Saturday, April 30, 2016

India PMs

This is a recent article that appeared in one of the Whatsapp forwards. Pasting the image here:

Add caption

'గోత్రము' అంటే ??

 'గో' అంటే గోవులు, 'త్ర' అంటే రక్షించుట .  గోత్రము అంటే గోవులను రక్షించువారు అని అర్ధము. సముద్రమధనంలో 5 గోవులు కామధేనువు  రూపంలో అవతరించాయి. ఒక్కొక్క గోవును ఒక్కొక్క మహర్షి తీసుకెళ్ళి పెంచి వాటిని , వాటి సంతతిని కాపాడుతూ వృద్ది చేసి యితర మహర్షుల ద్వారా సమాజములోని అందరికీ వాటిని అందజేశారు.  గోవులను కాపాడిన ఆయా ఋషుల పేర్లతో మనకు గోత్రాలు ఏర్పడినాయి. హిందువులందరికీ అంటే అన్ని వర్ణములవారికి గోత్రాలు ఉంటాయి. అంటే అందరూ గోవులను రక్షించేవారేనని అర్ధము.

పురాణాల్లో వ్యక్తుల పేర్లు.. అర్ధాలు

🔴అనసూయ - అసూయ లేనిది
🔵అర్జునుడు - స్వచ్చమైన చాయ కలవాడు
🔴అశ్వత్థామ - గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు.
🔵ఆంజనేయుడు - 'అంజన'కు పుట్టినవాడు.
🔴ఇంద్రజిత్తు - ఇంద్రుని జయించినవాడు (జితమంగా విజయము)
🔵ఊర్వశి - నారాయణుడి ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది.
🔴కర్ణుడు - పుట్టుకతో 'కర్ణ'కుండలాలు కలవాడు.
🔵కుంభకర్ణుడు - ఏనుగు యొక్క 'కుంభస్థల' ప్రమాణముగల కర్ణములు (చెవులు) కలవాడు.
🔴కుచేలుడు - చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రము).
🔵కుబేరుడు - నికృష్టమైన శరీరము కలవాడు (బేరమనగా శరీరము).
🔴గంగ - గమన శీలము కలది .భగీరధునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది కనుక భాగీరధి అని, జహ్నుమునికి పుత్రికగా ప్రసిద్ధి నొందినది కనుక జాహ్నవి అని గంగకు పేర్లు కలవు.
🔵గరుత్మంతుడు - విశిష్టమైన రెక్కలు కలవాడు
🔴ఘటోత్కచుడు - కుండవలె గుబురైన జుట్టు కలవాడు (ఘటమనగా కుండ)
🔵జరాసంధుడు - 'జర' అను రాక్షసి చేత శరీర భాగాలు సంధింపబడిన (అతికింపబడిన) వాడు.
🔴తుంబురుడు - తుంబుర (వాద్య విశేషము) కలవాడు
దశరధుడు - దశ (పది) దిశలలో రధ గమనము కలవాడు.
🔵ధృతరాష్ట్రుడు - రాష్ట్రమునంతటినీ అదుపులో ఉంచుకొనువాడు.
🔴త్రిశంకుడు - 1. తండ్రిని ఎదిరించుట 2, పరభార్యను అపహరించుట 3. గోమాంసము తినుట అను మూడు
శంకువులు(పాపాలు) చేసినవాడు.
🔵దమయంతి - 1. 'దమనుడు' అను ముని వరము వలన జన్మించినది. 2. తన అందముచే ఇతరులను దమించునది.(అణచునది).
🔴దుర్వాసుడు - దుష్టమైన వస్త్రము కలవాడు. (వాసమనగా వస్త్రము)
🔵దుర్యోధనుడు - (దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు.
🔴దుశ్శాసనుడు - సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు.
🔵ద్రోణుడు - ద్రోణము(కుండ)నుండి పుట్టినవాడు.
🔴ధర్మరాజు - సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును
ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి.
🔵నారదుడు - 1.జ్ఞానమును ఇచ్చువాడు (నారమనగా జ్ఞానము) 2. కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు.
🔴ప్రద్యుమ్నుడు - ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు (ధ్యుమ్నము :బలము)
🔵ప్రభావతి - ప్రభ (వెలుగు)కలది.
🔴ప్రహ్లాదుడు - భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు
🔵బలరాముడు - బలముచే జనులను రమింపచేయువాడు.
🔴బృహస్పతి - బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు (బృహస్పతి)
🔵భరతుడు - అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు.
🔴భీముడు - భయమును కలిగించువాడు
🔵భీష్ముడు - తండ్రి సుఖము కొరకై తను రాజ్య సుఖములను వదులుకోవడమే కాక వివాహం చేసుకోను అని భీష్మమైన
(భయంకరమైన) ప్రతిజ్ఞ చేసినవాడు.
🔴మండోదరి - పలుచని ఉదరము కలది (మండ-పలుచని)
🔵మన్మధుడు - మనస్సు కలత పెట్టువాడు.
🔴మహిషాసురుడు 1. రంభుడు మహిషంతో (గేదే) రమించగా పుట్టినవాడు
2. 'మహిష్మతి' అనే ఆమె శాపం వలన మహిషమై(గేదె) ఉండి సింధు ధ్వీపుడనే రాజు రేతస్సును మింగి గర్భాన్నిధరించి ఇతనికి జన్మనిస్తుంది.
🔵యముడు - యమము (లయ)నుపొందించువాడు.
యశోద యశస్సును (కీర్తి) కలిగించునది.
🔴రాముడు - రమంతే యోగినః అస్మెన్ = రామ(రమ్ -క్రీడించుట)
యోగులందరూ ఈ పరమాత్మునియందు విహరించెదరు/ఆనందించెదరు.
🔵రావణాసురుడు - కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని)
చేసినవాడు
🔴రుక్మిణి - రుక్మము(బంగారము) కలది
🔵వాల్మీకి -ఆయన నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు (పుట్టలు) మొలచుటవలన వాల్మీకి
అయ్యాడు.
🔴వ్యాసుడు -వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు.
🔵విదురుడు - బుద్ధిమంతుడు , తెలివిగలవాడు
విభీషణుడు - దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు
🔴శంతనుడు - శం = సుఖము/శుభము తను = విస్తరింపజేయుట , సుఖమును, శుభమును విస్తరింపజేయువాడు
ములుకులతో(బాణములతో) బాధించువాడు (శల్యమంగా బాణము)
🔵శకుంతల - శకుంతలములచే (పక్షులచే) రక్షింపబడినది.
🔴శూర్పణఖ - చేటల వంటి గోరులుకలది (శూర్పమనగా చేట, నఖ మనగా గోరు)
🔵సగరుడు - విషముతో పుట్టినవాడు (గర/గరళ శబ్దాలకు విషమని అర్ధము) (గర్భములో ఉండగా విష ప్రయోగానికిగురై ఆ విషంతోనే పుట్టినవాడు)
🔴సత్యభామ - నిజమైన కోపము కలది ( భామ - క్రోధే)
🔵సీత - నాగటి చాలు (జనక చక్రవర్తి భూమి దున్నుతుండగా నాగటి చాలులో దొరికిన శివు కనుక సీత అయినద

హనుమాన్ చాలీసా మహాత్మ్యం

ఉత్తరభారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన 'రామచరితమానస' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.

ఇదిలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి 'దీర్ఘసుమంగళిభవః' అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు! అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.

ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామ భక్తులుగా మరేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది.

పాదుషా :- తులసీదాస్ జీ ! మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట !

తులసీదాస్ :- అవును ప్రభూ ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు ! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?

పాదుషా :- అలాగా ! రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు. నిజమేనా?

తులసీదాస్ :- అవును ప్రభూ ! రామనామానికి మించినదేమీ లేదు.

పాదుషా:- సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము. 

తులసీదాస్ :- క్షమించండి ప్రభూ ! ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవమాత్రులు మార్చలేరు.

పాదుషా :- తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి.

తులసీదాస్ :- క్షమించండి ! నేను చెప్పేది నిజం ! 

పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, 'తులసీ ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!' అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే ! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.

ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు 'తులసీ ! నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏమికావాలో కోరుకో!' అన్నాడు. అందుకు తులసీదాస్ 'తండ్రీ! నాకేమి కావాలి ! నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మచరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ!' అని కోరుకున్నాడు. 

ఆ మాటలతో మరింతప్రీతి చెందిన హనుమంతుడు 'తులసీ! ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమే వహిస్తాము' అని వాగ్దానం చేశారు. అప్పట్నుండి ఇప్పటివరకు 'హనుమాన్ చాలీసా' కామదేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.

అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక 'హనుమాన్ చాలీసా'. దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతిఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది...... 

జై శ్రీ రాం

ఆయుర్వేదం నీటిని ఎలా త్రాగాలి అనేది చెప్పింది.............!!!

ఈ మధ్యకాలంలో జపాన్ వారు 200కోట్ల డాలర్ల ఖర్చుతో ఒక పరిశోధన నిర్వహించారు. ఆ పరిశోధన నిరూపించిన విషయమేమిటంటే ఉదయాన్నే నిద్ర లేవడంతోనే పళ్ళుతోముకోకుండా ఒక లీటరు నీరు త్రాగడం వలన శరీరంలోని మలినాలన్నీ పోతాయి అని.
నేటికి కొన్ని వందల సంవత్సరాల క్రితం వాగ్భటుడనే ఆయుర్వేద శాస్త్రవేత్త ఈ విషయాన్ని మనకు ఒక్క రూపాయి కూడా ఖర్చుకాకుండా చెప్పాడు.

దాన్ని ఉషఃపానం అనే పేరుతో పిలుస్తారు. నీళ్ళు ఎలా త్రాగాలో ఇప్పుడు చూద్దాం.

రాత్రిపూట ఒక రాగి చెంబులో నీళ్ళు పోసి మూత పెట్టి ఉంచుకోవాలి. ఉదయాన్నే నిద్ర లేవడం తోనే ఆ లీటరు నీళ్ళు త్రాగాలి. ఈవిషయం అందరూ చెబుతారు కానీ ఇక్కడ ఒక్క నియమం పాటించాలి.

ఎప్పుడూ ఒక్క విషయం గుర్తుంచుకోండి. నీళ్ళు ఎప్పుడూ కూర్చునే త్రాగాలి, పాలు, టీ, కాఫీ ఎప్పుడూ నిలబడే త్రాగాలి. అంతేకాదు నీళ్ళు గడ గడా త్రాగకూడదు. క్రిందకూర్చుని కొంచెం కొంచెంగా(సిప్ చేస్తూ) టీ త్రాగినట్టు, కాఫీ త్రాగినట్టు త్రాగాలి. అంతేకానీ నీళ్ళు ఒక్కసారిగా గ్లాసు ఎత్తి పట్టుకుని గడ గడా త్రాగకూడదు. ఇదీ నీళ్ళు త్రాగే విషయంలో పాటించాల్సిన ఖచ్చితమైన విషయం.

మరోవిషయం, నీళ్ళు ఎన్నిత్రాగాలి...

అందరూ ఏం చెబుతున్నారంటే, రోజూ ఖచ్చితంగా 5 లీటర్ల నీరు త్రాగాలి అని . ఇది చాలా అసంబద్దమైన విషయం. మన బరువును 10తో భాగించి దానిలో నుండి రెండు తీసివేస్తే ఎంత అంకె వస్తుందో అన్ని లీటర్లు త్రాగాలి.

ఉదాహరణకు మీరు 60 కిలోలు ఉన్నారనుకుంటే, 60 ని 10 తో భాగిస్తే 6, దీనిలో 2 తీసివేస్తే 4. అంటే నాలుగు లీటర్ల నీరు రోజూ త్రాగాలి.

మరో విషయం ఆహారం తీసుకునే ఒక గంట ముందు లేదా ఒక గంట తరువాత మాత్రమే నీరు త్రాగాలి. "భోజనాంతే విషం వారి". అనేది సూత్రం.

అంటే భోజనం తరువాత నీరు త్రాగండం విషంతో సమానం అని. కొద్దిగా గొంతు తడుపుకోవడానికి, తిన్నతరువాత రెండు లేదా మూడు గుటకల నీరు త్రాగవచ్చు. నీటి విషయంలో ఈ నియమాన్ని పాటిస్తే మలబద్దకం, గ్యాస్ మొదలైన ఉదర సంబంధరోగాలకు దూరంగా ఉండవచ్చు.

మంచినీళ్ళకు మట్టి కుండలు వాడండి

భరద్వాజ మహర్షి : వైమానిక శాస్త్రం

భరద్వాజ మహర్షి రాసిన 'యంత్రసర్వస్వము' అనే ఉద్గ్రంథములోని 40వ అధికరణమైన 'వైమానిక ప్రకరణము' లో ఆనాటి పనిముట్లు, యంత్రముల చిత్రాలే కాక విమాన డిజైన్ లు కూడా పొందుపరిచారు. దాదాపు 600 పేజీలతో వైమానిక శాస్త్రము రూపుదాల్చింది. ఇది తొలి వైజ్ఞానిక గ్రంథము.

భరద్వాజ మహర్షి పేర్కొన్న వైమానికశాస్త్రంలో యంత్రాలు, పరికరాలు, లోహాల వినియోగం, వాటి నిర్వహణపై పరిశోధనలు జరిపి, తెలుగులో గ్రంథంగా రూపొందించారు డాక్టర్ ఆమంచి బాలసుధాకరశాస్త్రి. అందులో పైలట్ తెలుసుకోవలసిన 32 రహస్యాల గురించి వివరించారు. పైలెట్స్ తీసుకోవలసిన శిక్షణ ఎలా ఉండాలనేది కూడా భరద్వాజ మహర్షి చెప్పారు.

విమానంలో ముఖ్యమైన 32 భాగాల గురించి, ఆ యంత్రాల పనితీరు గురించి విపులంగా చెప్పారు. ఇది నేటి టెక్నాలజీ కంటే చాలా అధునాతనమైనదని, ఇప్పుడు విమానంలో తీసుకుంటున్న న్యూట్రిషియన్ టాబ్లెట్స్ వంటివి ఆ కాలంలోనే ఉన్నయని భరద్వాజ మహర్షి చెప్పిన దాని బట్టి తెలుస్తోంది.

వంద శతఘ్నులు పేల్చినా దెబ్బతినని లోహాన్ని ఆనాటి విమానాల తయారీకి వాడేవారు. మెరుపులలో నుంచి ఎనర్జీ తీసుకోవచ్చని వైమానిక శాస్త్రంలో చేర్చబడింది. నేల మీద, నీటిమీద, ఆకాశంలో సంచరించగలిగే త్రిపుర విమానం గురించి కూడా పేర్కొన్నారు.

ఈనాటి ఏరోనాటిక్స్ లో ఉన్న యంత్ర సర్వస్వమంతా వైమానికశాస్త్ర గ్రంథంలో ఉంది. విమానసిబ్బంది ఎటువంటి వస్త్రాలను ధరించాలో వివరించారు. ఆహారాధికరణంలో ఎటువంటి ఆహారాన్ని స్వీకరించాలి, లోహాధికరణంలో విమానాల తయారీలో ఉపయోగించే వివిధ రకాల లోహాలు, అద్దాలు, లెన్స్ లు, పవర్ జనరేషన్ ఎట్లా చేయాలి వంటి అనేక అంశాలు స్పష్టంగా భరద్వాజ మహర్షి తెలియచేశారు.

ఈ మధ్యకాలంలో ఎన్నో సంస్థలు, ఎందరో వ్యక్తులు వేదవిజ్ఞాన పరిశోధనా ప్రయత్నాలు ప్రారంభించి మధ్యలోనే ఆగిపోతున్నారు. తగిన ఆధార గ్రంథాలు లేకపోవడం, వసతుల కొరత, ప్రభుత్వాలకు, అధికారులకు ఇవేమి పట్టకపోవటం, పండితుల మధ్య సమన్వయం కొరవడడం దీనికి కారణం. ఎంతోకాలాన్నీ, కోట్లరూపాయల ధనాన్నీ, ఆధునిక పరిశోధనలకి వెచ్చిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందులో వెయ్యోవంతు ప్రయత్నం ఇందుకోసం వెచ్చిస్తే మానవాళికి పనికొచ్చే ఎన్నో ఆవిష్కరణలు, నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో దుష్పరిమాణాలకి పరిష్కారాలు దొరకకపోవు.

వేదమనగా మతం కాదని, అది ఒక అద్భుతవిజ్ఞాన భాండాగారమని, విశ్వమానవ జీవనశైలి అని గుర్తించిన ప్రపంచ దేశాలన్నీ వేద విజ్ఞాన పరిశోధనా ఫలములను అందిపుచ్చుకోవడంలో చాలా ముందుకు వెళుతుండగా, వేదాలకు పుట్టినిల్లయిన భారతదేశంలో ఈ పరిస్థితులు ఉండడాన్ని 'ఫ్రాంటెయర్ గాటెయర్' అనే అమెరికన్ 'ఓ భారతదేశమా రోదించు!' అనే వ్యాసంలో పేర్కొన్నారు.

భారతీయ విజ్ఞాన వాఙ్మయ సంపదంతా జర్మనీలో ఉంది. అలాగే బ్రిటీషువారు వెళుతూ వారి భావాల్ని వారి విద్యావిధానాన్ని (మెకాలే), వారి జీవనశైలిని, భారతీయులకిచ్చి, భారతీయ వైజ్ఞానిక గ్రంథ సంపదని వారు తీసుకొని పోయి బ్రిటీషు లైబ్రరీలో భద్రపరిచారు. జర్మనీ తరువాత గ్రంథాల చిరునామా బ్రిటీష్ లైబ్రరీనే.

1920 ప్రాంతంలో జర్మనీలో పుట్టిన ప్రతి జర్మన్ విధిగా సంస్కృతాన్ని అభ్యసించాలని ప్రభుత్వం శాసనం చేసింది. 1927వ సంవత్సరంలో వేదవాఙ్మయ కేటలాగ్ జర్మనీలో ప్రింట్ అయింది. వైమానిక శాస్త్రం ఒక నిర్దిష్టమైన ఇంజనీరింగ్ టెక్ట్స్ బుక్, 8 అధ్యాయాలలో 100 అధికరణాలలో 500 సూత్రాలతో "విమాన నిర్మాణము”ను సమగ్రంగా అందించిన ఒక అద్భుత ప్రాచీన వైజ్ఞానిక సత్యం.
ఊహలే తప్ప ఆధారాలు లేవనే వాదానికి ఇక స్వస్తి పలకవచ్చు.

విజ్ఞులు ఆలోచించెదరు గాక

Bhagawad Gita in one sentence of each Adhaya - Chapter wise.

Chapter 1 : 
Wrong thinking is the only problem in life

Chapter 2 : 
Right knowledge is the ultimate solution to all our problems

Chapter 3 : 
Selflessness is the only way to progress and prosperity

Chapter 4 :
Every act can be an act of prayer

Chapter 5 : 
Renounce the ego of individuality and Rejoice in the Bliss of Infinity

Chapter 6 : 
Connect to the Higher Consciousness Daily

Chapter 7 : 
Live what you learn

Chapter 8 : 
Never give up on yourself

Chapter 9 :
Value your blessings

Chapter 10 : 
See divinity all around

Chapter 11 : 
Have enough surrender to see the Truth as it is

Chapter 12 :
Absorb your mind in the Higher

Chapter 13 : 
Detach from Maya and Attach to Divine

Chapter 14 : 
Live a lifestyle that matches your vision

Chapter 15 :
Give priority to Divinity

Chapter 16 : 
Being good is a reward in itself

Chapter 17 :
Choosing the right over the pleasant is a sign of power

Chapter 18 : 
Let Go, Lets move to Union with God

Ved Vyasa is the author of Bhagavathgita, is also said to be incarnation of Lord Sri Maha Vishnu.

Chidambara Rahasyam (The Secret)

After 8 years of R & D, Western scientists have proved that at Lord Nataraja's big toe is the Centre Point of World 's Magnetic Equator. 

Our ancient Tamil Scholar Thirumoolar has proved this Five thousand years ago! His treatise
Thirumandiram is a wonderful Scientific guide for the whole world. To understand his studies, it may need a 100 years for us.

Chidambaram temple embodies the following  characteristics :

1)  This temple is located at the Center Point of world's Magnetic Equator.

2) Of the "Pancha bootha" i.e. 5 temples, Chidambaram denotes the Skies. Kalahasthi denotes Wind.  Kanchi Ekambareswar denotes land.  All these 3 temples are located in a straight line at 79 degrees 41 minutes Longitude. This can be verified using Google.  An amazing fact and astronomical miracle!!

3)  Chidambaram temple is based on the Human Body having 9 Entrances denoting 9 Entrances or Openings of the body.

4) Temple roof is made of 21600 gold sheets which denotes the 21600 breaths taken by a human being every day (15 x 60 x 24 = 21600)

5) These 21600 gold sheets are fixed on the Gopuram using 72000 gold nails which denote the total no. of Nadis (Nerves) in the human body. These transfer energy to certain body parts that are invisible.

6)  Thirumoolar states that man represents the shape of Shivalingam, which represents Chidambaram which represents Sadashivam which represents HIS dance !

7) "Ponnambalam" is placed slightly tilted towards the left.  This represents our Heart.  To reach this, we need to climb 5 steps called "Panchakshara padi" - "Si, Va, Ya, Na, Ma " are the 5 Panchakshara mantras. 

There are 4 pillars holding the Kanagasabha representing the 4 Vedas.

8)  Ponnambalam has 28 pillars denoting the 28 "Ahamas" as well as the 28 methods to worship Lord Shiva. These 28 pillars support 64 + 64 Roof Beams which denote the 64 Arts.  The cross beams represent the Blood Vessels running across the Human body. 

9)  9 Kalasas on the Golden Roof represent the 9 types of Sakthi or Energies. 

The 6 pillars at the Artha Mantapa represent the 6 types of Sashtras.  

The 18 pillars in the adjacant Mantapa represents 18 Puranams.

10) The dance of Lord Nataraja is described as Cosmic Dance by Western Scientists.  

Whatever Science is propounding now has been stated by Hinduism thousands of years ago !
Hinduism is not just religion. Its a way of living....

మరణం తరువాత ఏమిటి ?

మనం మనకు ఈ స్తూల శరీరం ఉన్నంతవరకు దాని గురించి పెద్దగా ఆలోచించము. ఎవరైనా చనిపోతే అప్పుడు నేను ఇంక బతికే ఉంటాను అని అనుకొని ఊరికే ఉండిపోతాము. ఇంకా కొందరు అయితే ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అని మరికొందరు స్వర్గానికో లేక
నరకానికో తీసుకొని వెళ్లి ఉంటారని ఇలా ఎన్నో ఊహాగానాలు.

కాని నిజంగా ఏమో మాత్రం ఎవరికీ తెలియదు. ఈ మరణం తరువాత ఏమిటి అన్న సందేహానికి
జవాబుకఠోరఉపనిషత్తు లో తెలుపబడింది. నచికేతుడు యమధర్మరాజును మూడు వరాలు అడుగుతాడు అందులో ఒకటి మరణం తరువాత ఏమి జరుగుతుంది.  అప్పుడు యమధర్మరాజు నచికేత ఇది చాల సూక్ష్మమైన విషయం. ఇది కాక ఏదైనా వేరే వరం కోరుకోమని అంటాడు. కాని నచికేతుడు పట్టుబడుతాడు.నాకు మృత్యువు తరువాత ఏమి జరుగుతుందో నీ ద్వారానే తెలుసుకోవాలి అని అంటాడు. అప్పుడు యమధర్మరాజు, ఓ నచికేత నీకు సనాతనము అయిన బ్రహ్మాన్ని గురించి మరియు చనిపోయిన  తరువాత ఆత్మ ఏమవుతుందో కూడా చెబుతాను.  

ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

యమధర్మరాజు చెప్పినట్లు ఇది నిజంగా చాల సూక్ష్మమైన విషయం. మనిషి పుట్టినప్పటినుంది
ఏవేవో పనులు చేస్తూ కాలాన్ని వెళ్ళదీస్తూ వుంటాడు. అయితే తను ఏమి సాధించాలి నేను ఎందుకు పుట్టాను అని మాత్రం ఆలోచించడు. ఎదో మంచి జీవితం మంచి భార్యా తరువాత పిల్లలు వీటితోనే సతమతమవుతూ తాను ఎందుకు పుట్టానో కూడ తెలుసుకునేంత సమయం లేదు. కాని ఎదో ఒక రోజు నువ్వు కాదన్న ఎవరు కాదన్న మరణం మాత్రం నీ వెనకే వుంటుంది,

అది ప్రతి ఒక్కరి జీవితంలో సంభవిస్తుంది. దీనిని కూడ మనం గమనించే పరిస్తితులలో ఉండము. మరణం తరువాత ఏమి జరుగదు. నువ్వు నీ తల్లి  కడుపులో నుండి వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్న నీ పాపపుణ్యాలను సమూలంగా నిర్ములించుకొని వుంటే నీవు (అంటే ఆత్మ)
పరమాత్మునిలో అంటే పరమాత్ముని సాగరంలో విలీనం అవుతావు లేకపోతే నీ కర్మల అనుసారంగా నీవు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి, సత్కర్మలు (మంచి పనులు) చేసి వుంటే స్వర్గానికి లేక దుష్కర్మలు (చెడ్డపనులు) చేసి వుంటే నరకానికి వెళతావు. దీనిని ఎవరు ఆపలేరు.

ఒకవేళ నువ్వు ఈ శరీరంతో ఉన్నప్పుడు భగవంతుని జ్ఞానాన్ని గ్రహించి ఉంటే కొద్దిగలో కొద్దిగా తెలుసుకొని వుంటే నీకు మరల మనిషి జన్మ వస్తుంది అది ఒక మంచి యోగుల కుటుంబంలో.ఇందులో ఎటువంటి సందేహం అవసరంలేదు. ఇది స్వయంగా శ్రీకృష్ణుడు అర్జునకు వివరించాడు. అట్లా కాక సంపూర్ణంగా జ్ఞానాన్ని గ్రహించి మనస్సును బుద్దిని అదుపులో వుంచుకొని యోగాన్ని అవలంబించి అన్ని కర్మలను తొలగించుకొని నువ్వు విముక్తడవు అయి వుంటే మాత్రం నువ్వు (ఆత్మ) ఆ పరంధామునిలో ఐక్యం అవుతావు.ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. కాని మనకు తెలియదు మన కర్మలు అన్నియు అయిపోయినయో లేదో. కావున మనం మన ఈ స్తూల శరీరంను ధరించి ఉండగానే ఎటువంటి సందేహం లేకుండా ముక్తిని పొందే ఒక సదవకాశం వుంది. ఆ విధంగా మనం శరీరంతో ఉండగానే మనకు మరల
జన్మలు రావు అని మనం నిశ్చింతగా ఉండాలంటే దానికి మనం చేయవలసిన పని సాధన(ధ్యానం) చేసి ఆ భగవంతునిని ఈ శరీర హృదయంలో సాక్షాత్కరించుకోవడమే. ఇది చేస్తే మనకు ఇంకా ఎటువంటి సందేహాలు వుండవు. 

అప్పుడు నీకు తెలియని విషయము అంటూ ఈ లోకంలో ఏది ఉండదు. అంటే అప్పుడు నీవు ఎవరు, దేవుడు ఎవరు, ఈ ప్రకృతి ఏంటి, అసలు ఇంతగా మభ్య పెడుతున్న ఈ మనస్సు ఏమిటి అన్న ప్రతి సందేహం తీరిపోతుంది. అప్పుడు తెలుస్తుంది మనస్సు అనేదే లేదు, మనస్సు అనేదే ఒక భ్రమ అని . 

అది తెలుసుకోవాలంటే మనం అందరం చేయవలసిన పని ఆ బ్రహ్మాండ కోటి నాయకుడైన ఆ వాసుదేవున్ని (పరమాత్మను) మన హృదయంలో దర్శించుకోవడమే. ఈ విధంగా మరణించిన తరువాత వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుసరించి వారికీ మరల యేయే జన్మలు అనేది వారి మీదనే ఆధారపడి వుంటుంది. కొన్ని జీవాత్మలు శరీరం కోసం గర్భంలో ప్రవేసిస్తాయి. అసలు మనిషి జీవిత లక్ష్యమే భగవంతునిని పొందడం అంటే జ్ఞానాన్ని గ్రహించి అతని తత్వాన్ని అందరికి తెలియపరచి ఆయనను నిరంతరం భక్తి శ్రద్దలతో స్మరిస్తూ ఆ దేవదేవునిని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే మనిషి పుట్టుక యొక్క లక్ష్యం. ఇదియే గమ్యం ఇదియే శాశ్వతం. 

అసలు మనం పుట్టింది కూడ ఇందుకే.

Holy Cow !!

🐄Cow is just an animal like a
 hen or goat... then why is it revered and why one should not kill and eat it?”

🐄Cow is also an animal, but... a cow has many specialities that no other animal (not even human beings) has in this world.

This is the reason that Hindus consider cow as ‘mother’ after their own mother, and pray to the cow with respect calling it “go-matha”.

These are some truths about go-matha.🐄

·🐄  If a cow eats something poisonous by mistake, and we drink its milk, will we fall ill? To find out, one cow was regularly fed a particular quantity of a poison every day. 

After 24 hours, its blood, urine, dung and milk were tested in a lab to check where the poison could be found. In this way, the tests were done not for 1 or 2 days, but continuously for 90 days in All India Institute of Medical Sciences (AIIMS) New Delhi. The researcher did not find any trace of poison in milk, blood, urine or dung of that cow.🐄

Then where did this poison fed for 90 days go? Just like Lord Shiva held poison in his throat, the go-matha hid the entire poison in her throat. This is a special quality that no other animal has.🐄

·🐄  This is the only creature that inhales oxygen and also exhales oxygen.

·🐄 Cow milk has the quality of countering poison.

·  There are diseases that medical science has not yet understood; urine of Go-matha has the power to cure them.🐄

·🐄 If cow-ghee and rice are cooked together, two powerful gases called ethylene-oxide, propylene-oxide are released. Propylene-oxide is the best gas used for creating artificial rain.

·🐄  Cow-urine is the world’s best killer of microbes

· 🐄With medicines  made using cow dung and cow urine, stomach-related ailments can be cured.  

·🐄 We can save ourselves from radio-waves by plastering the home floors and area outside home with cow-dung.

·🐄 Cow-dung has the power to destroy the microbes causing cholera.

· If 10 grams of cow-ghee is put in fire (yagnya), 1 ton of oxygen is generated.🐄

Planets and their Mantras

Aries:
If you have been born under the above mentioned zodiac, then your ruling planets are Mars (for Aries and Scorpio) and Saturn (for Capricorn and Aquarius); the ruling God for all four  of you is Lord Shiva.

Mantra 1
“Vande Sambhu Mumapathim Suargurum, Vande Jagathkaaranam, Vande Pannaga Bhushanam Mriga Dharam, Vande Pasoonaam Patheem, Vande Surya Sasaanka Vahni Nayanam, Vande Mukunda Priyam,  Vande Bhaktha Janaarasrayancha Varadam, Vande Sivam Sankaram”

To calm the effect of Mars:
“Dharanee Garbha Sambhootham, Vidyuth Kanthi Sama Prabham, Kumaram Sakthi Hastham, Tham Mangalam Pranamaamyaham”

For calming the effects of Saturn:
“Neelaanjana Samaa Bhaasam, Ravi Putram Yamaagrajam, Chaya Maarthaanda Sambhootham Tam Namami Sanaischaram”


Taurus and Libra:
If according to your birth star, you are born in Taurus and Libra zodiacs, then your ruling planet is Venus and the ruling Goddess is Sri Mahalakshmi.
Mantra 2
“Lakshmeen ksheera samudra raaja tanayaam, Sree ranga dhaameshvareem, Daasi bhootha samastha Deva vanithaam lokaika deepankuram, Sreeman mandha kataaksha labdha vibhavath brahmendra gangaa dharaam, Tvaam trailokya kutumbhineem, Sarasijaam vande mukunda priyaam”

To calm the effects of Venus
“Himakundha Mrinaalaabham, Daithyaanaam Paramam Guroom, Sarva Sasthra Pravakthaaram, Bhargavam Pranamamyaham”


Gemini and Virgo:
Those born under signs Gemini and Virgo, have their ruling planet as Mercury and their ruling God is Lord Srimannarayan.

Mantra 3
All you need is to recite this simple shloka, nine times a day. “Om Namo Venkatesaaya Kaamitaartha Pradhaayine Pranatah Klesa Naasaaya Govindaaya Namo Namaha”

To calm the effect of Mercury:
“Priyangukalikaa Syamam, Rupenaa Prathimam Budham, Soumyam Satva Gunopetham, Tham Budham Pranamaamyaham”


Cancer:
Those born under the zodiac signs, Cancer, have Moon as their ruling planet, and Goddess Parvati/Gauri as their ruling Lord. She’s the epitome of kindness, and calm; hence one must  worship her with pure heart and devotion. Chanting this sholka would yield desired results.

Mantra 4
“Annapurne Sadaa Purne, Sankara Praana Vallabhe, Gnana Vairaagya Siddhyartham, Bikshaam Dehicha Paarvathi”

For the calming effect of Moon God
“Dadhi Sankha Tushaaraabham, Ksheero Daarnava Sambhavam, Namami Sasinam Somam, Sambhor Makuta Bhushanam”


Leo:
If your birth star is Leo, then your ruling planet Lord Sun and your ruling God is Lord Siva.

Mantra 5

“Vande Sambhu Mumapathim Suargurum, Vande Jagathkaaranam, Vande Pannaga Bhushanam Mriga Dharam, Vande Pasoonaam Patheem, Vande Surya Sasaanka Vahni Nayanam, Vande Mukunda Priyam,  Vande Bhaktha Janaarasrayancha Varadam, Vande Sivam Sankaram”

To calm the effects of Sun God
“Japaa Kusuma Sankaasam, Kaasyapeyam Mahadhyuthim, Thamorim Sarva Paapaghnam Pranathosmi Divakaram”

Sagittarius and Pisces:
Those born under zodiacs, Sagittarius and Pisces, have Jupiter as their ruling planet, and their ruling lord is Sri Dakshina Murthy.

Mantra 6
“Gurave sarva lokanam, Bhishaje bhava roginam, Nidhaye sarva vidhyanam, Dakshina murthaye namaha”

For the calming effects of Jupiter:
“Devaanaancha Rusheenaancha Guru Kanchana Sannibham, Budhdhi Mantham Trilokesam, Tham Namami Brihaspatheem”

The above excerpt is from the website - www.speakingtree.com

Dreams and their meanings:

- When you dream of driving a car, it is an indication of your health, pay attention and remember the state of the car, the people in it, and where it is going, as these are all hints about your body taking its requisite course.

- At times, in our dreams we do not see ourselves in human form. We are either an animal or bird, or any species other than Homo sapiens. Animal symbolizes our inner base desires and needs.

- So, if your dream is often about animals or seeing yourself as one, then it indicates that your brain is trying to communicate the truth about your habits.

- If you see yourself being chased by an animal or being attacked by one, then it is a sign that you are surrendering to a certain habit, which even your inner self knows is wrong for your well-being.

- State of mind:
Dreams come from the depths of our minds, and images, emotions and the metaphors it generates symbolize different aspects of us. We may feel at ease while awake and not be aware of that tiny tinge that goes on in the back of our mind. But, while asleep, these tiny neglected thoughts dominate our dreams, making us realize how deeply and slowly they are affecting our minds.

- Often people interpret dreams of ‘death’ as a good sign of longevity; actually they are not. Dreaming about death indicates end of a cycle, or a habit or any certain aspect of your usual self.

- If you can still remember from your dream, like who died and how, then these details will help your link metaphor to the particular formation changing within you.

- Future Possibilities
Sometimes, dreams take us into future and give us subtle hints of what awaits us. Most of us at some point experienced a déjà vu moment. A déjà vu moment is when you feel that a certain situation, or series of events, is repeated in the same manner that you once dreamed.

- Creativity and Imagination
Ask an artist, and they will attribute their dreams for the breakthrough ideas. While asleep, part of our brain triggers formulation of images; putting them in series using our creativity. They give our subconscious mind, an ability to express and interact through these different formations, unraveling the infinite perspectives that we are capable of acknowledging.

- Choices in Expression
While dreaming, we only tend to focus on the broader view, like death, birth, driving a car, being stuck in jungle, but often ignore minute details like, what were we wearing, the color of car, or the color of clothes around us.

- Every aspect of our dream has some significance, like clothes, which are expressions of our choices in the waking world. Wearing brightly colored clothing hints at our playful and childlike nature.

- Seeing oneself walking around naked indicates that one is comfortable with their life choices. If found wearing work clothes, then it hints at your priorities being inclined more towards professional life and less on personal.

The above points are excerpts from the website - www.speakingtree.com

గృహస్థ ధర్మాన్ని స్వీకరించబోయే సమయంలో...

రాత్రి సమయంలో స్నానం చేయను వస్త్రరహి తంగా స్నానం చేయను వర్షంలో తడవను చెట్లు ఎక్కను నూతులలోకి దిగను నదిని చేతులతో ఈదుతూ దాటను ప్రాణ సంశయం ఏర్పడే సన్నివేశాలోకి ఉద్దేశపూర్వకంగా ప్రవేశించను... అని పలికిస్తారు. 

అంకురారోపణం

వివాహానికి ముందే కన్యాదాత ఈ కార్యక్రమం నిర్వర్తిస్తాడు. పంచపాలికలలో పుట్టమన్ను పోసి నవధాన్యాలను పాలతో తడిపి మంత్రయుక్తంగా వేసి పూజిస్తారు. ఇందులోని పరమార్థం... ‘‘కొత్తగా పెళ్లి చేసుకుంటున్న దంపతులారా! భూమిలో విత్తనాలను వేస్తే పంట వస్తోంది. కాబట్టి నేలతల్లిని నమ్మండి, పంట సంతానాన్ని పొందండి’’ అని ధర్మసింధు చెబుతోంది.

కన్యావరణం
కన్యను వరించటానికి రావటాన్ని ‘కన్యావరణం’ అంటారు. మంగళవాద్యాల నడుమ వధువు ఇంటికి వచ్చిన వరుడిని, వధువు తండ్రి గౌరవంగా ఆహ్వానించి మధుపర్కం ఇస్తాడు. 

మధుపర్కం
మధుపర్కమంటే ‘తీయని పానీయం’ అని అర్థం. వరుడికి... తేనె, పెరుగు, బెల్లం కలిపిన మధురపదార్థం తినిపించాక, మధుపర్కవస్త్రాలను ఇస్తారు.

ఎదుర్కోలు సన్నాహం
ఇరుపక్షాలవారు శుభలేఖలు చదివి, ఒకరికొకరు ఇచ్చుకుని, పానకం అందచేస్తారు.
కన్యాదానం- విధి
వధువు తండ్రి, తన కుమార్తెను మరో పురుషుడికి కట్టబెట్టడమే కన్యాదానం. కన్యాదానం చేసేటప్పుడు వల్లించే 

మంత్రాలు...
అష్టాదశవర్ణాత్వియకం కాన్యపుత్రవత్పాలితామయా
ఇదానిల తపదాస్వామి దత్తాం స్నేహేన పాలయం
‘కుమారుడితో సమానంగా పెంచుకొన్న ఈ కన్యను నీకు ఇస్తున్నాను. నీవు ప్రేమాభిమానాలతో కాపాడుకో’
‘శ్రీలక్ష్మీనారాయణ స్వరూపుడైన వరునికి ఇదిగో నీళ్లు... అంటూ వరుడి పాదాలు కడుగుతారు. 
‘పితృదేవతలు తరించడానికి ఈ కన్యను నీకు దానం చేస్తున్నాను. సమస్తదేవతలు, పంచభూతాలు నేను చేస్తున్న ఈ దానానికి సాక్షులుగా ఉందురుగాక’ ‘అందంగా అలంకరించిన సాధుశీలవతి అయిన ఈ కన్యను ధర్మకామార్థ సిద్ధికోసం ప్రయత్నం చేస్తున్న ఈ సాధుశీలుడైన బుద్ధిమంతునికి దానంగా ఇస్తున్నాను’
‘ధర్మబద్ధంగా సంతానం పొందడానికి, ధర్మకార్యాలు నిర్వహించడానికి ఈ కన్యను ఇస్తున్నాను’
వధువు తండ్రి ‘పృణీద్వం’ (వరించవలసినది) అంటాడు. అప్పుడు వరుడు ‘పృణేమహే’ (వరిస్తున్నాను) అంటాడు.
ఆ తరువాత వధువు తండ్రి వరునితో, 
‘‘నేత్రాయ పౌత్రపుత్రా లక్ష్మీం కన్యాంనామ్నీం
ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతిచరితవ్య"

ధర్మంలోనూ, అర్థంలోనూ, కామంలోనూ లక్ష్మీస్వరూపిణి అయిన ఈ కన్యను అతిక్రమించనివాడవై ఉండు అని పలికిన వధువు తండ్రితో, ‘నాతిచరామి’ (అతిక్రమించను) అని వరుడు మూడుసార్లు వాగ్దానం చేస్తాడు. ఇది వేదోక్త మంత్రార్థం. ఆ మాటకు అంత మహత్తు ఉంది. అలా అన్న తరవాతే వరుడి పాదాలను కడిగి, కన్యాదానం చేస్తారు.


యోక్త్రధారణం
యోక్త్రం అంటే దర్భలతో అల్లిన తాడు. వివాహ సమయంలో వరుడు దీనిని వధువు నడుముచుట్టూ కట్టి ముడి వేస్తాడు.
ఈసమయంలో వరుడు...
"ఆశాసానా సౌమ నవ ప్రజాం సౌభాగయం తను మగ్నే,
రనూరతా భూత్వా సన్న హ్యే సుకృతాయ కమ్’’
 అంటాడు.
ఉత్తమమైన మనస్సును, యోగ్యమైన సంతానాన్ని, అధికమైన సౌభాగ్యాన్ని, సుందరమైన తనువును ధరించి, అగ్నికార్యాలలో నాకు సహచారిణివై ఉండు. ఈ జీవిత యజ్ఞమనే మంగళకార్యాచరణం నిమిత్తమై వధువు నడుముకు దర్భలతో అల్లిన తాటిని కడుతున్నాను... అనేది ఈ మంత్రార్థం.


జీలకర్ర , బెల్లం
వధూవరులు... జీలకర్ర, బెల్లం కలిపిన మెత్తని ముద్దను శిరస్సు భాగం లో, బ్రహ్మరంధ్రం పైన ఉంచుతారు. ఒకరిపట్ల ఒకరికి అనురాగం కలగడానికి, భిన్నరుచులైన ఇద్దరూ ఏకం కావడానికి, పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడేలా మనసు సంకల్పించటం దీని అంతరార్థం. ఈ సమయంలో 
‘‘ఆభ్రాతృఘ్నీం వరుణ ఆపతిఘ్నీం బృహస్పతే లక్ష్యం తాచుస్యై సవితుస్సః’’ 
వరుణుడు, సోదరులను వృద్ధిపరచుగాక. బృహస్పతి, ఈమెను భర్తవృద్ధి కలదిగా చేయుగాక. సూర్యుడు, ఈమెను పుత్రసంతానం కలదానిగా చేయుగాక’’ అని అర్థం. ఇదే అసలైన సుముహూర్తం.

మంగళసూత్రధారణ
(తాళి... తాటి ఆకులను గుండ్రంగా చుట్టి, పసుపు రాసి, పసుపుతాడు కడతారు. దానిని తాళిబొట్టు అంటారు. తాళవృక్షం నుంచి వచ్చింది). 
వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని ముడి వేస్తూ ఈ కింది మంత్రాన్ని పఠించాలి. 
మాంగల్య తంతునానేన మమజీవన హేతునా
కంఠే బధ్నామి సుభగే త్వం జీవశరదాశ్శతం 

నా జీవానికి హేతువైన ఈ సూత్రాన్ని నీకంఠాన మాంగల్యబద్ధం చేస్తున్నాను. నీవు నూరు సంవత్సరాలు జీవించు... అని దీని అర్థం.

బొడ్డుతాడును భద్రపరచడం - హిందూ సంప్రదాయం

గర్భంలో ఉన్న శిశువు బొడ్డుతాడు ద్వారానే తల్లి నుంచి పోషకాలను తీసుకుంటుంది. బొడ్డుతాడులో స్టెంసెల్స్ ఉంటాయని, దాన్ని భద్రపరచాలని ఇప్పుడు అనేక ప్రకటనలు చేస్తూ, స్టెం సెల్ బ్యాంకుల పేరుతో కొత్త కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి ఈ బొడ్డుతాడును దాచాలన్న ఆలోచన ఈనాటిది కాదు. అనాదికాలం నుంచి ఉంది. దీనికి సనాతనహిందూ ధర్మమే మూలమైంది. సనాతనధర్మం ప్రకారం ప్రతి వ్యక్తికి జీవితంలో 16 సంస్కారాలు నిర్వహించాలి. ఇవి పుట్టుకముందు నుంచి మరణం తర్వాతి వరకు ఉంటాయి. వీటిలో ఒకటి జాతకర్మ. ఇది బిడ్డ పుట్టిన తర్వాత 11 రోజులకు చేసే సంస్కారం. 

పూర్వం ఈ సమయంలోనే బొడ్డుతాడును తీసి, మంత్రించి, రాగి తాయత్తులో చుట్టి భద్రపరిచేవారు. దానికి ప్రత్యేకమైన పద్ధతి ఉండి ఉండవచ్చు. జీహాదీలు, ఆంగ్లేయుల దండయాత్రల్లో భారతదేశం చాలా విజ్ఞానాన్ని కోల్పోయింది. ఆ క్రమంలోనే ఈ బొడ్డుతాడును భద్రపరిచే ప్రక్రియను హిందువులు కోల్పోయి ఉండవచ్చు. తద్ఫలితంగా ఇప్పుడు దాన్ని వెండిలో చుట్టించి భద్రపరచడం వరకు మాత్రమే మిగిలింది.ఇలా ఎందుకు చెప్పవలసి వస్తోందంటే ఆంగ్లేయులు దేశం మీదకు దండెత్తేనాటికే మన దేశంలో అన్ని శాస్త్రాల్లో విశేషమైన పరిశోధన జరిగింది. దీనికి చిన్న ఉదాహరణ, రాజీవ్ దీక్షిత్ గారు ఉపన్యాసంలో చెప్పినది.

1740 డా. థామస్ క్రూసో అనే ఆంగ్లేయుడు (ఈస్ట్ ఇండియా కంపెనీ సర్జన్) బెంగాల్ లో పర్యటించాడు. అతని పర్యటనలో ఒక ఆశ్చర్యకమైన విషయం వెలుగు చూసింది. భారత దేశంలో అమ్మవారు(చికెన్ ఫాక్స్) తో చనిపోయే వారి సంఖ్య చాలా తక్కువగా దాదాపు లేని విధంగా కనిపించిది. ఈ విషయమై తన పరిశోధన మొదలెట్టాడు. బెంగాల్ లో ఒక సాధారణ మంగలి వైద్యుడు ఒక చిన్న సీసాలోని ద్రవ పదార్థాన్ని సూది ద్వారా శరీరం లోకి ఎక్కించడం చూశాడు. అతను ఇంటింటికీ తిరిగి ఇలా చేస్తూ ఉండడం థామస్ క్రూసోకు ఆశ్చర్యం కలిగించింది. అతనిని పిలిచి వివరం అడిగాడు. ఆ వైద్యుడు ఇచ్చిన సమాచారాన్ని హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రవేశపెట్టాడు.

1. భారత దేశంలో చికెన్ ఫాక్స్, స్మాల్ ఫాక్స్ తో మరణాలు లేవు.

2. భారతీయ వైద్యులు దీనికి విరుగుడు కనుగొన్నారు. వారు చికెన్ ఫాక్స్ వచ్చినవారి పుండ్లనుండి రసిని తీసి నిలవచేసేవారు. తరువాత కొద్దిమొత్తంలో ఈ రసిని బాగున్న వారి శరీరాలలోకి ఎక్కిస్తున్నారు. దానితో శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పాడు.

దీని వల్ల మనకు విశదమయ్యే విషయాలు మూడు. రోగనిరోధక శక్తి మనశరీరానికి ఉంది అనేది భారతీయులకు తెలుసు, చాలా చిన్న మోతాదులో రోగ క్రిములను శరీరానికి ఇస్తే ఇక జన్మలో ఆ రోగం బారిన పడకుండా ఉంటారని తెలుసు. వాక్సిన్ కు మూలసిద్దాంతం ఇది. వైట్ బ్లడ్ సెల్స్ గురించి మన భారతీయులకు అవగాహన ఉంది.

మామూలుగానే రోగనిరోదక శక్తి, వాక్సన్ లు యూరోపియన్లు కనుక్కున్నారు అని అంటూ భారత్ పైకి విదేశీయులు దండత్తకపోతే మనకే దిక్కు ఉండేది కాదు అంటున్నారు. హౌస్ ఆఫ్ కామన్స్ వివరాలు తిరగవేయండి మనకింకా ఇలాంటి చాలా విషయాలు బోధపడతాయి.

అయితే ఇప్పుడు మనం బొడ్డుతాడును వెండి తాయత్తులో చుట్టించి, మొలకు కట్టడం వెనుక కూడా విజ్ఞానం ఉంది. మొలతాడు వెండిది కట్టేవారు. ఇప్పుడు అది అనాగరికమని ప్రచారం చేశారు. కానీ అసలు విషయమిది. లోహాలకు శరీరంపై ప్రభావం చూపే శక్తి ఉందని గుర్తించినవారు పురాతన హిందువులు. ఈ సంస్కృతి ప్రతి చిన్న విషయం మీదా చాలా లోతైన పరిశోధన చేసింది. వెండిని శరీరంపై ధరించినప్పుడు అది చలువ చేసే గుణం కలిగి ఉంటుంది. అదే బంగారమైతే ఉష్ణగుణం కలిగి ఉంటుంది. ఎక్కడెక్కడ ఉష్ణగుణం అవసరమో, ఎక్కడ శీతలగుణం అవసరమో మన పూర్వీకులకు బాగా తెలుసు. దీనికి పెద్ద వివరణ ఇవ్వచ్చు. 

విషయంలోకి వస్తే, స్త్రీపురుష శరీర నిర్మాణం చూసినప్పుడు పురుషులకు వృషణాలు శరీరం బయట ఉంటాయి. వాటి ఉష్ణోగ్రత సాధరణ శరీర ఉష్ణోగ్రత కంటే 2 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. అవి పురుషుల్లో వీర్యోత్పత్తి చేస్తాయి. ఈ వృషణాలు, ఎప్పుడూ కూడా అధిక ఉష్ణోగ్రతకు లోనవ్వకూడదు. అలా అయితే వీర్య ఉత్పత్తి మీద, వీర్యకణాల మీదా ప్రభావం చూపిస్తుంది. ఇవి అధిక ఉష్ణోగ్రతకు లోనవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే మొలకు వెండి మొలతాడు కట్టుకుంటామో, అప్పుడు ఆ లోహప్రభావం వలన ఆ శరీర ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత సాధారణస్థాయికి రావడం కానీ, అదుపులో ఉండటం కానీ జరుగుతుంది. అయితే వెండిమొలతాడు కొనే స్థోమత లేకపోవడం చేతనో, లేక అది అనాగరికమని భావించటం చేతనో, ఇప్పుడు కేవలం వెండి తాయత్తులో బొడ్డుతాడు ఉంచి, మొలతాడుకు కడుతున్నారు. అలా వెండి తాయత్తు కట్టడం, వెండిమొలతాడు కట్టడం అనాగరికమేమి కాదు. బంగారు మొలతాడు కట్టకపోవడానికి కారణం మీకు ఇప్పటికే అర్దమై ఉంటుంది.

బొడ్డుతాడులో ఉన్న స్టెం సెల్స్ ను అనేక రోగాల నివారణకు, చికిత్సకు వాడతారు. అయితే కేవలం రాగి తాయత్తులో కట్టినంత మాత్రం చేతనే ఆ కణాలను భద్రపరచలేము. నైట్రస్ ఆక్సైడ్ వాంటి వాయువులను ఉపయోగించి అతిశీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరచడం చేత వాటిని పరిరక్షించవచ్చు. కానీ ఇది ఇప్పుడు పెద్ద వ్యాపరమైంది. రోగం వస్తుందో రాదో తెలియదు కానీ, రోగం వస్తుందని ముందే భయపెట్టి అధికమొత్తంలో సొమ్ము చేసుకోవడం కోసం స్టెం సెల్ బ్యాంకులు తెరవడం నిజంగా బాధాకరం. ధర్మం మీద, ఆయుర్వేదం మీద నమ్మకముండి, దేశభక్తి కలిగిన వారు ఎవరైనా ముందుకు వచ్చి, ఆయుర్వేదశాస్త్రంలో సనాతనధర్మం కోల్పోయిన ఈ స్టెం సెల్స్ వైద్యాన్ని తిరిగి పునరుద్ధిరించాలి.

బ్రాహ్మణులు చేసిన పాపం ఏమిటి?

చరిత్రలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, మారణహోమాలూ సాగించినవారిని ఆధునిక భారతం గతం గతః అనుకుని క్షమించి వదలివేసింది.  అంతకుమించి...మన సాంస్కృతిక వారసత్వ సంపదను, జ్ఞానసంపదను పంచిపెట్టిన విశ్వవిద్యాలయాలను, సమున్నతమైన చారిత్రక కట్టడాలనూ విధ్వంసం చేసిన వారికి విలాసవంతమైన జీవితాన్ననుభవించేందుకు కావలసిన వసతులు సమకూరుతున్నాయి.

కానీ... ధర్మ పరిరక్షణకు, సమాజ సంక్షేమానికి కట్టుబడిన బ్రాహ్మణులు మాత్రం ఆధునిక భారతావనిలో పీడనకు గురవతూనే ఉన్నారు.గత రెండు శతాబ్దాలుగా ఈ విధమైన బ్రాహ్మణ వ్యతిరేకవాదం సమాజంలో వేళ్లూనుకుపోయింది.
ఇతరులెవరికీ విద్యాబుద్ధులు నేర్చుకునే అవకాశాన్ని బ్రాహ్మణులు ఇవ్వలేదనేది వారు చేసే వితండవాదం.  సమాజంలో తమదే ఉన్నతస్థానమని చాటుకునేందుకే బ్రాహ్మణులు హిందూ ధర్మశాస్త్రాలను స్వయంగా రూపొందించుకున్నారని, సమాజంలో తలెత్తిన వైపరీత్యాలకు ఈ ధోరణే కారణమైందనేది చాలామంది మేధావుల అభిప్రాయం కూడా. 

అయితే ఈ రకమైన వాదనల్లో హేతుబద్ధతగానీ, వాటికి చారిత్రక ఆధారాలుగానీ లేవు. ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే అదే నిజమవుతుందనే నానుడికి ఇలాంటి వాదనలు అద్దం పడతాయి.


బ్రాహ్మణులు ఎప్పుడూ పేదలే. 
వారెప్పుడూ భారతదేశాన్ని పాలించలేదు. చరిత్రలో బ్రాహ్మణులెవరైనా ఏదైనా భూభాగాన్ని పాలించారనడానికి చారిత్రక ఆధారమేదైనా ఉందా? 
(సమైక్య భారతావనికోసం చంద్రగుప్త వౌర్యుడికి చాణక్యుడు సహకరించాడు. చంద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాక చాణక్యుడి కాళ్లపై పడి రాజగురువుగా కొనసాగుతూ తన ఆస్థానంలోనే ఉండిపొమ్మని వేడుకున్నాడు. అప్పుడు చాణుక్యుడు ‘నేను బ్రాహ్మణుడిని. పిల్లలకు విద్యాబుద్ధులు గరపడం నా ధర్మం. వారు భిక్షమెత్తుకుని తెచ్చిందే నాకు జీవనాధారం. కాబట్టి నేను నా గ్రామానికి వెళ్లిపోవడమే ధర్మం’ అని జవాబిచ్చాడు). 

పురాణాల్లోగాని, చరిత్రలోగానీ ధనవంతులైన బ్రాహ్మణులు ఉన్న ఉదంతాన్ని ఒక్కటైనా చెప్పగలరా? 
కృష్ణ భగవానుడి జీవితగాథలో సుధాముడి (కుచేలుడు)కి ప్రత్యేక స్థానం ఉంది. సుధాముడు పేద బ్రాహ్మణుడు కాగా కృష్ణుడు యాదవుడు. ప్రస్తుతం యాదవులు ఇతర వెనుకబడిన కులాల (ఓబిసి) జాబితాలో ఉన్నారన్నది గమనార్హం. బ్రాహ్మణులు అహంభావానికి ప్రతీకలే అయితే తమకంటే తక్కువ కులాలకు చెందిన దేవుళ్ళని వారెందుకు పూజిస్తారు? భోళా శంకరుణ్నే తీసుకోండి. ఆయన కిరాతుడని పురాణాలు చెబుతున్నాయి. కిరాతులు ఇప్పుడు ఎస్టీలుగా కొనసాగుతున్నారు. 
మతపరమైన ఆచారాల నిర్వహణ బాధ్యతలు చేపట్టే పౌరోహిత్యం-బ్రాహ్మణుల సాంప్రదాయకమైన వృత్తి. భూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చే భిక్షతో వారు జీవితం గడిపేవారు. 

బ్రాహ్మణుల్లోనే మరో శాఖకు చెందినవారు వేతనమేమీ లేకుండానే ఆచార్యులు (ఉపాధ్యాయులు)గా కొనసాగేవారు. మరి..ఇవే సమాజంలో అత్యున్నతమైన పదవులా? 
వాస్తవానికి దళితులను అణగదొక్కింది భూస్వాములే తప్ప బ్రాహ్మణులు కారు. కానీ నింద పడింది మాత్రం బ్రాహ్మణులపైన. బ్రాహ్మణుల్లో పౌరోహిత్యం చేసేవారు 20శాతానికి మించరన్న నిజం ఎంతమందికి తెలుసు?
చదువుకోవద్దని బ్రాహ్మణులు ఎవరినీ ఆదేశించలేదే?
ఆ మాటకొస్తే జ్ఞాన సముపార్జనే వారి ఆశయం.
ఇదే వారిని శక్తిమంతుల్ని చేసింది. ఇతరులు అసూయ చెందడానికీ ఇదే కారణం.
ఇందులో తప్పెవరది? చదువు సంధ్యలనేవి బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనవైతే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎలా రాయగలిగాడు?
తిరువళ్లువార్ తిరుక్కురళ్‌ను ఎలా లిఖించగలిగాడు?
ఇతర కులాలకు చెందిన ఎందరో సాధుసంతులు భక్తిపరమైన రచనలెన్నో చేశారుకదా?
మహాభారతాన్ని రాసిన వేద వ్యాసుడు ఓ మత్స్య కన్యకు జన్మించినవాడుకాదా?
వశిష్టుడు, వాల్మీకి, కృష్ణుడు, రాముడు, బుద్ధుడు, మహావీరుడు, తులసీదాసు, కబీర్, వివేకానంద...వీరంతా బ్రాహ్మణేతరులే.  
వీరు చేసిన బోధనలను మనమంతా శిరోధార్యంగా భావించడం లేదా? 

అలాంటప్పుడు ఇతరులు విద్యార్జన చేసేందుకు బ్రాహ్మణులు అంగీకరించేవారు కారన్న వాదనకు హేతువెక్కడ?
 మనుస్మృతిని రచించిన మనువు బ్రాహ్మణుడు కాడే! ఆయన ఓ క్షత్రియుడు.  కుల వ్యవస్థను వివరించి చెప్పిన భగవద్గీతను రచించినది వ్యాసుడు.


ప్రాచీన గ్రంథాలన్నీ బ్రాహ్మణులకే ఉన్నత స్థానమిచ్చాయి. అందుకు కారణం వారు ధర్మాన్నీ, విలువలనూ పాటించడమే. అరేబియానుంచి వచ్చిన ఆక్రమణదారులు బ్రాహ్మణుల తలలు నరికారు. గోవాను దురాక్రమించిన పోర్చుగీసువారు బ్రాహ్మణులను శిలువ వేశారు. బ్రిటిష్ మిషనరీలు అనేక వేధింపులకు గురిచేశాయి. ఇప్పుడు సోదర సమానులైన స్వదేశీయులే వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.

ఇంత జరుగుతున్నా ఎవరైనా తిరగబడ్డారా? వారణాసి, గంగాఘాట్, హరిద్వార్ ప్రాంతాల్లో నివసించే 1,50,000మంది బ్రాహ్మణులను ఔరంగజేబు ఊచకోత కోశాడు. పది మైళ్ళ దూరంనుంచి చూస్తే కూడా కనబడే విధంగా వారి తలలను తెగ్గొట్టి గుట్టగా పోశాడు. ఇస్లాం మతం స్వీకరించనందుకు ఔరంగజేబు బ్రాహ్మణుల తలలు తెగనరికి, వారి జంధ్యాలను తెంచి వాటిని ఒకచోట చేర్చి నిప్పంటించి చలి కాచుకున్నాడు. కొంకణ్-గోవా ప్రాంతంలో మతం మారేందుకు నిరాకరించినందుకు పోర్చుగీసు దురాక్రమణదారులు లక్షలాది కొంకణ్ బ్రాహ్మణుల్ని ఊచకోత కోశారు. ఒక్క బ్రాహ్మణుడైనా తిరగబడి పోర్చుగీసువారిని చంపిన దృష్టాంతముందా? 

ఎందుకంటే వారు హింసను వదిలి అహింసా జీవనాన్ని గడిపేవారు.
(భారత్‌కు పోర్చుగీసువారు వచ్చినపుడు సెయింట్ జేవియర్.. పోర్చుగీస్ రాజుకు ఓ ఉత్తరం రాశాడు. దాని సారాంశమేమిటంటే... ‘ఇక్కడ బ్రాహ్మణులెవరూ లేకపోతే అందర్నీ సునాయాసంగా మన మతంలోకి మార్చేయవచ్చు’ అని). సెయింట్ జేవియర్ బ్రాహ్మణులను విపరీతంగా ద్వేషించేవాడు. జేవియర్ వేధింపులు భరించలేక వేలాది కొంకణ బ్రాహ్మణులు సర్వస్వం వదలుకుని కట్టుబట్టలతో గోవాను వదలి వెళ్లిపోయారు.

కాశ్మీర, గాంధార దేశాల్లో (ఇప్పటి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లోని భాగాలు) సారస్వత బ్రాహ్మణులను విదేశీ ఆక్రమణదారులు ఊచకోత కోశారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో సారస్వత బ్రాహ్మలు మచ్చుకైనా కనిపించరు. ఇంతలా మారణహోమం జరుగుతున్నప్పుడు ఏ ఒక్క సారస్వత బ్రాహ్మడైనా తిరగబడిన దాఖలాలు ఉన్నాయా?
ఎందుకంటే వారు తాపస జీవనాన్ని వృత్తిగా ఎంచుకున్న వారు.
(పాకిస్తానీ మిలిటెంట్ల దురాగతాలకు తాళలేక కాశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలను వదిలి వెళ్లిపోయారు. ఉగ్రవాదులు చేపట్టిన కాశ్మీరీ లోయ ‘ప్రక్షాళన’ కార్యక్రమానికి తాళలేక కాశ్మీరీ పండిట్లు విలువైన తమ ఆస్తిపాస్తులనే కాదు...ప్రాణాలనూ కోల్పోయారు. ఐదు లక్షలమందికి పైగా పండిట్లు కాశ్మీర్ లోయను వదలిపెట్టి వలస పోయారు. వీరిలో 50వేలమందికి పైగా ఇప్పటికీ శరణార్థి శిబిరాల్లోనే కాలం గడుపుతున్నారు. కాశ్మీరీ పండిట్లు ఇంత పీడనకూ, వేదనకూ గురైనా ఎన్నడైనా తిరగపడిన ఉదంతాలు ఉన్నాయా?)
ఎందుకంటే వారు వారు ద్వేషాన్ని వదిలి శాంతి జీవనాన్ని గడిపేవారు.


భారత్‌పైకి అరబ్బు దేశంనుంచి దండెత్తి వచ్చిన మహమ్మద్ బీన్ ఖాసిం బ్రాహ్మణులంతా సున్తీ చేయించుకోవాలని షరతు విధించాడట. వారు నిరాకరించినందుకు పదిహేడేళ్ల వయసు పైబడిన బ్రాహ్మణులకు మరణశిక్ష విధించేవాడట. ముస్లిం చరిత్రకారులను ఉటంకిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పిన వాస్తవమిది. భారత్‌పై దండయాత్రలు జరిగిన సమయాల్లోనూ, మొఘలుల కాలంలోనూ వందలు, వేలమంది బ్రాహ్మణులు ఊచకోతకు గురయ్యారు. కానీ...బ్రాహ్మణులు తిరగబడిన ఉదంతాలు ఒక్కటీ కనబడవు.
ఎందుకంటే వారు సౌత్విక జీవనాన్నీ - సాత్విక గుణాలనే సంపదగా భావించేవారు.
19వ శతాబ్దం తొలినాళ్లలో ఓ దీపావళి రోజున టిప్పు సుల్తాన్ సైన్యం మేల్కోటే ప్రాంతంపైకి దండెత్తివచ్చి 800 మందిని ఊచకోత కోసింది. మృతుల్లో అత్యధికులు మాం డ్యం అయ్యంగార్లే. సంస్కృతంలో ప్రవీణులు వారు. (ఇప్పటికీ మేల్కోటేలు దీపావళి పండుగ జరుపుకోరు).
వారణాసిలో రిక్షా తొక్కేవారిలో చాలామంది బ్రాహ్మణులనే విషయం ఎంతమందికి తెలుసు?
ఢిల్లీ రైల్వే స్టేషన్లలో బ్రాహ్మణులు కూలీలుగా పనిచేస్తున్నారనే సంగతి తెలిస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిజం. న్యూ ఢిల్లీలోని పటేల్‌నగర్‌లో నివసించే రిక్షా కార్మికుల్లో 50శాతం మంది బ్రాహ్మణులే.


ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లలో పనిచేసేవారు, వంటవాళ్లలో 75శాతం మంది బ్రాహ్మణులే.
మన దేశంలో 60శాతం మంది బ్రాహ్మణులు పేదరికంలో మగ్గుతున్నారు. వేలాది బ్రాహ్మణుల పిల్లలు ఉద్యోగాల వేటలో అమెరికాకు వలస పోతున్నారు. అక్కడ సైంటిస్టులుగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడుతున్నారు. మన దేశంలో నిపుణుల కొరత ఉన్నప్పుడు ప్రభుత్వాలు వారిగురించి ఎందుకు ఆలోచించడం లేదు?
గత కాలపు బ్రాహ్మణ సమాజం మొత్తం పులుకడిగిన ముత్యం కాకపోవచ్చు. వారిలో ఏ కొద్దిమంది చేతులకో రక్తం అంటి ఉండవచ్చు. వారు చేసిన తప్పులను మొత్తం బ్రాహ్మణులందరికీ అంటగట్టడం సబబేనా?


సమాజానికి బ్రాహ్మణులు చేసిన మేలును ఈ ప్రపంచం ఏనాడో మరచిపోయింది. బ్రాహ్మణులు కేవలం వేదాలు, గణిత, ఖగోళ శాస్త్రాల అధ్యయనానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయుర్వేద, ప్రాణాయామ, కామసూత్ర, యోగ, నాట్య శాస్త్రాలను అభివృద్ధి చేసి మానవాళికి అందించిన ఘనత నిస్సందేహంగా వారిదే.

బ్రాహ్మణులు స్వార్ధపరులే అయితే, విలువైన ఈ శాస్త్రాలన్నిటిమీద హక్కు తమదే అని చాటుకునేవారు. అతి ప్రాచీనమైన శాస్త్రాలపై తమ పేర్లు లిఖించుకుని ఉండేవారు.

 ‘లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు’ అనే ఒకే ఒక్క ఆశయంతో మానవాళి సంక్షేమంకోసం తమ జీవితాలను త్యాగం చేశారు. అందుకు ప్రతిఫలంగా బ్రాహ్మణుల్ని శిలువపైకి ఎక్కించేందుకు ఈ లోకం ప్రయత్నిస్తోంది. ఎంత విచారకరం!
"చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణస్య శుభం భవతు . లోకాసమస్తా సుఖినోభవంతు. "
 అనేది తరతరాలుగా వస్తున్న ప్రార్థన.

అంటే నాలుగు సముద్రాల వరకు వ్యాపించిన ఈ భూమిపై నివసించే ఆవులూ -బ్రాహ్మణులు శుభకరంగా ఉండు గాక ! అప్పుడే ఈ లోకం లో కూడా ధర్మం వృద్ధి చెంది సుభిక్షంగా ఉంటుందని అర్థం.
ఇప్పుడు ఆవులకూ విలువ ఇవ్వడం లేదు. బ్రాహ్మణులనూ ఉద్దేశపూర్వకంగా అణిచి వేస్తున్నారు.

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...