Thursday, May 23, 2019

గాయత్రీ మహావిద్య...

”న గాయత్ర్యా: పర: మంత్ర: న మాతు: పరా దేవతా ”
గాయత్రీ కంటే గొప్ప మంత్రము, తల్లికంటే గొప్పదేవత సృష్టిలో లేదు.

ఈ గాయత్రీ మంత్రమున ఇరవైనాలుగు అక్షరములతో పాటు ఇరవైనాలుగు దేవతమూర్తుల శక్తి అంతర్హితమై వుంటుందని గాయత్రీ మంత్రోపాసకులు ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ ఇరవైనాలుగు దేవతల ఆశీస్సులు,శక్తియుక్తులు చేకూరుతాయి

ఇరవై నాలుగు గాయత్రీమూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అని పేరు.

ఇరవైనాలుగు అక్షరములు – దేవతలు

1. తత్ – గణేశ్వరుడు
2. స – నృసింహ భగవానుడు
3. వి – విష్ణుదేవుడు
4. తుః – శివదేవుడు
5. వ – కృష్ణ భగవానుడు
6. దే – రాథా దేవి
7. ణ్యం – లక్ష్మీదేవి
8. భ – అగ్నిదేవుడు
9. ర్గః – ఇంద్రదేవుడు
10. దే – సరస్వతి
11. వ – దుర్గాదేవి
12. స్య – హనుమంతుడు
13. ధీ – పృధ్వీదేవి
14. మ – సూర్యదేవుడు
15. హి – శ్రీరాముడు
16. ధి – సీతామాత
17. యో – చంద్రదేవుడు
18. యో – యమదేవుడు
19. నః – బ్రహ్మదేవుడు
20. ప్ర – వరుణదేవుడు
21. చో – నారాయణుడు
22. ద – హయగ్రీవ భగవానుడు
23. యా – హంసదేవత
24. త్ – తులసీదేవి
ఇంతటి మహిమాన్వితం, దివ్యశక్తి గల ఈ మంత్రాన్ని ఉచ్చరించటంలో స్వర, వర్ణ, లోపం ఉండిన హాని కలుగుతుంది.

బ్రహ్మ పదమును పొందదలచినవారు “కాలనియమమును విధిగా పాటించవలయును. ప్రాతః(సూర్యోదయమునకు ముందు), మధ్యాహ్నికము, సాయంసంధ్యా(సూర్యుడు అస్తమించక ముందు)

ఈ త్రికాలములందు అశ్రద్ధ వహించక గురువు చెప్పిన ప్రకారం “త్రిసంథ్యా”యందు సంధ్యా వందనము, గాయత్రీ మంత్ర జపం చేసిన మనుజుడు బ్రహ్మపదమును సులభముగా పొందగలడు.

ఓం భూర్భువస్సువః
తత్సవితుః వరేణియం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్
భావం ‘మాలోనున్న అంతరఃచైతన్యాన్ని మేల్కొలపడానికి ఆధ్యాత్మిక జ్ఞానం అనబడే అత్యంత ప్రకాశవంతమైన దైవికమైన, పూజ్యమైన సూర్యకాంతిలో ధ్యానం చేస్తున్నాము’ అని అర్థం

 ఈ గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని, మహిమాన్వితమైనది ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని ఋగ్వేదములో చెప్పబడింది. ఒకప్పుడు కొన్ని వర్ణాల వారు మరియు వేదం పాఠశాలలో మాత్రమే దీన్ని ప్రత్యేకమైన నిర్దిష్టమైన పద్దతిలో జపించడం చేసేవారు. కాని మారుతున్న కాలంతో పాటు అందరికి అందుతున్న విజ్ఞాన ఫలాల వల్ల ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని అందరూ పఠిస్తున్నారు మరియు అందరూ వింటున్నారు. ఈ పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్దతిలో జపించినా లేదా విన్నా ఆ మంత్రం నుండి వెలువడే ధ్వని తరంగాలు మన మనసుని, శరీరాన్ని ఉల్లాసపరిచి, తేజోవంతం చేస్తాయి తద్వారా మనోబుద్ధి వికసిస్తుంది అనేది సత్యం ఈ జపం వల్ల 0మన శరీరం మనకు తెలీకుండానే ప్రకృతిలోని ఎన్నో శక్తి తరంగాలను శరీరం, మెదడు ఆకర్షిస్తుంది.. మనసుకు ఆ అనుభూతి అద్భుతమైన అనిర్వచమైన ఆనందాన్ని పొందుతుంది..

గాయత్రీ మంత్రం గురించి వేదాల ప్రకారం  చెప్పాలంటే, ‘సవిత’ గాయత్రీ మంత్రమునకు అధిష్టాన దేవత. అగ్ని ముఖము, విశ్వామిత్రుడు ఋషి. గాయత్రీ ఛందము. ప్రణవ రూపమైన ఓం కారమునకు నేను వందనం చేస్తున్నాను. విశ్వాన్ని ప్రకాశింప చేస్తున్న సూర్య తేజమైన సవితాను నేను ఉపాసిస్తున్నాను అని గాయత్రీకి ఉన్న వివిధ అర్థాలలో ఒకటి. గాయత్రి మంత్రాన్ని జపించువారు వారి మెదడులో నిరంతరం కొనసాగు ప్రకంపనలను అనుభవం పొందుతారు. వారు ఎప్పుడు జాగరూకతతో నిజజీవితాన మసలుకుంటుంటారు. ఈ విధంగా విజయాలను సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఓ వ్యక్తి గాయత్రిని సూచించిన విధంగా లయబద్ధంగా జపిస్తాడో, దాదాపు లక్ష శక్తి తరంగాలు అతని తలచుట్టూ ఉద్భవిస్తాయి. గాయత్రి మంత్రోపాసన ఒక వ్యక్తిని తెలివైనవాడిగా, ధైర్యవంతుడిగా చేస్తూ తరగనంతటి అనుకూల శక్తి సామర్థ్యాలను అతనిలోనింపుతుంది.

Wednesday, May 1, 2019

హరిహర అష్టోత్తర శతనామ స్తోత్రమ్


గోవిన్ద మాధవ ముకున్ద హరే మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే ||
దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౧||

గఙ్గాధరాన్ధకరిపో హర నీలకణ్ఠ వైకుణ్ఠ కైటభరిపో కమఠాబ్జపాణే||
భుతేశ ఖణ్డపరశో మృడ చణ్డికేశ త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౨ ||

విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే గౌరీపతే గిరిశ శఙ్కర చన్ద్రచూడ ||
నారాయణాసురనిబర్హణ శార్ఙ్గపాణే త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౩||

మృత్యుఞ్జయోగ్ర విషమేక్షణ కామశత్రో శ్రీకాన్త పీతవసనాంబుద నీల శౌరే ||
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి  ||౪||

లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య శ్రీకణ్ఠ దిగ్వసన శాన్త పినాకపాణే ||
ఆనన్దకన్ద ధరణీధర పద్మనాభ త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి  ||౫||

సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శఙ్ఖపాణే ||
త్ర్యక్షోరగాభరణ బాలమృగాఙ్కమౌలే త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౬||

శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ ||
చాణూరమర్దన హృషీకపతే మురారే త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౭||

శూలిన్ గిరీశ రజనీశ కలావతంస కంసప్రణాశన సనాతన కేశినాశ ||
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౮||

గోపీపతే యదుపతే వసుదేవసూనో కర్పూరగౌర వృషభధ్వజ భాలనేత్ర ||
గోవర్ధనోద్ధరణ ధర్మధురీణ గోప త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి  ||౯||

స్థాణో త్రిలోచన పినాకధర స్మరారే కృష్ణానిరుద్ధ కమలాకర కల్మషారే ||
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౧౦||

అష్టోత్తరాధికశతేన సుచారునామ్నాం సన్దర్భితాం లళితరత్నకదంబకేన ||
సన్నాయకాం దృఢగుణాం నిజకణ్ఠగతాం యః కుర్యాదిమాం స్రజమహో స యమం న పశ్యేత్ ||౧౧||
గణావూచతుః ||

ఇత్థం ద్విజేన్ద్ర నిజభృత్యగణాన్సదైవ సంశిక్షయేదవనిగాన్స హి ధర్మరాజః ||
అన్యేఽపి యే హరిహరాఙ్కధరా ధరాయాం తే దూరతః పునరహో పరివర్జనీయాః ||౧౨||

అగస్త్య ఉవాచ ||

యో ధర్మరాజరచితాం లళితప్రబన్ధాం నామావళిం సకలకల్మషబీజహన్త్రీమ్ ||
ధీరోఽత్ర కౌస్తుభభౄతః శశిభూషణస్య నిత్యం జపేత్స్తనరసం న పిబేత్స మాతుః ||౧౩||

ఇతి శ్రృణ్వన్కథాం రమ్యాం శివశర్మా ప్రియేఽనఘామ్ ||
ప్రహర్షవక్త్రః పురతో దదర్శ సరసీం పురీమ్ ||౧౪||

ఇతి హరిహరాష్టోత్తరశతనామస్తోత్రం సమ్పూర్ణమ్

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...