం అన్నది వాస్తవం. 


బెంగాల్ ప్రాంతంలో ఎనిమిదో శతాబ్దంలో పుట్టిన తంత్రం అక్కణ్ణించి హిందూమతంలోనూ, బౌద్ధంలోనూ ప్రవేశించింది. శైవ, శాక్త, వైష్ణవ సాంప్రదాయాలలో అది వేళ్ళూనుకున్నప్పటికీ, శైవం లోనూ, శాక్తమ్ లోనూ బాగా నిలదొక్కుకున్నది. వజ్రయానంగా టిబెటన్ బౌద్ధంలో ప్రవేశించింది. మహాయానాన్ని ప్రభావితం చేసింది. కాలక్రమేణా అసలు తంత్రం కనుమరుగై, పనులు కావడం కోసం పూజలు చేసే క్షుద్రతంత్రం అక్కడక్కడా మిగిలి పోయింది.  ఆ ఆలయాలన్నీ తమతమ రూపురేఖలు మార్చుకుని, వైదిక సాంప్రదాయం ప్రకారం మార్చబడి, ప్రాంతీయంగా ఉన్న అమ్మతల్లుల పూజలతో కలసిపోయి, నేడు ఈ రూపంలో మనకు కనిపిస్తున్నాయి. ముస్లిం దండయాత్రలలో ఈ ఆలయం పూర్తిగా నేలమట్టం చెయ్యబడింది. ఆ తర్వాత కొన్ని వందల ఏళ్లకు దీనిని మళ్ళీ కట్టారు. ఇప్పుడు ఆలయం ఉన్న స్థలం అసలైన స్థలం కాదు.


జోగులాంబ అమ్మవారి జుట్టులో బల్లి, గుడ్లగూబ, తేలు ఉంటాయి. ధ్యానశ్లోకం ప్రకారం ఆమె మూర్తి చాలా భయంకరం. కాళీమాతకు ఒక రూపం ఈమె. శ్మశానకాళిక అని ఈమెను అనుకోవచ్చు. పిచ్చిలోకులు ఈమెను గృహదోషాలు పోగొట్టే దేవతగా ఆరాధిస్తున్నారు. కానీ, మార్మిక సంకేతాలతో కూడిన ఈమె రూపం అత్యంత ఉన్నతమైన పరిపూర్ణ యోగసిద్ధిని కలిగించే దేవతారూపం అన్న సంగతి తాంత్రికయోగులు మాత్రమే గ్రహించగలరు. లోకులకు భయాన్ని కలిగించే తల్లి రూపం, వారికి అత్యంత ప్రేమను పుట్టిస్తుంది.


'లంబస్తని' అనేది జీవులకు పాలిచ్చి పోషించాలనే అత్యంత ప్రేమకు, మెత్తని హృదయానికి సంకేతపదం. 'వికృతాక్షి' అంటే, ఇంద్రియలోలత పైన అమితమైన కోపానికి, జాగృతమైన మూడవకంటికి సూచన. విరూపాక్ష అనే పదమూ, వికృతాక్షి అనే పదమూ సమానార్థకాలే. వికసించిన ఆజ్ఞాచక్రానికి ఇవి సూచికలు. 'ఘోరరూపా' అంటే, ప్రపంచపు డొల్ల కట్టుబాట్లను లెక్కచెయ్యని విశృంఖలత్వమూ, ఆత్మచైతన్యమూ అని అర్ధాలు. 'మహాబలా' అనేది అమితమైన వీర్యశక్తికి, ప్రాణశక్తికి సూచిక. 'ప్రేతాసన సమారూడా' అనేపదం సమాధిస్థితిలో జాగృతమై, జడత్వాన్ని అధిరోహించిన దివ్యచైతన్యశక్తికి మార్మిక సూచన. ఈ మార్మికకోణాలలో దర్శిస్తే ఆమె భయంకరరూపం అత్యంత సౌమ్యంగా, ప్రేమమయంగా కనిపిస్తుంది.  


దేహమే ఆత్మకు గృహం. గృహదోషాలంటే మనం ఉండే ఇంటిదోషాలు కావు. జన్మజన్మాన్తరాలలో దేహాన్ని పట్టుకుని ఉన్న సంస్కార దోషాలు. వాటిని పోగొట్టడం అంటే, సంస్కార నాశనం చేసి కర్మపరంపర అనబడే పొలిమేరను దాటించడం. ఎల్లలను దాటిస్తుంది గనుక ఎల్లమ్మ అయింది. కుండలినీ శక్తికి ఈమె ప్రతిరూపం. పొలిమేరలు దాటించే దేవతను, పొలిమేరల లోపల ఉండే సుఖాల కోసం పూజిస్తున్నారు పిచ్చి లోకులు !


ఛిన్నమస్త, రేణుక, భైరవి, ఎల్లమ్మ - ఇవన్నీ ఈమె పేర్లు. తెలంగాణా ప్రాంతానికి ఈమె అధిష్టానదేవతగా అనేక వేల ఏళ్ళనుంచి కొలువై ఉంది. శ్రీవత్సగోత్రం వారికి ఈమె కులదేవత అవుతుంది. వారిలో ఆమె రక్తమే ప్రవహిస్తున్నది. సరియైన సిద్ధుల వద్ద గ్రహించి ఈమె ఉపాసన గావిస్తే, మహత్తరమైన యోగసిద్ధిని అచిరకాలంలో కలిగించి, మానవజీవితపు పొలిమేరలు దాటిస్తుంది.


అమ్మా నీ కరుణా కటాక్షముల కోసం  ఎదురు చూస్తున్నా తల్లీ 

........(సంగ్రహణ frm telugu yogi)

Monday, July 4, 2022

భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్

విధానం


ఈ శ్లోకమ్ రాత్రి 10 నుండి 2 గ మధ్యలో చేస్తే ఈ తల్లి తీర్చని సమస్య అంటూ ఉండదు..ముఖ్యంగా తగాదాలు, అనుకోకుండా వచ్చిన ఆర్థిక ఇబ్బందులు, శత్రు భయం, అనారోగ్య సమస్యలు ఇలా ఏదైనా ఈమె అనుగ్రహము తో పరిష్కరించబదుతుంది. అయితే ఈ తల్లి అనుగ్రహము కోసం ఈమెను రాత్రి పూట ఎక్కువగా ఆరాధించాలి. ఎవరు పఠించినా వారికి తీవ్రంగా ఉన్న కష్టాన్ని తొలగిస్తుంది..అకాల మృత్యువాత పడకుండా రక్షిస్తుంది.

ఇక్కడ ఇచ్చిన ఈ దత్త మంత్రం ముందుగా మూడు సార్లు జపం చేసి దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేసి తర్వాత వారాహి మాత స్త్రోత్రం 3 సార్లు కానీ 16 సార్లు కానీ పారాయనఁ జపం చేయాలి..

దత్తాత్రేయ సర్వ బాధ నివారణ మంత్రం

"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో ||

సర్వ భాధా ప్రశమనం  కురు శాంతిం ప్రయచ్ఛమే||"


భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్

అథ ధ్యానమ్ ।


వన్దే వారాహవక్త్రాం వరమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషాం

హారాగ్రైవేయతుఙ్గస్తనభరనమితాం పీతకౌశేయవస్త్రామ్ ।

దేవీం దక్షోర్ధ్వహస్తే ముసలమథపరం లాఙ్గలం వా కపాలం

వామాభ్యాం ధారయన్తీం కువలయకలికాం శ్యామలాం సుప్రసన్నామ్ ॥


నమోఽస్తు దేవి వారాహి జయైఙ్కారస్వరూపిణి ।

జయ వారాహి విశ్వేశి ముఖ్యవారాహి తే నమః ॥ ౧॥


వారాహముఖి వన్దే త్వాం అన్ధే అన్ధిని తే నమః ।

సర్వదుర్ష్టప్రదుష్టానాం వాక్స్తమ్భనకరే నమః ॥ ౨॥


నమః స్తమ్భిని స్తమ్భే త్వాం జృమ్భే జృమ్భిణి తే నమః ।

రున్ధే రున్ధిని వన్దే త్వాం నమో దేవేశి మోహిని ॥ ౩॥


స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః ।

బాహ్వోః స్తమ్భకరీం వన్దే జిహ్వాస్తమ్భనకారిణీమ్ ॥ ౪॥


స్తమ్భనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనమ్ ।

శీఘ్రం వశ్యం చ కురు మే యాఽగ్నౌ వాగాత్మికా స్థితా ॥ ౫॥


ఠచతుష్టయరూపే త్వాం శరణం సర్వదా భజే ।

హుమాత్మికే ఫడ్రూపేణ జయ ఆద్యాననే శివే ॥ ౬॥


దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరి ।

నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమః ॥ ౭


ఇతి భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్


లోకా సమస్తా సుఖినో భవంతు


ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి

శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి

ఐం గ్లౌం నమో వరాహవదనాయై నమః 

ఐం గ్లౌం నమో వారాహ్యై నమః ।

ఐం గ్లౌం వరరూపిణ్యై నమః ।

ఐం గ్లౌం క్రోడాననాయై నమః ।

ఐం గ్లౌం కోలముఖ్యై నమః ।

ఐం గ్లౌం జగదమ్బాయై నమః ।

ఐం గ్లౌం తరుణ్యై నమః ।

ఐం గ్లౌం విశ్వేశ్వర్యై నమః ।

ఐం గ్లౌం శఙ్ఖిన్యై నమః ।

ఐం గ్లౌం చక్రిణ్యై నమః ॥ 10 ॥


ఐం గ్లౌం ఖడ్గశూలగదాహస్తాయై నమః ।

ఐం గ్లౌం ముసలధారిణ్యై నమః ।

ఐం గ్లౌం హలసకాది సమాయుక్తాయై నమః ।

ఐం గ్లౌం భక్తానామభయప్రదాయై నమః 

ఐం గ్లౌం ఇష్టార్థదాయిన్యై నమః ।

ఐం గ్లౌం ఘోరాయై నమః ।

ఐం గ్లౌం మహాఘోరాయై నమః ।

ఐం గ్లౌం మహామాయాయై నమః ।

ఐం గ్లౌం వార్తాల్యై నమః ।

ఐం గ్లౌం జగదీశ్వర్యై నమః ॥ 20 ॥


ఐం గ్లౌం అణ్డే అణ్డిన్యై నమః ।

ఐం గ్లౌం రుణ్డే రుణ్డిన్యై నమః ।

ఐం గ్లౌం జమ్భే జమ్భిన్యై నమః ।

ఐం గ్లౌం మోహే మోహిన్యై నమః ।

ఐం గ్లౌం స్తమ్భే స్తమ్భిన్యై నమః ।

ఐం గ్లౌం దేవేశ్యై నమః ।

ఐం గ్లౌం శత్రునాశిన్యై నమః ।

ఐం గ్లౌం అష్టభుజాయై నమః ।

ఐం గ్లౌం చతుర్హస్తాయై నమః ।

ఐం గ్లౌం ఉన్నతభైరవాఙ్గస్థాయై నమః ॥ 30 ॥


ఐం గ్లౌం కపిలాలోచనాయై నమః ।

ఐం గ్లౌం పఞ్చమ్యై నమః ।

ఐం గ్లౌం లోకేశ్యై నమః ।

ఐం గ్లౌం నీలమణిప్రభాయై నమః ।

ఐం గ్లౌం అఞ్జనాద్రిప్రతీకాశాయై నమః ।

ఐం గ్లౌం సింహారుద్రాయై నమః ।

ఐం గ్లౌం త్రిలోచనాయై నమః ।

ఐం గ్లౌం శ్యామలాయై నమః ।

ఐం గ్లౌం పరమాయై నమః ।

ఐం గ్లౌం ఈశాన్యై నమః ॥ 40 ॥


ఐం గ్లౌం నీల్యై నమః ।

ఐం గ్లౌం ఇన్దీవరసన్నిభాయై నమః ।

ఐం గ్లౌం కణస్థానసమోపేతాయై నమః ।

ఐం గ్లౌం కపిలాయై నమః ।

ఐం గ్లౌం కలాత్మికాయై నమః ।

ఐం గ్లౌం అమ్బికాయై నమః ।

ఐం గ్లౌం జగద్ధారిణ్యై నమః ।

ఐం గ్లౌం భక్తోపద్రవనాశిన్యై నమః ।

ఐం గ్లౌం సగుణాయై నమః ।

ఐం గ్లౌం నిష్కలాయై నమః ॥ 50 ॥


ఐం గ్లౌం విద్యాయై నమః ।

ఐం గ్లౌం నిత్యాయై నమః ।

ఐం గ్లౌం విశ్వవశఙ్కర్యై నమః ।

ఐం గ్లౌం మహారూపాయై నమః ।

ఐం గ్లౌం మహేశ్వర్యై నమః ।

ఐం గ్లౌం మహేన్ద్రితాయై నమః ।

ఐం గ్లౌం విశ్వవ్యాపిన్యై నమః ।

ఐం గ్లౌం దేవ్యై నమః ।

ఐం గ్లౌం పశూనామభయకారిణ్యై నమః 

ఐం గ్లౌం కాలికాయై నమః ॥ 60 ॥


ఐం గ్లౌం భయదాయై నమః ।

ఐం గ్లౌం బలిమాంసమహాప్రియాయై నమః ।

ఐం గ్లౌం జయభైరవ్యై నమః ।

ఐం గ్లౌం కృష్ణాఙ్గాయై నమః ।

ఐం గ్లౌం పరమేశ్వరవల్లభాయై నమః ।

ఐం గ్లౌం నుదాయై నమః ।

ఐం గ్లౌం స్తుత్యై నమః ।

ఐం గ్లౌం సురేశాన్యై నమః ।

ఐం గ్లౌం బ్రహ్మాదివరదాయై నమః ।

ఐం గ్లౌం స్వరూపిణ్యై నమః ॥ 70 ॥


ఐం గ్లౌం సురానామభయప్రదాయై నమః 

ఐం గ్లౌం వరాహదేహసమ్భూతాయై నమః ।

ఐం గ్లౌం శ్రోణివారాలసే నమః ।

ఐం గ్లౌం క్రోధిన్యై నమః ।

ఐం గ్లౌం నీలాస్యాయై నమః ।

ఐం గ్లౌం శుభదాయై నమః ।

ఐం గ్లౌం శుభవారిణ్యై నమః ।

ఐం గ్లౌం శత్రూణాం వాక్స్తమ్భనకారిణ్యై నమః ।

ఐం గ్లౌం కటిస్తమ్భనకారిణ్యై నమః ।

ఐం గ్లౌం మతిస్తమ్భనకారిణ్యై నమః ॥ 80 ॥


ఐం గ్లౌం సాక్షీస్తమ్భనకారిణ్యై నమః ।

ఐం గ్లౌం మూకస్తమ్భిన్యై నమః ।

ఐం గ్లౌం జిహ్వాస్తమ్భిన్యై నమః ।

ఐం గ్లౌం దుష్టానాం నిగ్రహకారిణ్యై నమః 

ఐం గ్లౌం శిష్టానుగ్రహకారిణ్యై నమః ।

ఐం గ్లౌం సర్వశత్రుక్షయకరాయై నమః ।

ఐం గ్లౌం శత్రుసాదనకారిణ్యై నమః ।

ఐం గ్లౌం శత్రువిద్వేషణకారిణ్యై నమః ।

ఐం గ్లౌం భైరవీప్రియాయై నమః ।

ఐం గ్లౌం మన్త్రాత్మికాయై నమః ॥ 90 ॥


ఐం గ్లౌం యన్త్రరూపాయై నమః ।

ఐం గ్లౌం తన్త్రరూపిణ్యై నమః ।

ఐం గ్లౌం పీఠాత్మికాయై నమః ।

ఐం గ్లౌం దేవదేవ్యై నమః ।

ఐం గ్లౌం శ్రేయస్కారిణ్యై నమః ।

ఐం గ్లౌం చిన్తితార్థప్రదాయిన్యై నమః ।

ఐం గ్లౌం భక్తాలక్ష్మీవినాశిన్యై నమః ।

ఐం గ్లౌం సమ్పత్ప్రదాయై నమః ।

ఐం గ్లౌం సౌఖ్యకారిణ్యై నమః ।

ఐం గ్లౌం బాహువారాహ్యై నమః ॥ 100॥


ఐం గ్లౌం స్వప్నవారాహ్యై నమః ।

ఐం గ్లౌం భగవత్యై నమో నమః ।

ఐం గ్లౌం ఈశ్వర్యై నమః ।

ఐం గ్లౌం సర్వారాధ్యాయై నమః ।

ఐం గ్లౌం సర్వమయాయై నమః ।

ఐం గ్లౌం సర్వలోకాత్మికాయై నమః ।

ఐం గ్లౌం మహిషనాశినాయై నమః ।

ఐం గ్లౌం బృహద్వారాహ్యై నమః॥108 ॥


ఇతి శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం..

శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం

అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః |

అనుష్టుప్ఛందః | శ్రీవారాహీ దేవతా |

శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం |

సర్వ సంకట హరణ జపే వినియోగః ||


పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |

తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా || 1 ||


వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా |

అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే || 2 ||


నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః |

సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః || 3 ||


ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం ||

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...