Wednesday, February 13, 2019

సూర్యమండల స్తోత్రం

సూర్యమండల స్తోత్రం

నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే |
సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ ||

యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |
దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౨ ||

యన్మండలం దేవగణైః సుపూజితం | విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |
తం దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౩ ||

యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |
సమస్త తేజోమయ దివ్యరూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౪ ||

యన్మండలం గూఢమతి ప్రబోధం | ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |
యత్సర్వ పాపక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౫ ||

యన్మండలం వ్యాధివినాశదక్షం | యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |
ప్రకాశితం యేన చ భూర్భువః స్వః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౬ ||

యన్మండలం వేదవిదో వదంతి | గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |
యద్యోగినో యోగజుషాం చ సంఘాః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౭ ||

యన్మండలం సర్వజనైశ్చ పూజితం | జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |
యత్కాల కాలాద్యమరాది రూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౮ ||

యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం | యదక్షరం పాపహరం జనానామ్ |
యత్కాలకల్పక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౯ ||

యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం | ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |
యస్మిన్ జగత్సంహరతేఽఖిలం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౦ ||

యన్మండలం సర్వగతస్య విష్ణోః | ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |
సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౧ ||

యన్మండలం వేదవిదోపగీతం | యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |
తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౨ ||

సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |
సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||

ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రం ||

ఆదిశేషుని యొక్క ఏడుపడగల విశిష్టత

ఆదిశేషుడు భూభారాన్ని వహిస్తున్నాడని ప్రసిద్ధి. (శ్రీ వేంకటేశ్వరస్వామికి జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు రాత్రి,  శ్రీవారు పెద్ద శేషవాహనంపై ఊరేగుతారు. ఈ స్వర్ణ శేషవాహనానికి ఏడు పడగలుంటాయి.) అది మనకు కనిపించని దృశ్యం. ఈ సన్నివేశాన్ని మనకు చూపించడానికా అన్నట్లుగా శ్రీమన్నారాయణుని అభీష్టం ప్రకారం ఆదిశేషుడు సువర్ణముఖరీ నదీ సమీపాన శేషాద్రిగా రూపొందాడు. శేషాచలాన్ని వరాహపురాణం ఇలా వర్ణించింది."శ్రీమన్నారాయణుని క్రీడాపర్వతమైన నారాయణగిరి మూడు యోజనాల వెడల్పు, ముప్పై యోజనాల పొడవు కలిగి ఉంది. (విష్ణువు యొక్క క్రీడాద్రియైన వేంకట పర్వతానికి సమాంతరం నారాయణగిరి). ఆ నారాయణగిరి ఆదిశేషుని ఆకారాన్ని కలిగి శ్రీహరికి మాత్రమే వశమై ఉంది. సర్వప్రాణులకు సంసేవ్యమైనది. ఆ పర్వతం దివ్యమైన ఆకారాన్ని, కలిగి, మహాపుణ్యప్రదమై ఉంది.

చిత్తూరు జిల్లానుండి కర్నూలు జిల్లా వరకు ఎర్రమల - నల్లమల అడవులలో ఏర్పడిన పర్వతాలు విహంగ వీక్షణమున సర్పాకృతిలో కనిపిస్తాయి. అందువల్లనే ఈ పర్వతశ్రేణికి శేషాచల పర్వతాలనే సార్థక నామధేయం ప్రసిద్ధమైంది. పర్వతానికి భూధారం (నేలతాలువు) అనే సార్థకనామ ధేయం ఉంది. భూమిపై నున్న పర్వతం భూమిని మోస్తోంది. భూభారాన్ని వహిస్తోంది. ఆదిశేషుడు భూమికి కిందా, పైనా ఉండి, భూమిని మోస్తూ, భూమికి ఆధారంగా ఉన్నాడు.

ఆదిశేషుని యొక్క ఏడుపడగల వలె ఉన్న ఏడుకొండలున్నాయి. వీటిపై శిరోభాగాన వేంకటేశ్వరస్వామి, వక్షఃస్థలాన అహోబిల నృసింహస్వామి, పృచ్ఛభాగాన శ్రీశైల మల్లిఖార్జునస్వామి వెలసియున్నారు. ఈ విషయాన్ని బ్రహ్మాండపురాణం వర్ణించింది. "ఆదిశేషుని యొక్క మణులలో ప్రకాశిస్తున్న పడగల ప్రదేశమే వేంకటాద్రి. దాని నామాంతరమే శేషాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మొదలగునవి.

"శేషుని వక్షఃస్థలమే సర్వసిద్ధులను ఒసగే
నృసింహుని నివాసస్థానమగు అహోబిలక్షేత్రం"

"వేంకటాద్రికి ఉత్తరభాగం ఆదిశేషుని తోకయై ఉన్నది. ఈ పృచ్ఛభాగాన గల ప్రదేశం శ్రీశైలమనే పేరుతో ప్రసిద్ధం. ఈ విషయాన్నే భవిష్యోత్తరపురాణం ఇలా వివరించింది." అది (శేషాద్రి) సాక్షాత్తు శేషుని అవతారమై, సకల థావులచే శోభితమై, సకల పుణ్యక్షేత్రాలకు (తీర్ధాలకు) నిలయమై, పవిత్రములగు అరణ్యాలతో విరాజిల్లుతోంది. దాని ముఖం వెంకటగిరి, నడుము నృసింహపర్వతముగ (ఆహోబిలంగా), తోకభాగము శ్రీశైలంగా వేంకటాచలమనే పేరుతో ప్రసిద్దమై ఉన్నది

Saturday, February 9, 2019

'ఓం''... తో అలసట మాయం...

'ఓం''...  తో   అలసట  మాయం...
శాస్త్రీయంగా  నిరూపించిన  బాలిక
🌿🌿🌿🌿🌻🌻🌻🌿🌿🌿🌿

👉    ఓం... శబ్దంతో....
శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలు గేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది.
👉పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్త లను అకట్టుకుంది.
👉కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది.
=========🌻🌻🌻
👉ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు.
==========🌻🌻🌻
అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...
👉ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియ
జేసింది.
👉అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది.
===========🌻🌻🌻
👉గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు. కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు.
===========🌻🌻🌻
👉ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు.
👉ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించి నపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది.
👉అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది.
👉దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది.
👉దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది. 👉ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది.
============🌻🌻🌻
👉17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది.
👉ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు  తెలిసింది.

ప్రాచీన భారతీయ మహర్షులు రచించిన రహస్య గ్రంథాలు - వాటి గురించి విశేషాలు

మన ప్రాచీన మహర్షులు మహా తపస్సంపన్నులు మరియు గొప్ప విజ్ఞానులు . వీరు తమయొక్క విజ్ఞానాన్ని గ్రంధరూపంలో భద్రపరిచారు. ప్రస్తుతం ఆయా గ్రంథాలు మనకి దొరకటం లేదు .  నాకున్న పరిఙ్ఞానం మరియు కొన్ని పురాతన గ్రంధాలను పరిశోధించి వారు రాసిన గ్రంథాలు వేటికి సంభంధించినవో వాటిలో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను .

 *  బృహద్యంత్ర సర్వస్వము  -

         ఈ గ్రంథమును భరద్వాజ మహర్షి రచించెను . ఈ గ్రంధము నందు అనేక యంత్రాల గురించి వివరంగా ఇచ్చాడు. ముఖ్యంగా " విమానాధికారణము" అను ఒక అధ్యాయం కలదు. ఇందు అనేక విమానాలు మరియు విచిత్రంగా మెలికలు తిరుగుతూ ప్రయాణించే విమానాల గురించి వివరించారు . ఈ విమానాలు ఆకాశంలో ఎగురునప్పుడు విమానాన్ని నాశనం చేసే వివిధ రకాల సూర్యకిరణాల గురించి , భయంకర వాయుగుండాల గురించి , అమిత విద్యుత్ శక్తి నుండి , అత్యుష్ణము , అతి శీతలం నుండి విమానం మరియు అందులో ప్రయాణించే వారిని రక్షించేందుకు పదమూడు రకాల దర్పణములు ( అద్దములు ) గురించి వివరించారు

                   ఇందు దుష్టశక్తులను నిరోధించి ఉత్తమ శక్తులను ఆకర్షించు దర్పణములు ఆరున్నూ , సూర్యుని నుండి రకరకాల సూర్యకిరణములు ఆకర్షించి అక్కరలేని వాటిని నిరోధించే దర్పణములు ఆరున్నూ కలవు. పదమూడొవది వివిధరకాల పొగను సృష్టించును. విచిత్రకార్యములకు ఉపయోగపడును.

                 ఇప్పుడు మనం తయారుచేసే అద్దాలలో ప్రధానంగా సోడియమ్ గ్లాసులు , పొటాషియం గ్లాసులు మాత్రమే . కాని మన ప్రాచీనులు అద్దం తయారుచేసేప్పుడు సువర్ణం , పాదరసం , అయస్కాంతం , ముత్యములు మొదలగునవి కలిపెదరు . అంతే కాకుండా కొన్నిరకాల దివ్యోషదాలు కూడా అద్దం తయారీలో కలిపేవారు. 

          అనేక రకాల విచిత్ర వస్తువుల గురించి కూడా ఈ గ్రంథంలో విపులంగా ఉంది.

 *  ఆగతత్వలహరీ  -

         ఇందు వ్యవసాయం , అనేక వృక్షాల వర్ణనలు , వాటి చికిత్సా పద్దతులు కలవు. ఈ గ్రంథం అశ్వలాయన మహర్షి రచించెను .

 *  అవతత్వ ప్రకరణం  -

          ఈ గ్రంథాన్ని కూడా అశ్వలాయన మహర్షి రచించారు . దీనిలో స్నానఫలాలు జలాల్లో రకాల గురించి వివరించారు .

 *  అండ కౌస్తభం  -

           ఇది పరాశర కృతం . బ్రహ్మాండ చరిత్ర
జీవకోటి విమర్శ మొదలగునవి వివరించబడినవి.

 *  అంశు బోధిని -

           ఇది భరద్వాజ మహర్షి రాశారు. ఇందు గ్రహములు వేధించు పద్దతులు  , ప్రకాశం ( light ) , ఉష్ణం ( heat ) , ధ్వని ( sound ) , తంత్రీ వార్తావిధి ( టెలిఫోనీ ) , విమాన నిర్మాణ విధి ,విద్యుతశక్తి ప్రయోగాలు కలవు.

 *  ఆకాశ తంత్రం  -

            ఇది భరద్వాజ మహర్షి రచించారు . ఇందు ఆకాశం యొక్క 7 విధములు , ఆకాశక్షేత్ర విభాగములు , ఆకాశంలోని శక్తి సంయోగ విధములు , ఆకాశం నందలి అగ్ని, కాంతి, గ్రహ కక్ష్యలు , భూములు , నదులు మొదలగు వాటి వివరణలు కలవు.

 *  ఋక్ హృదయ తంత్రం  -

            ఇది అత్రి మహర్షి కృతం . ఇందు రోగములు , చికిత్సలు విశేషముగా వివరించబడి ఉన్నాయి.

 *   ఔషధీ కల్పం  -

            ఇది అత్రి మహర్షి కృతం . ఇందు ఔషధముల ప్రభావములు . చిరకాలం జీవించుటకు యోగాలు , గుళికా యోగములు, ఆయుర్వృద్ది మొదలగునవి కలవు.

 *  కరక ప్రకరణము  -

             ఇది అంగీరస మహాముని రచించెను . ఇందు మేఘములలొని మార్పులు , జీవరాశుల ఉత్పతి విధానం , సూర్యరశ్మిలోని మార్పులు మేఘములకు సంబంధము , నవరత్నములు పుట్టుటకు సంబందించిన సూర్యరశ్మి విభాగాలు కలవు.

 *   కర్మాబ్దిసారము  -

             ఇది ఆపస్తంబ మహర్షిచే రచించబడెను . ఇందు కర్మలు , చేయవలసిన విధులు , వాటి ప్రాముఖ్యత , వాటి ఫలములు , శారీరక , మానసిక ఫలములు మొదలైనవి కలవు.

 *   కౌముదీ  -

               ఇది సోమనాథ కృతం ఇందు బ్రహ్మాండం గురించి విపులంగా రాసి ఉన్నది.

 *   ఖేట సర్వస్వము  -

              ఇది జైమినీ మహర్షి చే రచించబడెను . ఇందు ఆకాశ విభాగములు , అందలి గ్రహకక్షలు మొదలగునవి కలవు.

 *  ధాతు సర్వస్వము  -

             ఇది బోధాయన మహర్షిచే రచించబడెను . ఇందు ధాతువులు , వాటి ఉత్పత్తులు , గనులు , గనుల నుండి
లోహములు తీయు పద్దతి , విషములు , విషహరణోపాయములు , భస్మములు , గంధకం , పాదరసం మొదలగువాటి వర్ణన కలదు .

 *  ధూమ ప్రకరణం  -

           ఇది నారద మహర్షి కృతం . ఇందు వివిద ధూమములు , వాటిని కొన్ని రకాల అద్దములచే పట్టుట వాటిని కొన్నిరకాల ఆమ్లములచే పరిశోధించుట . ఆ ధూమం మంచిదో కాదో తెలుసుకొనుట అనగా ఆయాపదార్థాలలోని విషగుణములను తెలుసుకొనుట తద్వారా శరీరాన్ని , బుద్ధిని పోషించుకొనుట ఈ విషయాలన్నీ కలవు.

 *  నామార్థ కల్పం  -

           ఇది అత్రి మహర్షిచే రచించబడెను. ఇందు 84 లక్షల శక్తులు వాటి నామాలు , నామార్థాలు కలవు.

 *  ప్రపంచ లహరీ  -

             ఇది వశిష్ట మహర్షి చే రచించబడెను . ఇందు అణువుల వలన బ్రహ్మండా నిర్మాణమా లేక బ్రహ్మతత్వం వలనా ? అని చర్చ కలదు. అణువు ల విమర్శ కూడా కలదు.

 *  బ్రహ్మాండ సారం  -

               ఇది వ్యాస మహర్షిచే రచించబడెను . ఇందు బ్రహ్మాండ చరిత్ర కలదు.

 *  మేఘోత్పత్తి ప్రకరణం  -

              ఇది అంగీరస మహర్షి కృతం . ఇందు మేఘములు , మెరుపులు , పిడుగులు మొదలగు వాటి ఉత్పత్తి వర్ణణలు కలవు.

 *  లోక సంగ్రహము  -

              ఇది వివరణాచార్య కృతం . ఇందు 1714 భాషలు , జీవజాతులు , వాటి పుట్టుక , ఆహార నియమాలు , మతములు మొదలగు వివరములు కలవు. మొత్తం ప్రపంచం యొక్క సంగ్రహం కలదు.

 *  లోహ తంత్రము  -

              ఇది శాక్త్యాయన మహార్షి చే రచించబడెను . ఇందులో లోహోత్పత్తి మొదలగు విషయాలు కలవు.

 *  వాయుతత్వ ప్రకరణము  -

              ఇది శాక్త్యాయన మహర్షి కృతం . ఇందులో 84 వేల రకాల వాయువులు , వాటి పొరలు , భూమి మీద  ఆయా వాయువుల యొక్క ప్రభావములు , అవి వృక్ష సంపద పైన ఎట్లు పనిచేయుచున్నవి ? ఈ వాయువులను కనిపెట్టుటకు తగిన యంత్ర సాధనాలు మొదలగునవి కలవు.

 *  వైశ్వనర తంత్రము -

              ఇది నారద మహర్షి కృతం . ఇందు 128 రకాల అగ్నులు , వాటి రంగులు , గుణములు , ఉపయోగములు , కొలతలు తరతమ బేధములు కలవు.

 *  శక్తి తంత్రము  -

            ఇది అగస్త్య మహార్షి చే రచించబడినది. ఇందు విద్యుత్ శక్తి యొక్క సర్వాకర్షణ సామర్ధ్యము , రూపాకర్షని , రసాకర్షిణి , గంధాకర్షిణి , స్పర్శాకర్షిణి , శబ్దాకర్షిణి , ధైర్యాకర్షిణి , శరీరాకర్షిణి , ప్రాణా కర్షిణీ  మొదలగు ముఖ్యమైన పదహారు శక్తుల వర్ణనం , సెకనుకు 1 , 86 ,000 మైళ్ళ వేగముతో ఇప్పుడు టెలివిజన్ , రేడియో ప్రసారాలు ఎలా పోవుచున్నవో అదే విధముగా విధ్యుత్ శక్తి సహాయముతో రసము , గంధకం , స్పర్శము చివరికి శరీరం కూడా అంతే వేగముతో ప్రయాణించగల విధివిధానాలు చెప్పెను . బహుశా వాయువేగంతో మనిషి ఎలా ప్రయాణించాలో తెలియచేశారు అనుకుంటా .

 *  శుద్ద విద్యాకల్పం  -

         ఇది అశ్వలాయన మహర్షి కృతం . ఇందు ప్రపంచోత్పత్తి నిర్ణయము కలదు.

 *  సమరాంగణ సూత్రధారము  -

         ఇది భోజమహారాజుచే రాయబడినది. ఇందు అనేక యంత్రములు కలవు. ఈ యంత్రములు యందు ఉపయోగించు పంచభూత బీజముల విధానములు , విమాన నిర్మాణ విధానములు , ద్వని ( సైరన్ ) యంత్రము చేయు పద్ధతులు , బొమ్మలచే యుద్ధము , నాట్యము , సంగీతము , ద్వార రక్షణము మొదలగు విచిత్రములు కలవు.

           పైన చెప్పినవే కాకుండా భరద్వాజ మహర్షి రచించిన బృహద్విమాన శాస్త్రంలో అశని కల్పం , అంశుమ తంత్రం , ఉద్బిజ్జతత్వ సారాయణము , దర్పణకల్పము , దర్పణశాస్త్రం , దర్పణ ప్రకరణం , ద్రావక ప్రకరణం , మణికల్ప ప్రదీపిక , మణి ప్రకరణము , మణి రత్నాకరం , ముకుర కల్పము , యంత్ర కల్పము ,  యంత్ర కల్పతరువు , లోహతత్వ ప్రకరణం , లోహ ప్రకరణం , లోహ రత్నాకరం , లోహ రహస్యము , లోహ శాస్త్రం , విమాన చంద్రిక , విష నిర్ణయాధికారం , వ్యోమయాన తంత్రం , శక్తి తంత్రము , శక్తి బీజము , శక్తి కౌస్తుభం , సమ్మోహన క్రియాకాండం , సౌదామినీకలా మొదలగు 150 గ్రంథాలు కలవు. అదియే కాక  అగస్త్య, అత్రి , అంగీర, ఆపస్తంబ , ఈశ్వర , కపర్ది , గర్గ, గాలవ,  గోభిల , గౌతమ, నారద , పరాశర, భరద్వాజ , వశిష్ట , వాల్మీకి , వ్యాస , శౌనక , సిద్ధనాధ  మొదలగు 140 మంది గ్రంథకర్తలు కలరు. ఋషులు అంటే ముక్కులు మూసుకుని మూలన  కూర్చుని తపస్సు చేసుకునే వారు కాదు. వీరు గొప్ప వైజ్ఞానికులు .భారతదేశంలో అధికారంలో ఉన్న వారు వీటిపైన సరైన దృష్టి పెట్టకపోవడం వలన ఎంతో విజ్ఞానాన్ని కోల్పోయాము. కాని మన ప్రాచీన విఙ్ఞానం పైన విదేశీయులు అమిత మక్కువ చూపిస్తారు. దీనిపై మీకో ఉదాహరణ చెప్తాను. 1936 వ సంవత్సరం లో  1936 వ సంవత్సరం వరకు ముద్రించబడిన గ్రంథాల జాబితా ని                 "రసరత్న సముచ్ఛయ" అనే పేరుతో ముద్రించారు . ఒక కేటలాగ్ లాగా అది మనదేశంలో దాని విలువ 1 రూపాయి . జర్మనీ దేశంలో మన భారతీయ గ్రంథాల గురించి ఇచ్చిన కేటలాగ్ 5000 రూపాయిల చొప్పున అమ్ముడు అయినది.  ఇది మన భారతీయ వైఙ్ఞానిక విలువ కాని అది మరుగున పడుతుంది. మనం అయినా కాపాడుకొని మన తరవాతి తరాలకు ఆ విజ్ఞానాన్ని అందించాలి.

Thursday, February 7, 2019

108 #నవాంశలు వాటి ఫలితాలు

27 నక్షత్రాలలోను ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి. మొత్తం నూట ఎనిమిది పాదాలే గాక వాటికి విడివిడిగా రాశ్యంశలు కూడా ఉంటాయి.

           అశ్వని, రోహిణి, పునర్వసు, మఖ, హస్త, విశాఖ, మూల, శ్రవణం, పూర్వాభాద్ర అనబడే తొమ్మిది నక్షత్రాల ప్రధమ పాదాలు మేషాంశకు, ద్వితీయ పాదాలు వృషభాంశకు, తృతీయ పాదాలు మిధునాంశకు, చతుర్ధ పాదాలు కర్కటాంశకు చెంది ఉంటాయి.

          భరణి, మృగశిర, పుష్యమి, పుబ్బ, చిత్ర, అనూరాధ, పూర్వాషాడ, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర అనబడే తొమ్మిది నక్షత్రాల ప్రధమ పాదాలు సింహాంశకు, ద్వితీయ పాదాలు కన్యాంశకు, తృతీయ పాదాలు తులాంశకు, చతుర్ధ పాదాలు వృశ్చికాంశకు చెంది ఉంటాయి.

         కృత్తిక, ఆరుద్ర, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, జ్యేష్ఠ, ఉత్తరాషాడ, శతభిషం, రేవతి  అనబడే తొమ్మిది నక్షత్రాల ప్రధమ పాదాలు ధనురాంశకు, ద్వితీయ పాదాలు మకరాంశకు, తృతీయ పాదాలు కుంభాంశకు, చతుర్ధ పాదాలు మీనాంశకు చెంది ఉంటాయి.

1) అశ్వని నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
1) తస్కరాంశ:- అశ్వని నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. మంచి సంపద, భోగాలను అనుభవించువాడు, తగాదాలనిన ఇష్టం కలవాడు, లోభ గుణం కలవాడు, పరస్త్రీల యందు ఆసక్తి కలవాడు, చోర గుణం కలవాడు అగును.
2) భోగ్యాంశ:- అశ్వని నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ధర్మ నిరతుడు, తేజస్సు కలవాడు, ధన, ధాన్యాభివృద్ధి కలవాడు, దాన గుణం కలవాడు అగును.
3) విచక్షణాంశ:- అశ్వని నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. సమస్త భోగాలు కలవారు, ప్రతి పనిని సాధించువాడు, పనులను నేర్పుతో చేయువాడు అగును.
4) ధర్మాంశ:-అశ్వని నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది.  భగవంతుడి పైన భక్తి కలవాడు, పూజలు చేయువాడు, సంధ్యావందన తత్పురుడును, నిత్యం ధర్మ కార్యాచరణలో ఉండువారు అగును.

2) భరణి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
5)నృపాంశ:- భరణి నక్షత్ర ప్రధమ పాదం రవిది. గౌరవ, మర్యాదలు పొందువారు, మంచి లక్షణాలు కలిగి ఉంటారు. కార్య సఫలత కలవారు, ధర్మాత్ముడు అగును.
6) నపుంసకాంశ:- భరణి నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. లోభత్వం కలవారు, నపుంసకుడు, పిసినారి, పనులయందు నేర్పరి, మధ్యవర్తిత్వం చేయువారు అగును.
7) అభయాంశ:-భరణి నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ప్రశాంతమైన మనస్సు కలవారు, ఉత్సాహవంతులు, శూరులు, బాద్యతారాహిత్యమైన జీవితాన్ని ఆశించేవారు అగును.
8) పాపాంశ:- భరణి నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. క్రూర స్వభావం కలవారు, కృతజ్ఞత కలవారు, అధిక పుత్ర సంతానవంతులు, ఫలితాలను ఆశించని వారు అగును.

3) కృత్తిక నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
9) ధానాంశ:- కృత్తిక నక్షత్ర ప్రధమ పాదం గురువుది. దాన, ధర్మాలు చేయువారు, ధనవంతులు, ప్రతాపవంతులు, పనులలో నైపుణ్యం కలవారు అగును.
10) పాపాంశ:- కృత్తిక నక్షత్ర ద్వితీయ పాదం శనిది. మొహమాటం లేకుండా ఉంటారు, పాప కర్మలు చేయువారు, వేశ్యా గృహాలలో జీవించే వాళ్ళుగా ఉంటారు.
11) ఉగ్రాంశ:- కృత్తిక నక్షత్ర తృతీయ పాదం శనిది. చెడు సావాసాలు చేయువారు, నైపుణ్యం ఉన్నప్పటికి మంద బుద్ధులుగా ఉంటారు, దుష్ఠులైన మిత్రులు కలవారు అగును.
12) ఉత్కృష్టాంశ:- కృత్తిక నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. విద్యా వినయాలు కలవారు, ధర్మాత్ములు, ధార్మికులు, ఎల్లప్పుడు  సంతోషం కలవారు అగును.

4) రోహిణి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
13) సేనాంశ:- రోహిణి నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. చంచలత్వం కలవాడు, ఎర్రని వెంట్రుకలు కలవాడు, శూరుడు, దెబ్బలాటలకు ప్రీతి కలవాడు, నిష్టూరంగా మాట్లాడు వాడు అగును.
14) భృత్యాంశ:-రోహిణి నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. పొడవైన శరీరం కలవాడు, ఓటమిని అంగీకరించలేని తనం కలవారు, మంచి నడవడిక కలవారు అగును.
15) విద్యాంశ:- రోహిణి నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. పండితులు గాను, కవులు గాను, గణిత శాస్త్రజ్ఞులు గాను, లోక వ్యవహార జ్ఞానం కలవారు గాను ఉంటారు.
16) అత్యాశ:- రోహిణి నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఇతరుల ధనంపైన ఆశపడేవారు, తెలివైన వారుగాను, బుద్ధిమంతులుగాను, సజ్జనులుగాను ఉందురు.

5) మృగశిర నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
17) రాజాంశ :- మృగశిర నక్షత్ర ప్రధమ పాదం రవిది. స్దూలమైన శరీరం కలవారు, శత్రువులపైనా విజయం సాదించువారు, ధనవంతులు, తలకు మించిన పనులను నెత్తిన వేసుకొనేవారు గాను ఉంటారు.
18)చండాంశ:- మృగశిర నక్షత్రం ద్వితీయ పాదం బుధుడిది. యజ్ఞ యాగాదులు చేయువారు, భాగ్యవంతులు గాను, మంచి వాక్ శుద్ధి కలవారు గాను ఉంటారు.
19) అభయాంశ:- మృగశిర నక్షత్రం తృతీయ పాదం శుక్రుడిది. ఉదార స్వభావం కలవారు గాను, దేనికైనా సిద్ధపడేవారు గాను, ముఖ వర్చస్సు కలవారుగాను, మంచి పనులు చేయువారు, శౌర్యవంతులు గాను ఉందురు.
20) నీచాంశ:-మృగశిర నక్షత్రం చతుర్ధ పాదం కుజుడిది. కామత్వం కలవారు, తలపైన దెబ్బ తగిలినవారు గాను, ఇతరులను ద్వేషించువారు గాను ఉందురు.

6) ఆరుద్ర నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
21) కృపాంశ:- ఆరుద్ర నక్షత్ర ప్రధమ పాదం గురువుది. గుణవంతుడు, పెద్దల యందు భక్తి, ప్రశాంతమైన ముఖం కలవారు గాను, దయా స్వభావం కలవారుగాను, మంచి నే్పరులుగాను ఉందురు.
22) తస్కరాంశ:- ఆరుద్ర నక్షత్ర ద్వితీయ పాదం శనిది. కలహా ప్రియులు, చోర విధ్య బాగా తెలిసినవారు, అతి దాహార్తి కలవారు, హీనమైన కాంత స్వరం కలవారు గాను ఉంటారు.
23) ఉగ్రాంశ:- ఆరుద్ర నక్షత్ర తృతీయ పాదం శనిది. శుచి శుభ్రత లేనివారు, చెడు ఆలోచనలు చేసేవారు, స్ధిరమైన ఆదాయం లేనివారు, మంత్ర తంత్రాలతో భయపెట్టేవారు అగును.
24) ఉత్కృష్టాంశ:- ఆరుద్ర నక్షత్ర చతుర్ధ పాదం గురువుది.  ధర్మాన్ని పాటించేవారు, అక్కటి ఆచార వ్యవహారాలు చేయువారు, గౌరవ మర్యాదలు తెలిసిన వారై ఉంటారు.

7) పునర్వసు నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
25) ఉత్తమాంశ:- పునర్వసు నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. భగవంతునిపైన భక్తి కలవారు, ఎర్రటి కనులు కలవారు, కోప స్వభావం, చెడు ప్రవర్తన కలవారుగాను ఉంటారు.  
26) భోక్తాంశ:- పునర్వసు నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. వస్త్ర అలంకార ప్రియులు, భోజన ప్రియులు,  ధనవంతులు, శృంగార ప్రియులు అవుతారు.
27) సౌమ్యాంశ:- పునర్వసు నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. పండితుడు, లోభ స్వభావం కలవారు, తరచూ వ్యాధి పీడితులుగాను, వ్యాపార దక్షత కలవారు, శృంగార ప్రియులు అవుతారు.
28) ధనాంశ :- పునర్వసు నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఆదిక ధనవంతులు, ఉపకారం చేయువారు, స్త్రీల మాటలను పాటించువారు, నిర్మలత్వం కలవారు, ఆకర్షణ కలవారు అవుతారు.

8) పుష్యమి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
29) భూపాంశ:- పుష్యమి నక్షత్రం మొదటి పాదం రవిది. వీరికి ఏకాంతమన్న ప్రీతి, ప్రతి పని తొందరగా చేస్తారు. రోగం కలవారుగాను, స్ధూల కాయం కలగి ఉంటారు.
30) సౌమ్యాంశ:- పుష్యమి నక్షత్రం రెండవ పాదం బుధుడిది. పరస్త్రీలపైనా వ్యామోహం కలిగి ఉంటారు. వారి మూలంగా కష్టాలను తెచ్చుకుంటారు. ధనకాంక్ష కలిగి ఉంటారు.
31) శూరాంశ :- పుష్యమి నక్షత్రం మూడవ పాదం శుక్రుడిది. చాలా ప్రసన్నంగా ఉంటారు. భోగవంతులు, పరోపకారి, నిత్యం మనశ్శాంతి కలిగి ఉంటారు.
32) నీచాంశ:- పుష్యమి నక్షత్రం నాల్గవ పాదం కుజుడిది. వీరు సహజంగా కలహ ప్రియులు, ఇతరుల వస్తువులను దొంగలించువారు. పరస్త్రీల యందు ఆసక్తి కలవారుగాను ఉంటారు.

9) ఆశ్లేష నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
33) ఉత్పన్నాంశ:- ఆశ్లేష నక్షత్ర ప్రధమ పాదం గురువుది. వీరు ధైర్యవంతులు. సత్యవాక్కులు పలుకువారు. మంచిబుద్ధి కలవారుగాను ఉంటారు.
34) పాపాంశ:- ఆశ్లేష నక్షత్ర ద్వితీయ పాదం  శనిది. వీరు నిత్యం ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే ఉంటారు. పాప కార్యాలు చేయుటలో ఆసక్తి కలిగి ఉంటారు. చంచల స్వభావం కలిగి ఉంటారు. చెడ్డ పనుల ద్వారా ఆదాయం సంపాదిస్తారు. సుకి శుభ్రత లేనివారు అవుతారు.
35) క్రోధాంశ:- ఆశ్లేష నక్షత్ర తృతీయ పాదం శనిది. వీరు అబద్ధాలు ఆడటం, కుట్రలు చేయటం, అన్యాయంగా డబ్బు సంపాదించటం, బుద్ధి మాంద్యం, వాటా రోగం కలిగి ఉంటారు.
36) ఉగ్రాంశ:- ఆశ్లేష నక్షత్ర నాల్గవ పాదం గురువుది. వీరు మాట పితరులకు మారకులు అవుతారు. దాన నాశకులు, పరుల పెంపకంలో ఉండేవారు, ఒక మోస్తరుగా సుఖపడేవాళ్ళుగా ఉంటారు.

10) మఖ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
37) సేవాంశ:- మఖ నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది.  వీరి శరీరంపై ఎర్రని రోమాలు కలిగి ఉంటారు. పట్టుదల కలిగి ఉంటారు. ప్రతిష్ఠ కలవారుగా ఉంటారు.
38) భుక్తాంశ:- మఖ నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది వీరు ఏకాంతాన్ని కోరుకుంటారు. త్యాగం చేయువారు, దేనినైనా న్యాయంగా పొందాలి. సంపాదించాలి అని కోరుకునేవారు.
39) విచక్షణాంశ:- మఖ నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. వీరు జ్ఞాన వంతులు, మేధావులు, శాస్త్రవేత్తలు, నేర్పరులుగా ఉంటారు.
40) అంత్యాంశ :- మఖ నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. వీరు స్త్రీ ప్రియులు, రోగం కలవారు, తెలివైనవాళ్ళు, కుటిలమైన స్వభావం కలిగి ఉంటారు. పొట్టిగా ఉంటారు.

11) పుబ్బ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
41) రాజాంశ:-  పుబ్బ నక్షత్ర ప్రధమ పాదం రవిది. వీరు చంచలమైన నేత్రాలు కలిగి ఉంటారు. చూడటానికి బలహీనంగా ఉంటారు. కొనుగోలు, అమ్మకాలు వ్యవహారాలు కలిగిన వ్యాపారాలలో నిపుణత్వం కలిగి ఉంటారు.
42) నపుంసకాంశ :- పుబ్బ నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. కీర్తి ప్రతిష్ఠలు కలిగి ఉంటారు. వికృత రూపం కలిగి ఉంటారు. ఇతరులకు కష్ఠం కలిగిస్తూ ఉంటారు.
43) అభయాంశ :- పుబ్బ నక్షత్రం తృతీయ పాదం శుక్రుడిది. వీరికి పుత్ర సంతానం అధికంగా కలిగి ఉంటారు. శిల్పశాస్త్రంలో నిపుణులు అవుతారు. గణిత శాస్త్రంలోను నిపుణత్వం కలిగి ఉంటారు.
44) దరిద్రాంశ :- పుబ్బ నక్షత్రం చతుర్ధ పాదం కుజుడిది. జీవితంలో సుఖం ఉండదు. నిత్యం కష్ఠలను అనుభవిస్తారు. అధిక సంతానం కలిగి ఉంటారు. దరిద్రాన్ని అనుబావిస్తూంటారు.

12) ఉత్తర నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
45) ఉత్పన్నాంశ:- ఉత్తర నక్షత్రం ప్రధమ పాదం గురువుది. వీరు వాత రోగం కలిగి ఉంటారు. పరిశుద్ధులు, ప్రబంధ ప్రియులు, కావ్యాస్వాదనా చతురులు కలవారు  అవుతారు.
46) పాపాంశ :-  ఉత్తర నక్షత్రం ద్వితీయ పాదం శనిది. వీరు పరులను పీడించేవారుగాను, చంచలత్వం కలవారుగాను, నిత్య దరిద్రులుగా ఉందురు.
47) ఉగ్రాంశ:- ఉత్తర నక్షత్రం తృతీయ పాదం శనిది. వీరు మేలు చేసిన వారిని మరిచిపోతారు. చెడు వాదనలు చేసేవాళ్ళు, డాంబికాలు పోతారు, గర్విష్టులు, అందరిని సూటిపోటీ మాటలతో వేదిస్తారు.
48) శుభాంశ :- ఉత్తర నక్షత్రం చతుర్ధ పాదం గురువుది. వీరు వినయ విధేయతలు కలవారు, విద్యా సంపన్నులు అవుతారు. పుత్ర సంతానం కలవారు అవుతారు.

13) హస్త నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు.
49) క్రూరాంశ:- హస్తా నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. వీరు పాప కర్మలు చేసేవాళ్ళు, బలవంతులు, చింతన కలవారు అవుతారు.
50) ముక్తాంశ:- హస్తా నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. వీరు నిత్యం మంచి మాటలనే మాట్లాడేవారు, మంధ బుద్ధి కలవారుగాను ఉంటారు.
51) పండితాంశ:- హస్తా నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. వీరు చెడ్డ బుద్ధి కలవారు, కాముకులు, వ్యాపారంలో భాగం అయిన అమ్మకాలు, కొనుగోళ్ళు విషయాలలో మహా నిపుణులుగా ఉంటారు.
52) ధనాంశ:- హస్తా నక్షత్రం చతుర్ధ పాదం చంద్రుడిది. వీరు రాచకార్యాలు చేయుటలో ఇష్టం కలవారు, సన్మానాలు పొందేవారు, అభిమానవంతులు, కొద్దిగా కోపం కలవారుగాను ఉంటారు. 

14)  చిత్రా నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
53) రాజాంశ:- చిత్రా నక్షత్ర ప్రధమ పాదం రవిది. వీరు చంచల మనస్తత్వం కలవారుగా ఉంటారు. ఉగ్ర స్వభావం కలవారుగా ఉంటారు.
54) నపుంసకాంశ:- చిత్రా నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. వీరు చాలా తియ్యగా మాట్లాడి జనాలను నమ్మిస్తారు. కోపం వస్తే చాలా కాలం ఉంటుంది. ఈ పనిని ఐనా సరే అధికకాలం అయ్యేటట్లు చేస్తారు.
55) అభయాంశ:- చిత్రా నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. వీరు కీర్తిమంతులు, శౌర్యవంతులు, పండితులతో సహవాసం చేయటం, వారితోనే గడపటం వీరి లక్షణాలు.
56) ధనాంశ:- చిత్రా నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. వీరు చిన్నతనంలోనే దొంగతనాలకు పాల్పడతారు. సరిపడా సంపాదించాక నేరాలు మానేస్తారు. అమిత ధైర్యవంతులు, విక్రమం కలవారుగాను ఉంటారు.

15) స్వాతి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
57) ఉత్పన్నాంశ :- స్వాతి నక్షత్ర ప్రధమ పాదం గురుడుది. వీరు ఎప్పుడు అతిగా మాట్లాడుతూనే ఉంటారు. సూక్ష్మ పరిశీలన కలవారు. జ్ఞానం కలవారుగాను ఉంటారు.
58) ధనాంశ :- స్వాతి నక్షత్ర ద్వితీయ పాదం శనిది. వీరు చెడ్డపేరు తెచ్చుకుంటారు. దొంగలుగా, వ్యసనపరులుగా పరిణమిస్తారు. సాయం చేసినవారిని మాత్రం మరువరు.
59) ఉగ్రాంస:- స్వాతి నక్షత్ర తృతీయ పాదం శనిది. వీరు మూర్ఖులు, అత్యంత కోపం కలవారు. శత్రువుల పట్ల ద్వేషం పెంచుకునే వారు. అతిగా ఖర్చు పెట్టేవాళ్ళుగా ఉంటారు.
60) ఉత్కృష్టాంశ :- స్వాతి నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. వీరు కోపం కలిగి ఉన్న జనాభిమానం కలవారు. గురుభక్తి కలవారు. ధనికులు అయి ఉంటారు.

16) విశాఖ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
61) సౌఖ్యాంశ:- విశాఖ నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. పలుచటి ఛాతీ కలిగిన శరీరం. ఎర్రటి కన్నులు కలిగి ఉంటారు. మిక్కిలి ధనవంతులై ఉంటారు.
62) భోగాంశ:- విశాఖ నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. రూప వంతులు, సౌందర్యవంతులు, అందమైన భార్య కాళీ ఉంటారు. సౌఖ్యవంతులు. చెవిటి వాళ్ళుగా గాని, వినికిడి లోపం ఉన్నవారుగా గాని ఉంటారు. దేనినైనా న్యాయ పరంగా సంపాదింకునేవాళ్ళు అవుతారు.
63) సౌమ్యాంశ:- విశాఖ నక్షత్రం తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు మంచి చెడు పట్ల విచక్షణ కలిగి  ఉంటారు. నేర్పరితనం కలిగి ఉంటారు. దాన గుణవంతులుగా ఉంటారు. కంటి చూపును కోల్పోవటం లేదా లోపం గాని ఏర్పడవచ్చును.
64) అర్ధాంశ:- విశాఖ నక్షత్రం చతుర్ధ పాదం చంద్రుడిది. స్త్రీలను ఆకర్షించువాడు. దృష్టి లోపం కలవాడు. ధన సంపాదన పైన ఆసక్తి కలవాడు అగును.

17) అనూరాధ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
65) రాజాంశ :- అనూరాధ నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు మాట్లాడేటప్పుడు వినయ విధేయతలు కలిగి ఉంటారు. నీతి నియమాలు కలిగి ఉంటారు. మంత్రోపాసన చేసేవారు. మంత్రాంగాలు నెరపేవాళ్ళుగా ఉంటారు.
66) నపుంసకాంశ:- అనూరాధ నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. ఈ జాతకులు వీణా వాయిద్యాల పట్ల మక్కువ కలిగి ఉంటారు. ఆదర్శమూర్తులు. మేధావులుగా ఉంటారు.
67) అభయాంశ :- అనూరాధ నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. వీరికి స్ధిరత్వం ఉండదు. అనుకూలవతియైన భార్య లభిస్తుంది.
68) నీచాంశ:- అనూరాధ నక్షత్రం చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు ఇతరులకు ద్రోహం చేసేవాళ్ళు, కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు, దరిధ్రులు అవుతారు.

18) జ్యేష్ఠ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
69) ఉత్పన్నాంశ :- జ్యేష్ఠ నక్షత్ర ప్రధమ పాదం గురువుది. రచనా సామర్ధ్యం కలవారు. హాస్యప్రియులు, గర్వం కలవారుగా ఉంటారు.
70) ఉగ్రాంశ:- జ్యేష్ఠ నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడేవారుగాను, ఇతరులకు సులభంగా లొంగిపోయేవారుగాను ఉంటారు.
71) పాపాంశ:- జ్యేష్ఠ నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకులు అంగవైకల్యం కలిగి ఉంటారు. మరీ అతి స్వల్పమైన భోగం కలిగి ఉంటారు. చూపు సరిగా లేకపోవటం, ఇతరుల పనులు చేయువారు అగుదురు.
72) శుభాంశ:- జ్యేష్ఠ నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. వినికిడి లోపం కలిగి ఉంటారు.ధర్మ శాస్త్రాలపైనా పట్టు కలవారు. పూజలు చేయువారు. శాస్త్రవేత్తలు అవుతారు.

19) మూల నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
73) తస్కరాంశ:- మూల నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. తండ్రి సహాకారం లేనివాడు. వ్యాధిగ్రస్తులుగా ఉంటారు. ధరిద్రులు అవుతారు.
74) భోక్తాంశ:- మూల నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. మాతృసౌఖ్యం లేనివారు, దయామయులు, క్షీరాన్నం, బెల్లం పట్ల మక్కువ కలవారు. వాహన సౌఖ్యం కలవారు. భోగాలను అనుభవించేవారు.
75) విచక్షణాంశ:- మూల నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు ధనవంతులు, ఖర్చు పెట్టే మనస్తత్వం కలవారు. మంచి సంభాషణాపరులు, విద్యావంతులు, జ్యోతిష్య విద్య తెలిసిన వాళ్ళు, ఎదుటి వారు ఏది చెబితే వినగలరో అది చెప్పగలిగే సామర్ధ్యం ఉన్నవారు.
76) ధనాంశ:- మూల నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు ప్రభుత్వ ఉద్యోగులు, సేనాపతులు, పరోపకారులు, కామత్వం కలవారు, రోగ సూచనలు కలవారు, ఆడవారి కంఠ స్వరం కలవారు. మెత్తగా మాట్లాడేవారు, లౌకికం కలవారు అవుతారు.

20) పూర్వాషాడ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
77) ఉత్పన్నాంశ:- పూర్వాషాడ నక్షత్ర ప్రధమ పాదం రవిది. సౌఖ్యత లేనివారు, ఎర్రటి నేత్రాలు కలవారు, శక్తి సామర్ధ్యాలు కలవారు
78) అభయాంశ:-  పూర్వాషాడ నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. ఈ జాతకులు పెద్ద పొట్ట కలిగి ఉంటారు. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. మృదువుగానే మాట్లాడుతారు. అవతలి వ్యక్తులలోని సద్గుణాలను పసిగడతారు.
79) భాగ్యాంశ :- పూర్వాషాడ నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు నిత్యం శుచిగా ఉంటారు. దయా హృదయం కలిగి ఉంటారు. భాగ్యవంతులు, చపలచిత్తం కలవారుగా ఉంటారు.
80) ఉగ్రాంశ:- పూర్వాషాడ నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. పండితుల పట్ల ద్వేషం కలవారు. ఉగ్ర స్వభావం కలవారు. పాపకార్యాలు చేయువారు, అబద్ధాలాడటం వీళ్ళ స్వభావంగా ఉంటుంది.

21) ఉత్తరాషాడ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
81) ఉత్పన్నాంశ:- ఉత్తరాషాడ నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు బుద్ధిమంతులు. శాస్త్రవేత్తలు, స్ధిరాస్తులు కలవారు, పెద్దలయందు భక్తి కలవారు, ధర్మపాలన చేయువారు.
82) పాపాంశ:- ఉత్తరాషాడ నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు పనికి రాని పనులు చేయటంలో సిద్ధహస్తులు. ఇతర మతాలపట్ల ప్రేమాభిమానాలు కలవారు.
83) ఉగ్రాంశ:- ఉత్తరాషాడ నక్షత్ర తృతీయ పాదం శనిది. స్ధూలమైన శరీరం కలవారు. అల్ప సంతోషులు, నిత్యం వ్యాధిగ్రస్తులుగా ఉంటారు.
84) శోభనాంశ:- ఉత్తరాషాడ నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. శుభములు కలవారు, నిత్యం ఏదో ఒక పని చేసేవారు, శాస్త్ర విషయాలపై శ్రద్ధ కలవారు, వ్యాపార లక్షణాలు కలవారు, ఉత్సాహవంతులుగా ఉంటారు.

22) శ్రావణా నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
85) మంగళాంశ:- శ్రావణా నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. కలహ ప్రియులు, పుత్ర సంతానం లేనివారు, గుల్మరోగం కలవారు అవుతారు.
86) భోక్తాంశ:- శ్రావణా నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. సేవకులతో పని చేయించుకునేవారు. తంత్ర విద్యలపైనా ఆసక్తి కలవారు. కామత్వం కలవారు అవుతారు.
87) విచక్షణాంశ :- శ్రావణా నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు అత్యంత ఉదార స్వభావం కలవారు. చిత్రలేఖకులు, కలహప్రియులుగా ఉంటారు.
88) ధనాంశ:- శ్రవణా నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు పసు పోషకులు. యోగులు, ధార్మికులు అవుతారు. ముక్కు పొడవు కలిగి ఉంటారు.

23) ధనిష్ఠ నక్షత్ర నాలుగు పాదాలకు అంశగుణాలు
89) రాజాంశ :- ధనిష్ఠ నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు స్ధూలమైన శరీరం కలవారు. దానగుణం కలవారు. స్త్రీలపైన ప్రీతి కలవారు అగును.
90) సౌమ్యాంశ :- ధనిష్ఠ నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. వినయ విధేయతలతో మాట్లాడేవారు. ఉన్నత విద్యలు చదివేవారు అవుతారు.
91) అభయాంశ :- ధనిష్ఠ నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. గుణవంతులు అవుతారు. చిరాయుష్మంతులు అవుతారు. సత్య పలుకులు పలుకువారు అవుతారు.
92) క్రూరాంశ :- ధనిష్ఠ నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు నిత్యం పాప కర్మలు చేయుటలో లీనమై ఉంటారు. క్రూరమైన స్వభావం కలవారు. స్దూలమైన శరీరం కలవారు అవుతారు.

24) శతభిష నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
93) ఉత్పన్నాంశ :- శతభిష నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు గోవులను పూజించువారు. బ్రాహ్మణులపట్ల గౌరవం కలవారు. సత్యం మాట్లాడువారు. స్ధిరమైన బుద్ధి కలవారు, అభిమానవంతులు, స్నేహములను కలిగి ఉంటారు.
94) పాపాంశ :- శతభిష నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు పిరికితనం కలిగి ఉంటారు. ఏ పని తొందరగా చేయరు. పాపభీతి కలవారు అగుదురు.
95) భయాంశ:- శతభిష నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకులు పుత్ర సంతానం కలిగి ఉంటారు. పాండిత్యం కలవారు. మంధబుద్ధికలవారు. పాప కర్మలు చేయువారు. ఉగ్ర కర్మలు చేయువారు అగుదురు.
96) సౌమ్యాంశ:- శతభిష నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు స్నేహశీలురు, పండితులు, అభిమానవంతులు, యజ్ఞ కార్యాలు చేయువారు.

25) పూర్వాభాద్ర నక్షత్ర నాలుగు పాదాలకు అంశగుణాలు.
97) సేవాంశ:- పూర్వాభాద్ర నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. ఈ జాతకులు ఉద్యోగస్తులు, విష్ణు పూజ చేయువారు, భోగులుగా ఉంటారు.
98) భోగాంశ :- పూర్వాభాద్ర నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు సాహస వంతులు, మంత్రోపాసన చేయువారు, ప్రభుత్వ వ్యతిరేకులుగా ఉంటారు.
99) విచక్షణాంశ:- పూర్వాభాద్ర నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు పితృ ప్రియులు, సుఖవంతులుగా ఉంటారు. జ్ఞానవంతులు, భోగులుగా ఉంటారు.
100) ధనాంశ :- పూర్వాభాద్ర నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు స్త్రీలపైనా ఆసక్తి కలవారు, అందరి చేత కీర్తింపబడేవారు, ధనవంతులు, మాతృ సేవకులుగా ఉంటారు.

26) ఉత్తరాభాద్ర నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
101) తీక్షణాంశ:- ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు పైత్యా శరీరం కలవారు, చపల చిత్తం కలవారు, కోపిష్ఠులు, ఎర్రని నేత్రాలు కలవారు, కృశించిన శరీరం కలవారుగా ఉంటారు.
102) అభయాంశ :- ఉత్తరాభాద్ర నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. ఇజాతకులు జ్యోతిష శాస్త్ర పండితులుగా గాని, పంచాంగ కర్తలుగా గాని ఉంటారు. జ్ఞాన వంతులు, సౌమ్యమైన గుణం కలవారు, అవతలి వాళ్ళలోని గుణాలను గ్రహించగలిగే సామర్ధ్యం కలవారు అవుతారు.
103) అభయాంశ :- ఉత్తరాభాద్ర నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు తెలివితేటలు కలవారు, శాస్త్రవేత్తలు, ధనవంతులు అవుతారు.
104) దీనాంశ:- ఉత్తరాభాద్ర నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు చెడు స్నేహాలు కలవారు, శత్రువులు కలవారు, ధనం సంపాదించువారు అవుతారు.

27) రేవతి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
105) ఉత్పన్నాంశ :- రేవతీ నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు శాస్త్రాలపైనా పట్టు గలవారు, నీటి నియమాలు కలవారు, తాత్వికులు అగుదురు.
106) పాపాంశ:- రేవతి నక్షత్ర ద్వితీయ పాదం శనిది. పాప కర్మలు చేసేవారు, జూదం ఆడేవారు, కుటిలమైన బుద్ధి కలవారు అగుదురు.
107) ఉగ్రాంశ:- రేవతి నక్షత్ర తృతీయ పాదం శనిది. మంధ బుద్ధి కలవారు, సౌందర్యవంతులు, కోప స్వభావం కలవారు అగుదురు.
108) శోభనాంశ :- రేవతి నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు యజ్ఞ యాగాదులు చేయువారు, ధైవ కార్యాలు చే
యువారు, పండితులు, వేదాంతులు, ధైర్యవంతులు అవుతారు..

Monday, February 4, 2019

Pithru Sthuthi (Bruhad Dharma Puranam)

Translated by
P.R.Ramachander

( Hindus believe that our dead ancestors live as manes in Pithruloka. It is responsibility of their descendents to offer them food and water ithe form of Annual Sradha and monthly tharpanas. It is believed that manes curse their descendents who do not offer them these. And This stotra addressed to our manes in Devanagari.
It is recommended that it is chanted daily and if not possible on Sradha and Tharpana days.)

Brahmo uvacha:-
1.Om nama pithre,janma dhathre, sarva deva mayaya cha,
Shukhadhaya prasannaya supreethaaya Mahathmane.

Brahma said:-
1.Om salutations to the manes, who gave me birth and who are filled with all devas,
And who bless us with pleasure, who are happy and are great ones liked by good people.

2.Sarva Yajna swaroopaaya,swargeeya parameshtine,
Sarva theerthavalokaya, karuna sagaraya cha.

Oh manes of the form of all yajnas, who are the gods in heaven,
Who are the form of all sacred waters as well as oceans of mercy.

3.Nama sadaa asuthoshaya,Shiva roopaya they nama,
Sadaa aparadha kshamine, sukhaya sukhadhaya cha.

Salutations always to them who are easily pleased, Salutations to them in the form of Shiva,
To those who always pardon our mistakes, who are pleasant and bless us with pleasure.

4.Durlabham manushamidham yena labhdham mayaa vapu,
Sambhavaneeyam dharmarthe, thasmai pithre namo nama.

The human birth is difficult to get, and through you I have got it,
For performing of Dharmas and so my salutations to you manes.

5.Theertha snana thapo japadhi yasya darasanam,
Maha gurescha gurave thasmai pithre namo nama.

Having taken bath in sacred waters, done penance and meditation, I have been able to see you,
Oh teacher of all teachers, because of that I salute you oh manes.

6.Yasya pranama stavanath koteesa pithru tharpanam,
Aswamedha sathai sthulyam, thasmai pithre namo nama.

AS per your words alternative of praying to you is performing of tharpana ,
And It is equivalent to one hundred Aswamedha, because of that I salute you.

Phala sruthi
Hearing of usefulness

1.Idham stotram pithru punyam ya padeth prayatho nara,
Prathyaham pratharuthaya, pithru sradha dhinopi cha

Man should try to chant this blessed prayer addressed to the manes,
Daily as soon as he gets up and also on the Sradha days of the manes.

2.Swajanma divase sakshath pithuragre sthithopi vaa,
Na thasya durlabham kinchith sarvajnathadhi vanchitham

Chanting it on our own birthday or standing near one’s own father,
Is something difficult to get but is desired even by the all knowing ones.

3.Naanaa apakarma kruthwabhi ya sthouthi pitharam sutha,
Sa dhruvam pravidhayaiva prayaschitham sukhee bhavedh,
Pithru preethikaroi nithyam sarvakarmaanyadharhathi.

Even though works not according to Dharma are done by people ,
If they pray their manes with devotion,
They would become dear to the manes and would merit all sort of honours.

Ithi bruhadh dharma purane pithru stotram sampoornam.
Thus ends the prayer to the manes occurring in the Great Dharma Purana.

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...