Thursday, July 6, 2023

ఆషాఢమాసం - ప్రత్యేకత


నేరేడుపండు - మాంసాహారం - అంతరార్థం    


    ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. 

    సంవత్సరంలో ప్రతీవారూ ఏనుగు తల పరిమాణమంత మాంసాన్ని ఆహారంగా  తీసుకుంటారనీ, దానికి నేరేడు విరుగుడనీ పేర్కొంటారు. 

    దీనిలో ఉండే అంతరార్థాన్ని పరిశీలించాలి. 


శాకాహారులూ మాంసాహారులేనా? 


    మొక్కలకు ప్రాణముంటుందని జగదీశ్ చంద్రబోసు అనే శాస్త్రవేత్త కనుగొన్నట్లు మనం పాఠ్యాంశాలలో చదువుకున్నాం. 

    కానీ, సంస్కృతంలో "ఓషధి" అంటే "ఫలమునిచ్చి మరణించునది" అని  అర్థం. 

    వరిధాన్యంవంటివి మనం ఆహారంగా తీసుకుంటాము కదా! 

    మొక్క మనకి ఆహారమిస్తూ,అది ప్రాణాన్ని కోల్పోతుంది. అదియే మాంసాహారము. 

    ఆ విధంగా, ప్రతి ఒక్కళ్ళూ తినే ఆహారం, సంవత్సరంలో ఏనుగు శిరస్సంత ప్రమాణమే కదా! 


హింస - ప్రాయిశ్చిత్తము 


     మనం తెలిసి కూడా ఐదు హింసలకి పాల్పడతాం. వాటిని పంచ సూనములు అంటారు. వాటికి ప్రాయశ్చిత్తంగా పంచయజ్ఞాలు చేయాలి. 

     మన జీవనానికై ఆ హింసలు చేయక తప్పదు. 

    అందులో మొదటిది "ధాన్యాన్ని ఉత్పత్తి చేసేడప్పుడు జరిగే ప్రాణిహింస".  

     అందులో భాగమే ధాన్యాహార స్వీకరణ. 

    దానికి ప్రాయశ్చిత్తం "బ్రహ్మయజ్ఞం". 

    అంటే వేదాధ్యయనం చేయడం - చేయించడం. 


    ఆషాఢ మాసంలో వేదవ్యాసుని జయంతి వస్తుంది కాబట్టి, 

    వేదాలని న్యాసమొనరించి, ఈ రూపంలో అందించిన ఆయనను స్మరించి,  

     వేదాలని కాపాడుకోవడం మన విధి. 

    

ప్రకృతిలో మార్పు - సహజ చికిత్స 


    దేహంనుండీ శ్వేదరూపంలో బయటకు వెళ్ళే నీరు, 

    ఆషాఢంలో ఎండతగ్గి,    

    మూత్రంరూపంలో అధికంగా విడుదల అవుతుంది. 

    వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 

    అతిమూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరగించి అరిగించే శక్తి దానికి ఉందనీ జీవశాస్త్రంలో విద్యార్థులు చదువుతారు. 


గమనించవలసిన విషయాలు 


1. వాతావరణంలోని మార్పుకు దేహం సరి అయ్యే విధంగా, ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడు ఔషధంలా ఉపయోగించడమూ, 

2. బ్రహ్మయజ్ఞం ఆవశ్యకత  గుర్తించి, మన అపూర్వ జ్ఞానరాశియైన వేదాలని కాపాడుకోవడాన్ని బేరీజు వేసుకునే విధంగానూ పెద్దలు మనకిచ్చిన వరం. 


ఆచరణ 


    కాబట్టి మన పెద్దలు ఆషాఢ మాసం సందర్భంగా మనకందిచ్చిన ఆరోగ్య సూత్రాన్ని పాటించి,  ఆరోగ్యాన్ని పొందుతూ, 

    తద్వారా, దాని వెనక ఏర్పరచిన సాంకేతిక కారణాన్ని తెలుసుకొని, 

     శాస్త్రీయ వైదిక విజ్ఞానాన్ని కాపాడుకొందాం. తరువాత తరాలకి అందిద్దాం.  


ప్రవర యొక్క అర్ధం

చతుస్సాగర పర్యంతం

(మానవ పరిభ్రమణానికి నలువైపులా కల మహాసముద్రాల అంచుల వరకూ)... 

గో బ్రాహ్మణేభ్య శుభం భవతు(సర్వాబీష్ట ప్రదాయిణి అగు..గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ)....

×××××××. ఋషేయ ప్రవరాన్విత..

(మా వంశమునకూ..మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ..

త్యాగే నైకే అమృతత్త్వ మానశుః......

అన్న వారి మహోన్నతమైన త్యాగనిష్ఠకు సాక్షీభూతుడనై..

×××××× గోత్రః

(మా గోత్రమునకూ..)


ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ.....

(మా శాఖకూ..అందలి శాస్త్ర మర్మంబులకు..)


శ్రీ * శర్మ నామధేయస్య

( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో..వేదాధ్యయనాది వైదిక క్రతువులతో..

1. స్నానము

2. సంధ్య

3. జపము

4. హోమము

5. స్వాధ్యాయము

6. దేవ పూజ

7. ఆతిధ్యము

8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ..త్రివిధాగ్నులు...

1.కామాగ్ని

2.క్రోధాగ్ని

3.క్షుద్రాగ్ని..

అనే త్రివిధాగ్నులను అదుపులో(సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై..పేరుకు ముందు శ్రీ అనబడే..ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన..

శ్రీ * *శర్మా అనబడే సుశ్రోత్రియుడనైన నేను..జన్మప్రధాతలైన జననీజనకులముందు..  జ్ఞానప్రధాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు..యావత్ ప్రపంచానికే మార్గదర్శకమైన వేదధర్మము ముందు.. నిరాకార నిర్గుణ అవ్యాజ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ ముందు..

అహంభో అభివాదయే..

( కేవలం నేనూ అన్నదిలేక.. సర్వం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ భాగ్యమేయన్న అహంకారభావ రహితుడనై.. నిగర్వినై..త్రికరణ శుద్ధిగా (మనసా,వాచా,కర్మణా) సాష్టాంగ పూర్వక (మానవశరీరంలోని అత్యంత ప్రాధాన్యమైన ఎనిమిది శరీరాంగములనూ శరణాగత హృదయంచే నేలపై వాల్చి సమర్పిస్తున్న)దండ ప్రణామమిదే..అన్న పరిపూర్ణమైన ఆత్మపూర్వక వేదపూర్వక హృదయపూర్వక నమస్కార భావమే.. సశాస్త్రీయమైన ఈ ప్రవరలోని..అర్ధం అంతరార్ధం పరమార్ధం కూడా..

Wednesday, July 5, 2023

తిథులు దేవతలు

ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతి గా వుండటం జరుగుతుంది. అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు..వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి.*

తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురించి.....

పాడ్యమి..

అధిదేవత – అగ్ని. 

వ్రత ఫలం – సత్ఫల ప్రాప్తి.


విదియ :-

అధిదేవత – అశ్విని దేవతలు. 

వ్రత ఫలం – ఆరోగ్య వృద్ది.


తదియ :- 

అధిదేవత – గౌరీ దేవి. 

వ్రత ఫలం – సుమంగళీ అనుగ్రహం.


చవితి:- 

అధిదేవత – వినాయకుడు. 

వ్రత ఫలం – కష్టములు తొలగిపోవుట.


పంచమి:- 

అధిదేవత – నాగ దేవత. 

వ్రత ఫలం – వివాహము, వంశ వృద్ది.


షష్టి :- 

అధిదేవత – సుబ్రహ్మణ్య స్వామి. 

వ్రత ఫలం – పుత్ర ప్రాప్తి.


సప్తమి:- 

అధిదేవత – సూర్య భగవానుడు. 

వ్రత ఫలం – ఆయురారోగ్య వృద్ది.


అష్టమి:- 

అధిదేవత – అష్టమాత్రుకలు. 

వ్రత ఫలం – దుర్గతి నాశనము.


నవమి:- 

అధిదేవత – దుర్గాదేవి. 

వ్రత ఫలం – సంపద ప్రాప్తిస్తుంది.


దశమి:- 

అధిదేవత – ఇంద్రాది దశ దిక్పాలకులు. 

వ్రత ఫలం – పాపాలు నశిస్తాయి.


ఏకాదశి:- 

అధిదేవత – కుబేరుడు. 

వ్రత ఫలం – ఐశ్వర్యము ప్రాప్తించును.


ద్వాదశి:- 

అధిదేవత – విష్ణువు. 

వ్రత ఫలం – పుణ్య ఫల ప్రాప్తించును.


త్రయోదశి:- 

అధిదేవత – ధర్ముడు. 

వ్రత ఫలం – మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.


చతుర్దశి:- 

అధిదేవత – రుద్ర. 

వ్రత ఫలం – మృత్యుంజయము, శుభప్రదం.


అమావాస్య:- 

అధిదేవతలు – పితృదేవతలు. 

వ్రత ఫలం – సంతాన సౌఖ్యం.


పౌర్ణమి:- 

అధిదేవత – చంద్రుడు. 

వ్రత ఫలం – ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...