Thursday, July 23, 2020

ఘోరకష్టోద్ధారణ స్తోత్రం

తెలుగు భావం ### రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి.

శ్రీపాద శ్రీవల్లభ త్వం సదైవ ।
శ్రీదత్తాస్మాన్పాహి దేవాధిదేవ ॥
భావగ్రాహ్య క్లేశహారిన్సుకీర్తే ।
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥ 1॥
ఘోర కష్టో ద్ధారణ స్త్రోత్రం.

 1.
హే శ్రీపాద శ్రీవల్లభ ప్రభో ,శ్రీ దత్త,దేవాధిదేవ,క్రీర్తిమంతా సదా నా ప్రార్ధన మన్నించి, నన్ను రక్షించి , ఘోర ఇహ,పర  కష్టముల నుంచి ఉద్ధరించే  శ్రీ దత్తాత్రేయ ప్రభో నీకు నమస్కారం..

త్వం నో మాతా త్వం పితాప్తోఽధిపస్త్వమ్ ।
త్రాతా యోగక్షేమకృత్సద్గురుస్త్వమ్ ॥
త్వం సర్వస్వం నోఽప్రభో విశ్వమూర్తే ।
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥ 2॥

2.
హే పరమేశ్వరా, విశ్వవ్యాపకా,నీవే   తల్లివి,  తండ్రివి,భందువు,రక్షకుడవు.యోగ,క్షేమం ప్రసాదించే సద్గురు డవు, నన్ను ఘోర ఇహ,పర కష్టముల నుంచి ఉద్ధరించే  శ్రీ దత్తాత్రేయ ప్రభో నీకు నమస్కారం.

3పాపం తాపం వ్యాధిమాధిం చ దైన్యమ్ ।
భీతిం క్లేశం త్వం హరాశు త్వదన్యమ్ ॥
త్రాతారం నో వీక్ష్య ఈశాస్తజూర్తే ।
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥ ౩॥
3.
,
ఓ విశ్వమూర్తి  పాపము,తాపము వ్యాధి,భయం,దైన్యము,దుఖఃము లను మీరు తప్ప హరించు వారు లేరు.హే దత్తాత్రేయ ప్రభో  నన్ను ఘోర ఇహ,పర  కష్టముల నుంచి ఉద్ధరించే  శ్రీ దత్తాత్రేయ ప్రభో నీకు నమస్కారం.

4.నాన్యస్త్రాతా నాపి దాతా న భర్తా ।
త్వత్తో దేవ త్వం శరణ్యోఽకహర్తా ॥
కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే ।
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥ 4॥
4.

హే శరణాగత వత్సల ,నువ్వు తప్ప పోషకుడు,యజమాని,రక్షించు వారు, కృపాకరుడు ఎవరు లేరు.నిన్ను సంపూర్ణo గా శరణు వేడుకొంటారో అటువంటివారిని దయతో సంపూర్ణంగా అనుగ్రహింస్తావో  ఓ దత్త ప్రభో నన్ను  ఘోర  ఇహ పర  ఇహ, పర కష్టము ల నుంచి ఉద్ధరించే  శ్రీ దత్తాత్రేయ ప్రభో నీకు నమస్కారం.,,

ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిమ్ ।
సత్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిమ్ ।
భావాసక్తిం చాఖిలానందమూర్తే ।
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥ 5॥

5.అఖిలానంద మూర్తి ధర్మo నందు  ప్రీతి,భక్తి,శ్రద్ధ,సద్బుద్ధి,,సత్సంగము ప్రసాదించి భుక్తి,ముక్తి,పరిపూర్ణ భక్తి  ని ప్రసాదించి   నన్ను  ఘోర ఇహ,పర   కష్టము ల నుంచి ఉద్ధరించే  శ్రీ దత్తాత్రేయ ప్రభో నీకు నమస్కారం.

,
శ్లోకపంచకమేతతద్యో లోకమఙ్గలవర్ధనమ్ ।
ప్రపఠేన్నియతో భక్త్యా స శ్రీదత్తప్రియో భవేత్ ॥
ఈ పంచ శ్లోకం లను     భక్తితో చదివిన వారికి       దత్తాత్రేయ ఆశీర్వచనాల తో పాటు వారి కృపతో లోకంలో అన్ని మంగళ కరము అవుతుంది.

                                            ఇతి శ్రీ వాసుదేవానoద సరస్వతీ విరచితం
శ్రీ దత్తాత్రేయ ప్రార్థనా స్తోత్రం సంపూర్ణం ॥

ఇతి శ్రీ పరమహంస పరి వ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత ఘోర
కష్ట ఉద్దారక శ్లోకం సంపూర్ణం..శ్రీ అవధూత చింతన గురుదేవ దత్త

ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే తప్పక కార్యసిద్ధి పొందుతారు

1. విద్యా ప్రాప్తికి:-

పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!


2. ఉద్యోగ ప్రాప్తికి :-

హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!


3. కార్య సాధనకు :-

అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

4. గ్రహదోష నివారణకు :-

మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

5. ఆరోగ్యమునకు :-

ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

6. సంతాన ప్రాప్తికి :-

పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురుమే దేవ రామదూత నమోస్తుతే!!


7. వ్యాపారాభివృద్ధికి :-

సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!


8. వివాహ ప్రాప్తికి :-

యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!



ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.

శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ శివ మానసపూజ స్తోత్రమ్

మనకు మహానుభావులు..జగద్గురువులైన శ్రీశంకరభగవత్పాదులు..సాక్షాత్తు కైలాస శంకరులే కాలడి శంకరులుగా వచ్చారు,
వారు శరీరంలో ఉన్నది 32 సం!! ఐనా మనకు చాలా మహానీయమైన ఆత్మతత్వ గ్రంథాలు & దైవీ స్తోత్రాలు ఇచ్చారు,
పురాణ, ఇతిహాసాలు, భక్తుల చరిత్రలు, మహా భక్తులైనవారు ఇచ్చిన స్తోత్రాలు చదివినా తరించవచ్చు, లేదా నామాన్ని పట్టుకున్నా తరించబడతారు.

అందులో మహాద్భుత స్తోత్రం శ్రీశివమానస పూజ స్తోత్రం.
మనకు శరీరం ఇచ్చి జ్ఞానం పొంది మోక్షం వైపు అడుగు వేయమని ఈశ్వరుడు ఈ శరీరం ఇచ్చినా అజ్ఞానికి అవేమి పట్టవు,
విషయసుఖాలే మధురం అని అంటాడు,
కొంత మంది నిజంగానే సమయం లేకుండా వుంటారు, అందుకే అందరికోసం శంకరభగవత్పాదులు అద్భుతమైన స్తోత్రం ఒకటి ఇచ్చారు అదే "శివ మానస పూజ స్తోత్రం" దాని తాత్పర్యం . దీనిని చదువుకుంటే ఈశ్వరుడికి అన్ని ఉపచారాలు చేసేసినట్టే అని శంకరుల అభిమతం, అందుకే ఈ వివరణ.

అసలు అలా పూజ హృదయంలో నిత్యం జరగాలి లేదా కనీసంలో కనీసం ఉభయ సంధ్యాల్లో చేసి హృదయమున ఆ విశ్వేశ్వరుడిని నిలుపుకోవాలి అని శంకరుల ఉదేశ్యం.

శ్రీ శివ మానస స్తోత్రం

రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యామ్బరం
నానారత్నవిభూషితం మృగమదామోదాఙ్కితం చన్దనమ్
జాతీచమ్పకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ !! 1 !!

ఓ పశుపతీ, నీకు నేను పూజ ఇలాచేస్తున్నాను. రత్నఖచితమైన ఆసనము సమర్పిస్తున్నాను. గంగాజలములతో అభిషేకము చేస్తున్నాను. నానారత్నములచే అలంకరింపబడిన దివ్యమైన వస్త్రము సమర్పిస్తున్నాను.
కస్తూరీ మిశ్రితమైన గంధము నీకు అలదుతున్నాను. మల్లెలు, చంపకములు, మారేడుదళాలు, ధూపము, దీపమూ నీకు సమర్పిస్తున్నాను.
ఈ ఉపచారములన్నీ, దేవా, నా హృదయములో కల్పిస్తున్నాను.
ఓ దయానిధీ, స్వీకరించు.

సౌవర్ణే నవరత్నఖణ్డరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పఞ్చవిధం పయోదధియుతం రమ్భాఫలం పానకమ్ ।
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖణ్డోజ్జ్వలం
తామ్బూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు !! 2 !!

శంభో! నీకు నేను భోజనం ఇలా అర్పిస్తున్నాను. నవరత్నఖచితమైన స్వర్ణపాత్రయందు పాయసము, నెయ్యి, పంచ భక్ష్యాలు, పాలు, పెరుగు, అరటిపండు, పానకము, శాకములతో అర్పిస్తున్నాను.
శుద్ధ జలమూ, రుచికరమూ, కర్పూరముతోకూడినదీ అయిన తాంబూలమూ సమర్పిస్తున్నాను.
నీకు ఈ భోజనం, ప్రభూ, నా హృదయంలో కల్పిస్తున్నాను, స్వీకరించు.

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలమ్
వీణాభేరిమృదఙ్గకాహలకలా గీతం చ నృత్యం తథా ।
సాష్టాఙ్గం ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేతత్సమస్తం మయా
సఙ్కల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో 3

శివా! ఇక నీ భోజనానంతర ఉపచారాలు చూడవయ్యా!. నీకు ఛత్రం పడుతున్నాను,
రెండు చామరాలతో వీస్తున్నాను.
విసనకఱ్ఱతో గాలిని వీస్తున్నాను,
నిర్మలమైన అద్దమూ సమర్పిస్తున్నాను.
వీణ, భేరి, మృదంగ వాయిద్యాల కోలాహలంతో, గానమూ, నృత్యమూ సమర్పిస్తున్నాను.
నీకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను.
నిన్ను బహువిధాలుగా స్తుతిస్తున్నాను.
ఈ సమస్తమూ , ప్రభో! నీకు నా హృదయములో చేసే ఈ పూజను స్వీకరించు.

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః ।
సఞ్చారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శమ్భో తవారాధనమ్4

శంభో! నీవే నా ఆత్మవు.
అమ్మవారు నా బుద్ధి.
నా ప్రాణాలు నీ సహచరులు.
నా శరీరము నీ ఇల్లు.
నా ఇంద్రియభోగములు నీ పూజా వస్తువులు.
నా నిద్ర నీ సమాధిస్థితి.
నా నడక నీకు ప్రదక్షిణము.
నా మాటలన్నీ నీ స్తోత్రాలు.
శివా, నేను ఏ ఏ పనులు చేస్తున్నానో,
అవి అన్నియూ నీ ఆరాధనయే.

కరచరణ కృతం వాక్కాయజం
కర్మజం వా
శ్రవణనయనజం వా మానసం వాపరాధమ్
విహితమవిహితం వా* *సర్వమేతత్క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవశమ్భో ॥ 5॥

శ్రీ మహాదేవా! శంభో! కరుణా సముద్రా!
నేను కరచరణాదులతోనూ, శరీరంతోనూ, మాటలతోనూ, నా చేతలతోనూ, చెవులతోనూ, కళ్ళతోనూ, మనస్సుతోనూ చేసిన అపరాధములు,
అవి చెయ్యదగినవైనా చెయ్యకూడనివైనా సరే, వాటన్నింటినీ క్షమించు.
జయ జయ శంకర.

ప్రతిరోజు చదువుకుందాము.
ఈశ్వరుడివైపుకి ఒక్కొక్క అడుగు వేద్దాం,
అందునా బాహ్యపూజకంటే అంతరమున చేసే పూజకీ త్వరగా పలుకుతాడు శంకరుడు,
(సేకరణ)

బ్రాహ్మణుడు అంటే ఎవరు ?

బ్రాహ్మణుని జననము------విష్ణు అంశం.
బ్రాహ్మణుని బుద్ది -----సర్వసమస్యలకు సమాధానం.
బ్రాహ్మణుని వాక్చాతుర్యం---------వేద వైభవజ్ఞానం. 
బ్రాహ్మణునిదృష్టి---సమభావం.                         
బ్రాహ్మణుని ఆశయం------సర్వలోకక్షేమం                 
బ్రాహ్మణుని లక్ష్యం------దేశహితం.       
బ్రాహ్మణుని ముఖ్యఉద్దేశం--సర్వసంకటనాశనం.           
బ్రాహ్మణుని అనుగ్రహం---భవసాగరసాధనం.             
బ్రాహ్మణుని నిత్యానుష్టానం- సర్వలోకక్షేమం.               
బ్రాహ్మణుని నిధి---భగవద్సన్నిది.             
బ్రాహ్మణుని దర్శనం--సర్వమంగళకరం. 
బ్రాహ్మణుని ఆశీర్వాదం---వైభవమునకు ఆలవాలము.                   
బ్రాహ్మణుని  చల్లని చూపు---మోక్షమార్గమునకు చూపు.       
బ్రాహ్మణుని అస్త్రం-శాపం.
బ్రాహ్మణుని శస్త్రం---  నీ జీవితానికి మోక్షం.             
బ్రాహ్మణుని శాస్త్రం---- మనుగడమార్గం.               
బ్రాహ్మణునునికి దానం-సహస్రపాపముల సంహారం.         
బ్రాహ్మణునునికి దక్షిణమ్-సర్వపాపక్షయం.     
బ్రహ్మణునిఘర్జనమ్-సర్వభూతసంహారం.       
బ్రహ్మణునికోపం--సర్వనాశనం.                     
బ్రాహ్మణుని తాపం--నీ జీవిత సంకటం.             
బ్రహ్మణునికిసన్మానం---నీ అభివృద్ధికి సోపానం.             
బ్రహ్మణునునికి అవమానం--నీ అభివృద్ధికి వినాశనం. 
బ్రాహ్మణునునికి ద్రోహం----నరకానికి మార్గం.                 
బ్రాహ్మణ అభ్యుదయం---నీ జీవితానికి అభ్యుదయం.     
బ్రాహ్మణుని అనుగ్రహచూపు ---- నీ జీవితారోహణకు మార్పు.     
బ్రాహ్మణుని ఆవాసం----సర్వతీర్థముల నివాసం.                             
బ్రాహ్మణుని సాన్నిహిత్యం----నీ జీవితమ్ కాంతివంతం.         
బ్రాహ్మణుని సాంగత్యం----త్రివేణిసంగమసదృశం.         
బ్రాహ్మణక్షేమం--దేశక్షేమం.
బ్రహ్మణహితం-దేశహితం.     

స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతామ్. న్యాయేణ మార్గేణ మహీమ్ మహీశా: గోబ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం లోకాః సమస్తా: సుఖినోభవంతు.

Thursday, July 9, 2020

శ్రీ వామదేవాష్టకం

1) నమో భగవతే వామదేవాయ

   భస్మత్రిపుండ్రపావనగంగాధరాయ

   ప్రమథగణసేవార్చితకోమలపదాయ

   సామవేదగానసంతతప్రియాయ ||

2) నమో భగవతే వామదేవాయ

   తులసీదళబిల్వార్చితవిగ్రహాయ

   పర్వతరాజనందినీహృన్నివాసాయ

   భాషావాఙ్మయకారణాయ ||

3) నమో భగవతే వామదేవాయ

   త్రిశూలమృగయఖడ్గధరాయ

   కాలచక్రనిర్వాహణాదక్షాయ

   వ్యాఘ్రచర్మాంబరధరాయ ||

4) నమో భగవతే వామదేవాయ

   పంచభూతలింగస్వరూపాయ

   జ్ఞానధారాప్రదదక్షిణామూర్తిరూపాయ

   సనకసనందనాదిమునిగణపూజితాయ ||

5) నమో భగవతే వామదేవాయ

   గజాననశరవణభవసేవితాయ

   భానుమండలచరజ్యోతిస్వరూపాయ

   విషాశనస్వీకృతనీలకంఠాయ   ||

6) నమో భగవతే వామదేవాయ

   ధ్యానమగ్నస్థితఅర్ధనిమీలితనేత్రాయ

   క్షీరసముద్రప్రదకరుణాంతరంగాయ

   భావనామాత్రసంతుష్ఠాయ ||

7) నమో భగవతే వామదేవాయ

   సంసారార్ణవతారణకారణాయ

   నిత్యాభిషేకాసక్తనిరామయాయ

   పుష్పదంతపూజితాంఘ్రియుగాయ ||

8) నమో భగవతే వామదేవాయ

    దుష్టఅంధకాసురనిషూదనాయ

   పార్థపాశుపతాస్త్రప్రదాయకాయ

   భార్గవరామపారశ్వధదాయకాయ ||

    సర్వం శ్రీవామదేవదివ్యచరణారవిందార్పణమస్తు

Sunday, July 5, 2020

గురు అక్షరమాల స్తుతి

అ - అద్వైతమూర్తి - గురువు
ఆ - ఆనందస్ఫూర్తి - గురువు
ఇ - ఇలదైవం - గురువు
ఈ - ఈశ్వరరూపము - గురువు
ఉ - ఉద్ధరించువాడు - గురువు
ఊ - ఊర్ధ్వముఖుడు - గురువు
ఋ - ఋజువర్తనుడు - గురువు
ౠ - ఋణము లేనివాడు - గురువు
ఎ - ఏమిలేదని చెప్పువాడు - గురువు
ఏ - ఏకమేవాద్వితీయం బ్రహ్మ - గురువు
ఐ - ఐశ్వర్య ప్రదాత - గురువు
ఒ - ఒక్కటే ఉన్నది అని చెప్పువాడు - గురువు
ఓ - ఓంకార రూపము - గురువు
ఔ - ఔదార్య మేరువు - గురువు
అం - అందరూ సేవించేది - గురువు
అః - అహంకార రహితుడు - గురువు
క - కళంకము లేనివాడు - గురువు
ఖ - ఖండరహితుడు - గురువు
గ - గుణాతీతుడు - గురువు
ఘ - ఘనస్వరూపము - గురువు
ఙ - జిజ్ఞాసులకు జ్ఞానప్రదాత - గురువు
చ - చక్రవర్తి - గురువు
ఛ - ఛత్రము వంటి వాడు - గురువు
జ - జనన మరణములు లేని వాడు - గురువు
ఝ - ఝరులవలె బోధించువాడు - గురువు
ఞ - జ్ఞానస్వరూపము - గురువు
ట - నిష్కపటుడు - గురువు
ఠ - నిష్ఠకలవాడు - గురువు
డ - డంబము లేనివాడు - గురువు
ఢ - ఢంకా మ్రోగించి చెప్పువాడు - గురువు
ణ -  తూష్ణీభావము కలవాడు - గురువు
త - తత్త్వోపదేశికుడు - గురువు
థ - తత్త్వమసి నిర్దేశకుడు - గురువు
ద - దయాస్వరూపము - గురువు
ధ - దండించి బోధించువాడు - గురువు
న - నవికారుడు - గురువు
ప - పంచేంద్రియాతీతుడు - గురువు
ఫ - ఫలాకాంక్షా రహితుడు - గురువు
బ - బంధము లేనివాడు - గురువు
భ - భయరహితుడు - గురువు
మ - మహావాక్యబోధకుడు - గురువు
య - యమము కలవాడు - గురువు
ర - రాగద్వేష రహితుడు - గురువు
ల - లవలేశము ద్వేషము లేనివాడు - గురువు
వ - వశీకరణశక్తి కలవాడు - గురువు
శ - శమము కలవాడు - గురువు
ష - షడ్భావ వికారములు లేనివాడు - గురువు
స - సహనశీలి - గురువు
హ - హరిహర రూపుడు - గురువు
ళ - నిష్కళంకుడు - గురువు
క్ష - క్షరాక్షర విలక్షణుడు - గురువు
ఱ-ఎఱుకతో ఉన్నవాడు - గురువు

అక్షరక్రమంలోహిందూఋషులపేర్లు

హిందూఋషులుజాబితా

అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ - త - థ - ద - ధ - న
ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్ష

దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.
బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.
మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.
రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.

అగ్ని మహర్షి
అగస్త్య మహర్షి
అంగీరస మహర్షి
అంగిరో మహర్షి
అత్రి మహర్షి
అర్వరీవత మహర్షి
అభినామన మహర్షి
అగ్నివేశ మహర్షి
అరుణి మహర్షి
అష్టావక్ర మహర్షి
అష్టిక మహర్షి
అథర్వణ మహర్షి
ఆత్రేయ మహర్షి
అథర్వాకృతి‎
అమహీయుడు
అజామిళ్హుడు‎
అప్రతిరథుడు‎
అయాస్యుడు‎
అవస్యుడు
అంబరీషుడు

ఇరింబిఠి‎


ఉపమన్యు మహర్షి
ఉత్తమ మహర్షి
ఉన్మోచన
ఉపరిబభ్రవుడు
ఉద్దాలకుడు‎
ఉశనసుడు
ఉత్కీలుడు

ఊర్ఝ మహర్షి
ఊర్ద్వబాహు మహర్షి

ఋచీక మహర్షి
ఋషభ మహర్షి
ఋష్యశృంగ మహర్షి
ఋషి


ఔపమన్యవ మహర్షి
ఔరవ మహర్షి

కపిల మహర్షి
కశ్యప మహర్షి
క్రతు మహర్షి
కౌకుండి మహర్షి
కురుండి మహర్షి
కావ్య మహర్షి
కాంభోజ మహర్షి
కంబ స్వాయంభువ మహర్షి
కాండ్వ మహర్షి
కణ్వ మహర్షి
కాణ్వ మహర్షి
కిందమ మహర్షి
కుత్స మహర్షి
కౌరుపథి‎
కౌశికుడు‎
కురువు
కాణుడు‎
కలి
కాంకాయనుడు
కపింజలుడు‎
కుసీదుడు                                                        కౌడిన్యమహర్షి

గౌతమ మహర్షి
గర్గ మహర్షి
గృత్సమద మహర్షి
గృత్సదుడు‎
గోపథుడు‎
గోతముడు
గౌరీవీతి
గోపవనుడు
గయుడు

చ్యవన మహర్షి
చైత్ర మహర్షి
చాతనుడు‎

జమదగ్ని మహర్షి
జైమిని మహర్షి
జ్యోతిర్ధామ మహర్షి
జాహ్న మహర్షి
జగద్బీజ
జాటికాయనుడు‎

తండి మహర్షి
తిత్తిరి మహర్షి
త్రితుడు
తృణపాణి

దధీచి మహర్షి
దుర్వాస మహర్షి
దేవల మహర్షి
దత్తోలి మహర్షి
దాలయ మహర్షి
దీర్ఘతమ మహర్షి
ద్రవిణోదస్సు‎

నచికేత మహర్షి
నారద మహర్షి
నిశ్ఛర మహర్షి
సుమేధా మహర్షి
నోధా
నృమేధుడు

పరశురాముడు
పరాశర మహర్షి
పరిజన్య మహర్షి
పులస్త్య మహర్షి
ప్రాచేతస మహర్షి
పులహ మహర్షి
ప్రాణ మహర్షి
ప్రవహిత మహర్షి
పృథు మహర్షి
పివర మహర్షి
పిప్పలాద మహర్షి
ప్రత్య్సంగిరసుడు
పతివేదనుడు
ప్రమోచన‎
ప్రశోచనుడు‎
ప్రియమేథుడు
పార్వతుడు
పురుహన్మ‎
ప్రస్కణ్వుడు
ప్రాగాథుడు
ప్రాచీనబర్హి
ప్రయోగుడు
పూరుడు
పాయు

భరద్వాజ మహర్షి
భృగు మహర్షి
భృంగి మహర్షి
బ్రహ్మర్షి మహర్షి
బభ్రుపింగళుడు
భార్గవవైదర్భి‎
భాగలి
భృగ్వంగిరాబ్రహ్మ
బ్రహ్మస్కందుడు‎
భగుడు‎
బ్రహ్మర్షి
బృహత్కీర్తి‎
బృహజ్జ్యోతి‎
భర్గుడు

మరీచి మహర్షి
మార్కండేయ మహర్షి
మిత మహర్షి
మృకండు మహర్షి
మహాముని మహర్షి
మధు మహర్షి
మాండవ్య మహర్షి
మాయు
మృగారుడు‎
మాతృనామ‎
మయోభువు‎
మేధాతిథి
మధుచ్ఛందుడు
మనువు
మారీచుడు

యాజ్ఞవల్క మహర్షి
యయాతి‎

రురు మహర్షి
రాజర్షి మహర్షి
రేభుడు

వశిష్ట మహర్షి
వాలఖిల్యులు
వాల్మీకి మహర్షి
విశ్వామిత్ర మహర్షి
వ్యాస మహర్షి
విభాండక ఋషి
వాదుల మహర్షి
వాణక మహర్షి
వేదశ్రీ మహర్షి
వేదబాహు మహర్షి
విరాజా మహర్షి
వైశేషిక మహర్షి
వైశంపాయన మహర్షి
వర్తంతు మహర్షి
వృషాకపి
విరూపుడు‎
వత్సుడు‎
వేనుడు
వామదేవుడు‎
వత్సప్రి
విందుడు

శంఖ మహర్షి
శంకృతి మహర్షి
శతానంద మహర్షి
శుక మహర్షి
శుక్ర మహర్షి
శృంగి ఋషి
శశికర్ణుడు
శంభు‎
శౌనకుడు
శంయువు‎
శ్రుతకక్షుడు

సమ్మిత మహర్షి
సనత్కుమారులు
సప్తర్షులు
స్థంభ మహర్షి
సుధామ మహర్షి
సహిష్ణు మహర్షి
సాంఖ్య మహర్షి
సాందీపణి మహర్షి
సావిత్రీసూర్య
సుశబ్దుడు‎
సుతకక్షుడు‎
సుకక్షుడు‎
సౌభరి
సుకీర్తి‎
సవితామహర్షి సామావేదానికి మూలము.
సింధుద్వీపుడు
శునఃశేపుడు
సుదీతి

హవిష్మంత మహర్షి
హిరణ్యరోమ మహర్షి

మానవున యొక్క ఐదు కోషాలు (తొడుగులు / Auras)



1) "అన్నా మాయ కోషా" మన భౌతిక శరీరాన్ని సూచిస్తుంది.

2) "ప్రాణమయ కోష" మన శ్వాస లయను సూచిస్తుంది. మన శ్వాస లయ (అన్నా మయ, మనోమయ) కోషాల ద్వారా ప్రభావితమవుతుంది.

3) "మనోమయ కోష" అలాగే "ప్రణమయ కోష" ఆ రెండు కోషాలను ప్రభావితం చేస్తుంది, ఇక్కడే యోగా అమలులోకి వస్తుంది.

4) "విజ్ఞానమయ కోష" జ్ఞానాన్ని సూచిస్తుంది (అస్థిరమైన జ్ఞానం మన జ్ఞానం అవుతుంది).

5) ఐదవ కోషా "అనంతమయ/ఆనందమయ కోషా". విజ్ఞానమయ కోష పరిపూర్ణమైనప్పుడు (నేను ఎవరిని అనే జ్ఞానం), అనంతమయ కోషాలో పనిచేయడం ప్రారంభిస్తుంది.

ఇది 5 కోషాల సారాంశం. అనేక ఇతర విషయాలు, అంశాలు కూడా ఎప్పటికప్పుడు వీటితోపాటు పెంచుకోవాలి...

ఓం నమః శివాయ

Saturday, July 4, 2020

నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం

శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం వస్తుందని పరాశర సంహిత'లో ఉంది.

నవగ్రహాల అనుగ్రహం త్వరగా పొందాలంటే వాల్మీకి రామాయణం లోని ఈ 9 శ్లోకాలు నిత్యం పారాయణ చేయడం మంచిది.

నవగ్రహాలు అత్యంత కరుణా స్వరూపులు. మనం పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపాల బట్టి ఫలితాలని ఇస్తారు.

కానీ భక్తితో వారిని ఇటువంటి స్తోత్రాలతో స్తుతిస్తే శుభఫలితాల్ని అనుగ్రహిస్తారు.

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా శ్లోకాల పారాయణం వల్ల విద్యార్థులకు మేధస్సు, ఉద్యోగస్తులు, వ్యాపారులకు అభివృద్ధి, స్త్రీలకు వివాహం, సత్సంతానము మరియు వృద్దులకు ఆరోగ్యం కలుగుతుంది.

నిత్యం లేదా శనివారం అయినా వీటిని పారాయణ చేయడం వలన శుభఫలితాలని పొందవచ్చు.

వాల్మీకి రామాయణమునకు సుందరకాండ తలమానికము.సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం.

రత్నములవంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామి వారికి సమర్పించబడినది. ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది.

ఇవి శ్రీ ఆంజనేయస్వామి వారి వైభవము, స్వామి వారికి నవ గ్రహములతో గల సంబంధము తెలియబర్చును. ఈ స్తోత్రం పారాయణ చేసినవారికి శ్రీ ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో బాటు నవగ్రహముల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది.

శ్లోకము తత్సంబంధిత గ్రహము, రత్నముల వివరములు స్తోత్రంలో తెలుపబడినవి. నవగ్రహములకు ఆయా శ్లోకములతో జపముచేసి ఫలితం పొందవచ్చునని చెప్పబడినది.

♦️మాణిక్యం (సూర్యుడు)..
తతో రావణనీతాయా: సీతాయాశ్శత్రుకర్శన: |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ||

అర్థము : అనంతరము అరివవీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీతజాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతులవారు సంచరించు ఆకాశమార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను.

♦️ముత్యం (చంద్రుడు).
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |
స్మృతిర్మతిర్ధృ తిర్ధాక్ష్యం స కర్మసు న సీదతి ||

అర్థము : నీవలె గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వముగలవాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడును వైఫల్యమును పొందడు.

♦️పగడం (కుజుడు).
అనిర్వేద: శ్రియో మూలం అనిర్వేద: పరం సుఖం |
అనిర్వేదో హి సతతం సర్వార్ధేషు ప్రవర్తక: ||

అర్థము : దిగులుపడకుండా ఉత్సాహముతో నుండుటవలన కార్యసిద్ధియు, పరమ సుఖము కలుగును. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి యుండటయే శ్రేయస్కరము.

♦️మరకతం (బుధుడు).
నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చతస్యై జనకాత్మజాయై |
నమోస్తు రుద్రేంద్రయమనిలేభ్య:
నమోస్తు చంద్రార్కమరుద్గణభ్య: ||

అర్థము : శ్రీరామునకు నమస్కారము. జనకసుతయైన సీతామాతకు ప్రణతి, లక్ష్మణునకు నమస్కారము, వాయుదేవునకు నమస్కారములు. సూర్యచంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు.

♦️హీరకం (శుక్రుడు)
రామ: కమలపత్రాక్ష: సర్వసత్త్వమనోహర: |
రూపదాక్షిణ్యసంపన్న: ప్రసూతో జనకాత్మజే ||

అర్థము : ఓ జానకీ! శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులుగలవాడు. తన నిరుపమానకాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును గూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహసౌందర్యము, గుణసంపదయు గలవాడు.

♦️ఇంద్రనీలం (శని)..
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల: |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ: ||

అర్థము : మహాబలసంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. అసహాయ శూరుడు, కోసలదేశప్రభువు ఐన శ్రీరామునకు నేను దాసుడను.

♦️గోమేదికం (రాహువు)..
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తప: |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమత: ||

అర్థము : నేను పతిసేవాపరాయణనే ఐనచో, తపమాచిరించియున్నచో, నేను నిష్కలంక పతివ్రతనైనచో ఓ అగ్నిదేవా! హనుమంతుని చల్లగా చూడుము.

♦️వైడూర్యం (కేతువు)..
నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమం |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం ||

అర్థము : శత్రుమర్ధనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతోగూడి అయోధ్య యందు పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలో చూడగలవు.
ఇతి శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం సంపూర్ణం.
జై హనుమాన్*

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...