Monday, June 20, 2016

Some good links....


1. http://www.astrospeak.com/article/navdurga-nine-forms-of-energy

2. http://www.astrospeak.com/article/numbers-and-your-profession

3. http://www.astrospeak.com/article/planets-and-astrology

Sunday, June 12, 2016

Some interesting Youtube videos


RamaSethu Scientific explanation: https://www.youtube.com/watch?v=rMeAw-gZ1PQ

Rameswaram Floating Stone: https://www.youtube.com/watch?v=ifAFm3avI6E

Taj Mahal is Lord Shiva Temple The hidden truth:
https://www.youtube.com/watch?v=hv3rAVuBU1s
https://www.youtube.com/watch?v=5lRqPBhjNJY
https://www.youtube.com/watch?v=rrqzr_BKorg

Real Evidence Of Ramayan: https://www.youtube.com/watch?v=yGRoQIZo_To


Secrets of lord Venkateswara Statue:

https://www.youtube.com/watch?v=Rs8dGnAAP64
https://www.youtube.com/watch?v=KRxZJ79H2GM

Tuesday, May 3, 2016

శ్రీ గాయత్రీ మహమంత్రంలోని బీజాక్షరాల మహిమ

అతి శక్తివంతమైన శ్రీ గాయత్రీ మహమంత్రంలోని బీజాక్షరాల మహిమ అపారం. అనన్యం, సర్వసిద్ధిప్రదం.

1. త - అజ్ఞానాన్ని పోగొట్టునది
2. త్స - ఉపపాతకములను నివారించునది
3. వి - మహాపాతములను నివారించునది
4. తు - దుష్టగ్రహ దోషాలను నివారించునది.
5. ర్వ - భ్రూణహత్యా దోషాలను నివృత్తి చేయునది
6. రే - తెలియక చేసిన పాపాలను పోగొట్టునది
7. ణి - తినకూడని వాటిని తిన్న దోషాన్ని పరిహరించునది.
8. యం - బ్రహ్మహత్యా పాతకాన్ని నశింపచేయునది
9. భ - పురుష హత్యా పాతకాన్ని పోగొట్టునది.
10. ర్గో - గోహత్యా దోషాన్ని నివృత్తి చేయునది.
11. దే - స్త్రీహత్యా పాతకాన్ని పోగొట్టునది
12. వ - గురు హత్యాపాపాన్ని నివారించును.
13,. స్య - మానసిక దోషాలను నివారించును–
14. ధీ - మాతృ, పితృ వధా పాతకాన్ని పరిహరించును.
15. మ - పూర్వ జన్మార్జిత పాపాల నుండి రక్షించును
16. హి - అనేక పాప సమూహాలను నశింపచేయును
17. ధి - ప్రాణి వధ చేసిన పాపం నుండి కాపాడును
18. యోః - సర్వపాపాలను నివృత్తి చేయును.
19. యో - సర్వపాపాలను నివృత్తి చేయును
20. నః - ఈశ్వరప్రాప్తి నిచ్చును
21. ప్ర - విష్ణులోక ప్రాప్తి
22. చో - రుద్రలోక ప్రాప్తి
23. ద - బ్రహ్మలోక ప్రాప్తి
24. యాత్ - పరబ్రహ్మైక్య సిద్ధి ప్రసాదించును.

గాయత్రీ కవచంలో ఉన్న రూపాలు తానే అయిన దేవి ఇలా వర్ణించబడింది.

గాయత్రి - తూర్పు దిక్కును
సావిత్రి - దక్షిణ దిక్కును
సంధ్యాదేవి - పడమర దిక్కును
సరస్వతి - ఉత్తర దిక్కును
పార్వతి - ఆగ్నేయాన్ని
జలశాయని - నైరుతిని
పవమాన విలాసిని - వాయువ్య దిక్కును
రుద్రాణి - ఈశాన్య దిక్కును రక్షీంచుగాక
తుత్ - పాదాలను
సవితుః - జంఘలను
వరేణ్యం - కటిని
భర్గః - నాభిని
దేవస్య - హృదయాన్ని
ధీమహి - చెక్కిళ్ళను
ధియః - నేత్రాలను
యః - లలాటంను
నః - శిరస్సును
ప్రచోదయాత్ - శిఖా భాగాన్ని రక్షించుగాక.

ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరంలోని ప్రతిభాగమ్ శ్రీ గాయత్రీ మాత రక్షణ కవచంలో భద్రంగా ఉంటాయి.

తత్ - శిరస్సు
సకారం - ఫాలం
వి - నేత్రాలు
తు - కపోలాలు
- నాసాపుటాలు
రే - ముఖం
ణి - పైపెదవి
యం - కింది పెదవి
- మద్య భాగం
ర్గో - చుబుకం
దే - కంఠం
- భుజాలు
స్య - కుడి చేయి
ధీ - ఎడమ చేయి
- హృదయం
హి - ఉదరం
ధి - నాభి
యో - కటి
యో - మర్మప్రదేశం
నః - తొడలు
ప్ర - జానువులు
చో - జంఘం
- గుల్ఫం
యా - పాదాలు
త్ - సర్వ అంగాలు

ఈ విధంగా మన దేహంలోని సర్వ అంగాలను పరిరక్షించమని ఆ తల్లిని వేడుకుందాం.

(పూజ్య బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు గారి వివరణ)

Saturday, April 30, 2016

India PMs

This is a recent article that appeared in one of the Whatsapp forwards. Pasting the image here:

Add caption

'గోత్రము' అంటే ??

 'గో' అంటే గోవులు, 'త్ర' అంటే రక్షించుట .  గోత్రము అంటే గోవులను రక్షించువారు అని అర్ధము. సముద్రమధనంలో 5 గోవులు కామధేనువు  రూపంలో అవతరించాయి. ఒక్కొక్క గోవును ఒక్కొక్క మహర్షి తీసుకెళ్ళి పెంచి వాటిని , వాటి సంతతిని కాపాడుతూ వృద్ది చేసి యితర మహర్షుల ద్వారా సమాజములోని అందరికీ వాటిని అందజేశారు.  గోవులను కాపాడిన ఆయా ఋషుల పేర్లతో మనకు గోత్రాలు ఏర్పడినాయి. హిందువులందరికీ అంటే అన్ని వర్ణములవారికి గోత్రాలు ఉంటాయి. అంటే అందరూ గోవులను రక్షించేవారేనని అర్ధము.

పురాణాల్లో వ్యక్తుల పేర్లు.. అర్ధాలు

🔴అనసూయ - అసూయ లేనిది
🔵అర్జునుడు - స్వచ్చమైన చాయ కలవాడు
🔴అశ్వత్థామ - గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు.
🔵ఆంజనేయుడు - 'అంజన'కు పుట్టినవాడు.
🔴ఇంద్రజిత్తు - ఇంద్రుని జయించినవాడు (జితమంగా విజయము)
🔵ఊర్వశి - నారాయణుడి ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది.
🔴కర్ణుడు - పుట్టుకతో 'కర్ణ'కుండలాలు కలవాడు.
🔵కుంభకర్ణుడు - ఏనుగు యొక్క 'కుంభస్థల' ప్రమాణముగల కర్ణములు (చెవులు) కలవాడు.
🔴కుచేలుడు - చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రము).
🔵కుబేరుడు - నికృష్టమైన శరీరము కలవాడు (బేరమనగా శరీరము).
🔴గంగ - గమన శీలము కలది .భగీరధునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది కనుక భాగీరధి అని, జహ్నుమునికి పుత్రికగా ప్రసిద్ధి నొందినది కనుక జాహ్నవి అని గంగకు పేర్లు కలవు.
🔵గరుత్మంతుడు - విశిష్టమైన రెక్కలు కలవాడు
🔴ఘటోత్కచుడు - కుండవలె గుబురైన జుట్టు కలవాడు (ఘటమనగా కుండ)
🔵జరాసంధుడు - 'జర' అను రాక్షసి చేత శరీర భాగాలు సంధింపబడిన (అతికింపబడిన) వాడు.
🔴తుంబురుడు - తుంబుర (వాద్య విశేషము) కలవాడు
దశరధుడు - దశ (పది) దిశలలో రధ గమనము కలవాడు.
🔵ధృతరాష్ట్రుడు - రాష్ట్రమునంతటినీ అదుపులో ఉంచుకొనువాడు.
🔴త్రిశంకుడు - 1. తండ్రిని ఎదిరించుట 2, పరభార్యను అపహరించుట 3. గోమాంసము తినుట అను మూడు
శంకువులు(పాపాలు) చేసినవాడు.
🔵దమయంతి - 1. 'దమనుడు' అను ముని వరము వలన జన్మించినది. 2. తన అందముచే ఇతరులను దమించునది.(అణచునది).
🔴దుర్వాసుడు - దుష్టమైన వస్త్రము కలవాడు. (వాసమనగా వస్త్రము)
🔵దుర్యోధనుడు - (దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు.
🔴దుశ్శాసనుడు - సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు.
🔵ద్రోణుడు - ద్రోణము(కుండ)నుండి పుట్టినవాడు.
🔴ధర్మరాజు - సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును
ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి.
🔵నారదుడు - 1.జ్ఞానమును ఇచ్చువాడు (నారమనగా జ్ఞానము) 2. కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు.
🔴ప్రద్యుమ్నుడు - ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు (ధ్యుమ్నము :బలము)
🔵ప్రభావతి - ప్రభ (వెలుగు)కలది.
🔴ప్రహ్లాదుడు - భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు
🔵బలరాముడు - బలముచే జనులను రమింపచేయువాడు.
🔴బృహస్పతి - బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు (బృహస్పతి)
🔵భరతుడు - అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు.
🔴భీముడు - భయమును కలిగించువాడు
🔵భీష్ముడు - తండ్రి సుఖము కొరకై తను రాజ్య సుఖములను వదులుకోవడమే కాక వివాహం చేసుకోను అని భీష్మమైన
(భయంకరమైన) ప్రతిజ్ఞ చేసినవాడు.
🔴మండోదరి - పలుచని ఉదరము కలది (మండ-పలుచని)
🔵మన్మధుడు - మనస్సు కలత పెట్టువాడు.
🔴మహిషాసురుడు 1. రంభుడు మహిషంతో (గేదే) రమించగా పుట్టినవాడు
2. 'మహిష్మతి' అనే ఆమె శాపం వలన మహిషమై(గేదె) ఉండి సింధు ధ్వీపుడనే రాజు రేతస్సును మింగి గర్భాన్నిధరించి ఇతనికి జన్మనిస్తుంది.
🔵యముడు - యమము (లయ)నుపొందించువాడు.
యశోద యశస్సును (కీర్తి) కలిగించునది.
🔴రాముడు - రమంతే యోగినః అస్మెన్ = రామ(రమ్ -క్రీడించుట)
యోగులందరూ ఈ పరమాత్మునియందు విహరించెదరు/ఆనందించెదరు.
🔵రావణాసురుడు - కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని)
చేసినవాడు
🔴రుక్మిణి - రుక్మము(బంగారము) కలది
🔵వాల్మీకి -ఆయన నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు (పుట్టలు) మొలచుటవలన వాల్మీకి
అయ్యాడు.
🔴వ్యాసుడు -వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు.
🔵విదురుడు - బుద్ధిమంతుడు , తెలివిగలవాడు
విభీషణుడు - దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు
🔴శంతనుడు - శం = సుఖము/శుభము తను = విస్తరింపజేయుట , సుఖమును, శుభమును విస్తరింపజేయువాడు
ములుకులతో(బాణములతో) బాధించువాడు (శల్యమంగా బాణము)
🔵శకుంతల - శకుంతలములచే (పక్షులచే) రక్షింపబడినది.
🔴శూర్పణఖ - చేటల వంటి గోరులుకలది (శూర్పమనగా చేట, నఖ మనగా గోరు)
🔵సగరుడు - విషముతో పుట్టినవాడు (గర/గరళ శబ్దాలకు విషమని అర్ధము) (గర్భములో ఉండగా విష ప్రయోగానికిగురై ఆ విషంతోనే పుట్టినవాడు)
🔴సత్యభామ - నిజమైన కోపము కలది ( భామ - క్రోధే)
🔵సీత - నాగటి చాలు (జనక చక్రవర్తి భూమి దున్నుతుండగా నాగటి చాలులో దొరికిన శివు కనుక సీత అయినద

హనుమాన్ చాలీసా మహాత్మ్యం

ఉత్తరభారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన 'రామచరితమానస' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.

ఇదిలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి 'దీర్ఘసుమంగళిభవః' అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు! అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.

ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామ భక్తులుగా మరేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది.

పాదుషా :- తులసీదాస్ జీ ! మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట !

తులసీదాస్ :- అవును ప్రభూ ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు ! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?

పాదుషా :- అలాగా ! రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు. నిజమేనా?

తులసీదాస్ :- అవును ప్రభూ ! రామనామానికి మించినదేమీ లేదు.

పాదుషా:- సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము. 

తులసీదాస్ :- క్షమించండి ప్రభూ ! ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవమాత్రులు మార్చలేరు.

పాదుషా :- తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి.

తులసీదాస్ :- క్షమించండి ! నేను చెప్పేది నిజం ! 

పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, 'తులసీ ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!' అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే ! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.

ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు 'తులసీ ! నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏమికావాలో కోరుకో!' అన్నాడు. అందుకు తులసీదాస్ 'తండ్రీ! నాకేమి కావాలి ! నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మచరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ!' అని కోరుకున్నాడు. 

ఆ మాటలతో మరింతప్రీతి చెందిన హనుమంతుడు 'తులసీ! ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమే వహిస్తాము' అని వాగ్దానం చేశారు. అప్పట్నుండి ఇప్పటివరకు 'హనుమాన్ చాలీసా' కామదేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.

అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక 'హనుమాన్ చాలీసా'. దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతిఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది...... 

జై శ్రీ రాం

జగన్నాథ - రథయాత్ర సంపూర్ణ వివరాలు

 1) పూరి మందిరం పేరు ఏమిటి?( శ్రీ మందిరం ) 2) రథయాత్ర  ప్రారంభమయ్యే తొలితిధి ఏది?( ఆషాడ శుద్ధ విదియ ) 3) పూరీ మందిరాన్ని వదిలి ఈ తొమ్మిది రో...